22, జనవరి 2015, గురువారం

న్యస్తాక్షరి - 23

అంశం- భగీరథప్రయత్నము
ఛందస్సు- తేటగీతి.
మొదటిపాదం మొదటి అక్షరం ‘భా’
రెండవపాదం రెండవగణం మొదటి అక్షరం ‘గీ’
మూడవపాదం మూడవగణం మొదటి అక్షరం ‘ర’
నాల్గవపాదం నాల్గవగణం మొదటి అక్షరం ‘థి’

18 కామెంట్‌లు:

 1. భాగ్య వశమున గంగను భవుని నుండి
  ఋ షి భ గీ రధు డు భువికి హర్ష మొదవ
  తీసి కొనగను రయమున తేరు మీద
  బయలు దేరెను జూడుమా ధియుత లేమ !

  రిప్లయితొలగించండి
 2. టైపు దోషాలను నివారించటానికి ఛందస్సు సాఫ్టు వేరు చక్కని ఉపకరణము. ఒక అక్షరములో దోషమున్నా గణములో దోషమును చూపుతుంది. తరచుగా టైపు దోషాలతో పోష్టు చేస్తున్న కవి మిత్రులు పై సాఫ్టు వేరులో టెస్టు చేసి పిదప పోష్టు చేస్తే చిన్న చిన్న సవరణలు నివారించ వచ్చు.

  రిప్లయితొలగించండి

 3. భామామణి జిలేబి పొద్దు పొడవక
  గీపెట్టి గీపెట్టి కామింటిన వత్తునా
  రస గుళిక రమ్య తేట గీతి,
  శంకరా!సరి జేయుమా వరూథిని

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  చివరిపాదంలోని న్యస్తాక్షరం ‘థి’.. ధి కాదు. గమనించండి.
  ******
  అన్నపరెడ్డి వారూ,
  ధన్యవాదాలు.
  ******
  జిలేబీ గారూ,
  మీ భావానికి ఛందోరూపం ఇచ్చే పనిని నాకే అప్పగించారు. చూద్దాం.. ఎంతవరకు సఫలమౌతానో?
  భామ యీ జిలేబీ వరువాత వచ్చి
  చేరి గీపెట్టి కామెంటు చేయు వచన
  గీతమందు రహిఁ దేటగీతిఁ జేయఁ
  దెలిపె శంకరుఁడె యతిరథి యనుకొనుచు.

  రిప్లయితొలగించండి

 5. భాను వంశపు రాజుల పాప కర్మ
  కడుగ గీర్తించి బ్రహ్మను గాఢ తపము
  జేసి గంగధార ధరణి జేర్చె శివుని
  తిరుల సాగించి , భాగీరథియన నేడు

  రిప్లయితొలగించండి
 6. భాజనమగు నదులఁగూర్చు భావనగల
  మోడి! గీర్వాణుని వలెనా మోదమిచ్చె
  ననువగు విధము రయమున నాచరించ
  తీరున కఱవు భాగీరథిని మరల్చ?

  రిప్లయితొలగించండి
 7. మల్లెల వారి పద్యము
  భాగ్య మయ్యెను తాతల పాప మడప
  నతడు గీర్వాణ గంగను నడ్డు లన్ని
  దాటి యా భగీరథు డటు తపము జేసి
  తెచ్చి పాలించి ముక్తి ప్రథిత యశుండు

  రిప్లయితొలగించండి
 8. మూడవ పాదం యిలా మార్చాను.

  “ననువగు విధము రయమున కనుగొన"

  రిప్లయితొలగించండి
 9. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  అభినవ భగీరథుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మీరు సవరించిన మూడవ పాదంలో గణదోషం. చివర ‘కనుగొనంగ’ అంటే సరి!
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. భారమును మోపి భవునిపై, పట్టుదలకు
  శ్రమకు గీటురాయిగ నిల్చి, సగరసుతుల
  సద్గతికి పంపి రహియించె స్వస్తటినిని
  భువికి నిడి ఋషి భాగీరథిగను జేసి.

  రిప్లయితొలగించండి
 11. భాలచంద్రుని సిగనుండి జాలువారి
  జపి భగీరథునివెనుక జలజలమని
  సాగెనా సగరసుతుల సన్నిధముకు
  దివిజగంగయె భాగీరథిగ మనెనిల !!!

  రిప్లయితొలగించండి
 12. భాగ్యమందించునీటి-ప్రభావముంచ?
  రభువుగీర్వాణుడేభగీరథుడుగాద?
  రైతులూహించుగంగనురయముగాను
  దింపభువికికశక్తి?ప్రథితముగాద|

  రిప్లయితొలగించండి

 13. భారమగు యమరాపగ పరుగునాప
  నాభగీరథు డర్ధింప నంబ మగడు
  జడల గట్టి ధారగ భువి జార విడువ
  త్రిపథ ఈనాడు భాగీరథి యనబరగె

  రిప్లయితొలగించండి
 14. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సన్నిధముకు’ అనరాదు. ‘సన్నిధమునకు’ అనాలి. అక్కడ ‘సన్నిధి గన’ అనండి.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘భారమగు నమరాపగ’ అనండి.

  రిప్లయితొలగించండి
 15. భావితరములకాదర్శ ప్రాయుడై ని
  లచె భగీరథుడు పితరులకొనగూర్చె
  నాత్మశాంతి తా రప్పించి యవనిపైకి
  త్రిపథగనదియె భాగీరథిగ ప్రతీతి

  రిప్లయితొలగించండి
 16. భావి భారత పౌరుల భాగ్య మంత
  వారి గీతను దిద్దక దారి మళ్లె
  తిరిగి సంపద రప్పించి తీరినంత
  తేజ మెల్ల భరత సారథికిని దక్కు!

  రిప్లయితొలగించండి
 17. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 18. సత్య నారాయణ రెడ్డి గారు,

  మీరు చెప్పిన ఛందస్సు సాఫ్ట్ 'వేరు' బాగుందండి !

  నేను గీ పెట్టిన గీతలకి ముత్యాల సరము ర్యాంకు నిచ్చి అరవై శాతం తో ప్యాసు మార్కులు ఇచ్చింది !!

  శ్రీ కంది వారి తేట గీతి కి నెనర్ల తో

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి