పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో బేసిస్థానంలో జగణమైన ‘మతాబు’ వల్ల గణదోషం.‘కిలకిల నవ్వు మతాబులు’ అందామా?
మిస్సన్న గారూ, మీ రెండవ పూరణ హాస్యస్ఫోరకంగా ఉంది. అభినందనలు. గోకుడులో ఉన్న ఆనందాన్ని వర్ణించే చాటుపద్యాలు కొన్ని ఉన్నాయి. తెనాలి రామకృష్ణుని ‘అల్లసానివాని యల్లిక జిగిబిగి...’ పద్యంలోని ఈ ‘గుల’ చమత్కారాన్ని ఇంతకు ముందు బాగులో పెట్టానా? నాకు గుర్తు లేదు. పెట్టలేదంటే చెప్పండి. చమత్కారపద్యాలు శీర్షికలో దానిగురించి వివరంగా ఇస్తాను.
కె.ఈశ్వరప్ప గారూ, రంగులపండుగతో మీరు చేసిన పూరణలో అన్వయలోపం ఉన్నట్టుంది. సవరించడమో, మీ భావాన్ని వివరించడమో ఛేయండి. **** మిస్సన్న గారూ, ఆ చమత్కార పద్యాన్ని పోస్ట్ చేశాను. చూడండి. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ****** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ****** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘అల హమాప్ కే’ అన్నప్పుడు గణదోషం. ‘అల హమ్ ఆప్‍కే హై కౌ|ను లోని....’ అనండి.
గురువు గారికి పాదాభి వందనములు నేను గూగుల్ సాఫ్ట్ వేరే వాడతాను ఆన్లైన్ మీ సూచనకు ధన్యవాదములు .అర్ధానుస్వారం ఎలా టైపు చెయ్యాలి ? తెలుపగలరు . కొరుప్రోలు రాధా కృష్ణ రావు
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, నేను బరహా సాఫ్ట్‌వేర్‍ను ఉపయోగిస్తున్నాను. మీరు చెప్పిన గూగుల్ సాఫ్ట్‌వేర్ నా సిస్టంలో లేదు. దానిని చూడాలంటే ముందు డౌన్‍లోడ్ చేసుకోవాలి. మా మేనకోడలు గూగుల్ వాడుతుంది. ఆమె నడిగి తెలిసికొని మీకు చెప్తాను. లేక బ్లాగుమిత్రు లెవరైనా చెప్తే సంతోషం!
KRKR గారూ ... GOOGLE TRANSLATE లో ఎడమప్రక్క క్రింద వైపు 'అ'అని అక్షరం కనిపిస్తంది.. దానిపైన నొక్కి TELUGU INSCRIPT కీబోర్డ్ SELECT చేసుకోండి. అందులో SHIFT నొక్కినపుడు అర్ధానుస్వారం దొరకుఉతుంది
తలపులు వలపులు గలరం
రిప్లయితొలగించండిగుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగ నుండు
న్నిల యాసంక్రాంతి యెగద
కలలను నిక నిజము జేసి కనకము నిచ్చున్
కిలకిల నవ్వుచు మతాబు
రిప్లయితొలగించండిజలజల రాల్చగ సుమాల జల్లుల పాపల్
మిలమిల మెరయు కనుల వెలు-
గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్తగ నుండున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో బేసిస్థానంలో జగణమైన ‘మతాబు’ వల్ల గణదోషం.‘కిలకిల నవ్వు మతాబులు’ అందామా?
మెలమెల్లగ గోకుచు పై
రిప్లయితొలగించండిజిల తగ్గగ వేడినీరు చిమ్ముచు పోయన్
బలెబలె తామర వ్యాధికి
గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్తగ నుండున్.
అయ్యో గురువుగారూ పొరబాటు జరిగింది. సవరణకు ధన్యవాదాలు. సరదాగా ఇంకో పూరణ పెట్టేను.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ హాస్యస్ఫోరకంగా ఉంది. అభినందనలు.
గోకుడులో ఉన్న ఆనందాన్ని వర్ణించే చాటుపద్యాలు కొన్ని ఉన్నాయి. తెనాలి రామకృష్ణుని ‘అల్లసానివాని యల్లిక జిగిబిగి...’ పద్యంలోని ఈ ‘గుల’ చమత్కారాన్ని ఇంతకు ముందు బాగులో పెట్టానా? నాకు గుర్తు లేదు. పెట్టలేదంటే చెప్పండి. చమత్కారపద్యాలు శీర్షికలో దానిగురించి వివరంగా ఇస్తాను.
బలు పెక్కిన పశువుల పరు
రిప్లయితొలగించండిగుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగ నుండున్.
పలకను బట్ట పొగరు గి
త్తలతో పందెము చివరకు తన్నుల కొరకే !
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎలమిని కలిగించు పతం
రిప్లయితొలగించండిగుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగ నుండున్
పలువన్నెలతోసొగసుగ
చలమున నవితేలియాడి సంతోషమిడున్!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారూ మీరు చెప్పిన చమత్కారం మన బ్లాగులో పెట్టినట్లు లేదు. తప్పక పెట్టండి.
రిప్లయితొలగించండిపులికాటు తీరమున పులు
రిప్లయితొలగించండిగుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగనుండున్
పెలికానులప్రదర్శన
చలికాలములోన జరుగు చక్కగ నచటన్ !!!
చిలిపిగ బాల్యము నందున
రిప్లయితొలగించండితొలి యౌవనమందు వేడ్కతో కేళి వలెన్
కలగాముది,హోళీ ర౦
గుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగ నుండున్
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిమిల మిల దివ్వెల వరుసలు
తళతళ పూవులమతాబు తనరగ పలు ర౦
గుల హ౦గుల తోషపు పొ౦
గుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగ నుండున్
కె.ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిరంగులపండుగతో మీరు చేసిన పూరణలో అన్వయలోపం ఉన్నట్టుంది. సవరించడమో, మీ భావాన్ని వివరించడమో ఛేయండి.
****
మిస్సన్న గారూ,
ఆ చమత్కార పద్యాన్ని పోస్ట్ చేశాను. చూడండి.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
******
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
******
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పొలములు దండిగ ఫలమిడ
రిప్లయితొలగించండిపలువిందులతోడ కనుమ పండుగ జరుగన్
తెలుగు జనపదముల పతం
గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రావణ మాసంలో
రిప్లయితొలగించండికలతలుబాసి గృహమ్ముల,
కలలు ఫలించ,కడు భక్తి కమలాలయకై
పలువారమ్ములు, నాడం
గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్
మల్లెల వారిపూరణలు
రిప్లయితొలగించండి1. వెలయగ గణ తంత్ర దినము
నల వృద్ధిని చాటు శకట లలరగ నింపై
పలుగతి హస్తిన నటు రం
గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్
2.పలుగతి హోళీ దినమున
చెలగుచును ప్రజలు కిలకిల చిమ్ముచురంగున్
చెలరేగుచుండ పలు భ౦
గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్
3.అలవిజయవాడ నాంధ్రను
చెలగెడు అభి వృద్ధి తెలుప చెలువగు శకటాల్
పలుగతి గణతంత్రము వెలు
గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్
అలరించు కోళ్ళ పందె
రిప్లయితొలగించండిమ్మలరించును గంగిరెద్దు లాటలు మరియున్
అలరించు ముగ్గుల, పతం
గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్.
కలిగిన రుగ్మతలు తొలగి
రిప్లయితొలగించండిపలుకోర్కులు తీరు కొరకు పంకము నిడుచున్
నెలతలు భక్తిఁ జలుపు భో
గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్
పంకముః పాలు, భొగిః పాము
అల "హమాప్ కే హై కౌ
రిప్లయితొలగించండిను"లోని యొక పాటలో మనోహరమగు చే
ష్టల కవ్వించెడి యాడం
గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్తగ నుండున్.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అల హమాప్ కే’ అన్నప్పుడు గణదోషం. ‘అల హమ్ ఆప్‍కే హై కౌ|ను లోని....’ అనండి.
గురువు గారికి పాదాభి వందనములు
రిప్లయితొలగించండినేను గూగుల్ సాఫ్ట్ వేరే వాడతాను ఆన్లైన్
మీ సూచనకు ధన్యవాదములు .అర్ధానుస్వారం ఎలా టైపు చెయ్యాలి ?
తెలుపగలరు . కొరుప్రోలు రాధా కృష్ణ రావు
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
రిప్లయితొలగించండినేను బరహా సాఫ్ట్‌వేర్‍ను ఉపయోగిస్తున్నాను. మీరు చెప్పిన గూగుల్ సాఫ్ట్‌వేర్ నా సిస్టంలో లేదు. దానిని చూడాలంటే ముందు డౌన్‍లోడ్ చేసుకోవాలి.
మా మేనకోడలు గూగుల్ వాడుతుంది. ఆమె నడిగి తెలిసికొని మీకు చెప్తాను.
లేక బ్లాగుమిత్రు లెవరైనా చెప్తే సంతోషం!
KRKR గారూ ... GOOGLE TRANSLATE లో ఎడమప్రక్క క్రింద వైపు 'అ'అని అక్షరం కనిపిస్తంది.. దానిపైన నొక్కి TELUGU INSCRIPT కీబోర్డ్ SELECT చేసుకోండి. అందులో SHIFT నొక్కినపుడు అర్ధానుస్వారం దొరకుఉతుంది
రిప్లయితొలగించండిమామిత్రులు సి. రామ మొహన్ గారి పూరణ
రిప్లయితొలగించండిఅలరుచు పరుగిడు గిత్తల
మెలకువ తోడను ఉరుకుచు మెట్టిన వేళన్
చెలియలు సంబర పడు పరు
గుల పండుగ జూడ క్రొత్త క్రొత్తగ నుండున్
అలరుచు పరుగిడు గిత్తల
రిప్లయితొలగించండిమెలకువ తోడను ఉరుకుచు మెట్టిన వేళన్
చెలియలు సంబర పడు పరు
గుల పండుగ జూడ క్రొత్త క్రొత్తగ నుండున్
సి. రామమోహన్ గారూ,
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తోడను + ఉరుకుచు’ అన్నచోట విసంధిగా వ్రాయరాదు. ‘మెలకువతో నురుకు లలర మెట్టిన వేళన్’ అనండి.
వెలుగులు చిమ్మెడు రంగుల
రిప్లయితొలగించండినలరెడు సోయగముతోడ నలుచెరగులలో
మెలికలు తిప్పెడు నిలము
గ్గుల పండుగ జూడ క్రొత్త క్రొత్తగ నుండున్
చలిబాపు కొరకు వేగము
కలిగిన వస్తువుల దెచ్చి కాలగ వేయన్
చెలితో కాగెడు నులి య
గ్గుల పండుగ జూడ క్రొత్త క్రొత్తగ నుండున్
అగ్గుల పండుగ=భోగి మంటల పండుగ
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
బలిచక్రవర్తి రాకను
రిప్లయితొలగించండిదెలిపే 'యోనం' దినమున దెప్పల మీదన్
పలు విన్యాసముల సరం
గుల పండుగఁ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్!
తాజా పూరణ
రిప్లయితొలగించండిగులయన నెయ్యది?నును సి
గ్గులదో?మరి వెచ్చదనపు గొర్రెల దౌ ర
గ్గులదో?మది చిత్తగు పె
గ్గుల పండుగ జూడ క్రొత్తక్రొత్తగ నుండున్?
రకరకాల రం " గుల " , హం " గుల " పొం " గుల " పూరణలు చేసిన మిత్రులందరికీ అభినందనలు..
రిప్లయితొలగించండిఇలలో నెన్నియొ వింతలు!
రిప్లయితొలగించండికిలకిల నవ్వుచు పడుచును క్రిందను మీదన్...
అలహాబాదతివల నా
గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్తగ నుండున్
కులసతి భీతిని వణకుచు
రిప్లయితొలగించండికలవర మొందుచును మెండు ఖర్గపు పురిలో
నెలమిని వంగలదౌ రం
గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్తగ నుండున్