11, జనవరి 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1579 (ఘనుఁడు తిక్కన యష్టదిగ్గజములందు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఘనుఁడు తిక్కన యష్టదిగ్గజములందు.

36 కామెంట్‌లు:

  1. ఉభయ భాషల యందును నిర్భయముగ
    గద్య పద్యము ల్రచి యించ గలుగు నట్టి
    ఘనుడు తిక్కన, యష్ట దిగ్గజము లందు
    ఆంధ్ర కవితాపి తామహు డ ల్ల సాని
    పెద్ద నా మాత్యు డుగదా ర్య ! పెద్ద లనిరి

    రిప్లయితొలగించండి
  2. ఉభయకవిమిత్ర, కవిబ్రహ్మ, యుక్తి పరుడు
    ఘనుఁడు తిక్కన యష్టదిగ్గజములందు
    నుండి యున్నచో నింకెంత మెండుకొనునొ
    భువనవిజయము సాహితీ కవనమందు

    రిప్లయితొలగించండి
  3. కాక తీయ స్వర్ణ యుగపు కవుల కెల్ల
    ఘనుఁడు తిక్కన, యష్టదిగ్గజములందు
    ఎల్ల వేళల ఘనుడౌను అల్లసాని
    ఆంధ్ర సాహిత్యమున వీరె అగ్ర కవులు

    రిప్లయితొలగించండి
  4. అభినవ పరాశర కొమరుడన బరంగు
    ఘనుడు తిక్కన, యష్ట దిగ్గజములందు
    పెద్దనయె సుమ్మ నిజముగ పెద్ద దిక్కు
    గండ పెండేరమున్ గొన్న ఘనుడతండు

    రిప్లయితొలగించండి
  5. భారతము తెనిగించెను భక్తి విరియ
    కవన మల్లుట యందున కవి వరుండు
    ఘనుడు తిక్కన , యష్టదిగ్గజ ములందు
    నాంధ్ర కవితా పితామహు డల్ల సాని

    రిప్లయితొలగించండి
  6. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఔను + అల్లసాని’ అన్నప్పుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. ‘ఘనుఁడగు నల్లసాని’ అనండి.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. ఘనుఁడు తిక్కన యష్టదిగ్గజములందు
    జనుల మెప్పించెడు పురాణ జనుల కథల
    నల్లు స్ఫూర్తిని నింపె తనదు కవిత్వ
    పటిమనున్, భాషపై పట్టు ,ప్రతిభఁ జూపి.

    రిప్లయితొలగించండి
  8. భారతములోని పదునైదు పర్వములను
    దెనుఁగు సేసి సత్కీర్తి విస్తృతి గడించి
    పూర్ణ సత్కవితా బల స్ఫూర్తి నింపె
    ఘనుఁడు తిక్కన యష్ట దిగ్గజములందు !

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    ఘనుఁడు తిక్కన యష్టదిగ్గజములందు
    నిలిచి వారి కాదర్శమై పలుక జేసె
    చక్కని తెనుగు పదములు సంస్కృత౦పు
    శబ్దములను సమాన నిష్పత్తి లోన

    రిప్లయితొలగించండి
  11. శ్రీ కంది శంకరయ్య గారికి - సాదరాభివాదములతో , మీ అనుమతితో - ఈనాటి సమస్యాకు పంపిన పూరణలలో కొన్ని సవరణలు -

    శ్రీ సుబ్బారావు గారి పద్యములో మొదటి పాదమును ' ఉభయ భాషల యందున నుచిత రీతి ' అంటే బావుంటుంది

    శ్రీ బి.యస్.యస్ ప్రసాద్ గారి మొదటి పాదమును "కాకతీయ సువర్ణ యుగమునఁ గవుల" అని మారిస్తే బాగుంటుంది ' కాకతీయ స్వర్ణ ' అన్నప్పుడు , కాకతీయ లోని యకారం గురువై తీరుతుంది కాబట్టి .

    శ్రీ ఎ.సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యము మొదటి పాదాన్ని " అభినవ పరాశరాత్మజుండనఁ బరంగు " అని మారిస్తే బాగుంటుంది , పరాశర కొమరుఁడు దుష్టము .

    రిప్లయితొలగించండి
  12. అన్నట్టు శ్రీమతి లక్ష్మీదేవి గారి పద్యం నా పద్యానికి ' స్ఫూర్తి ' నింపింది కనుక వారికి కృతఙ్ఞతలతో, వారి పూరణలోని మొదటి పాదాన్ని చివరి పాదంగా చేస్తే , పద్య శిల్పం మరింత మెరుగవుతుంది కూడా అని ఒక సూచన .

    రిప్లయితొలగించండి

  13. పదియునైదుయు పర్వముల్ భారతమును
    ఆంద్ర మందున వ్రాసిన యాజ్ఞు డెవడు?
    ఘనుడు తిక్కన.అష్ట దిగ్గజము లందు
    పెద్దనార్యుడు మేటియై పేరు గాంచె

    రిప్లయితొలగించండి
  14. ముక్కు మీదను పద్యమ్ము ముద్దుగాను
    నంది తిమ్మన పలికెను నాడటంచు
    చెప్ప నిట్టుల జరిగెను చిన్న తప్పు
    ఘనుఁడు " తిక్కన " యష్టదిగ్గజములందు.

    రిప్లయితొలగించండి
  15. మల్లెల వారి పూరణ
    తేట తెలుగు పలుకులను తీర్చెనతడు
    ఘనుఁడు తిక్కన యష్టదిగ్గజములందు
    అల్లసాని పెద్దన్నయే నల్లె గాదె
    కమ్ర ప్రబంధమాదిగా కవుల యందు

    జనవరి 11, 2015 10:10 [AM]

    రిప్లయితొలగించండి
  16. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మిత్రుల పూరణపద్యాలలో నా దృష్టికి రాని లోపాలను తెలిపి సవరణలను చూపించినందుకు ధన్యవాదాలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తీర్చె’... టైపాటువల్ల ‘తీర్చే’ అయింది.
    ‘పెద్దనయే యల్లెగాదె’ అనండి.
    చివరిపాదంలో ‘కమ్రప్రబంధ’ అన్నచోట గణదోషం. ‘కమ్రమైన ప్రబంధము కవులయందు’ అందామా?
    ****
    కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భారతమును| ఆంద్ర’మని విసంధిగా వ్రాసారు. ‘భారతమ్ము| నాంధ్ర..’ అనండి.
    ‘ఆజ్ఞుఁడు’ శబ్దానికి మూర్ఖుడని అర్థం. అక్కడ ‘వ్రాసిన యనఘుఁ డెవరు’ అనండి.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. మంచి సవరణ సూచించిన డా. విష్ణు నందన్ గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. గురుదేవులు శంకరయ్యగారికి యాజ్ఞు డనగా యాజి యాగకర్త యని అర్ధము. ఆచార్య జీ యెన్ రెడ్డి గారి
    తెలుగు పర్యాయ పద నిఘంటువు 4317 పద సూచిక
    మీరుసూచించినవిసంధి కిధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  19. ధన్యవాదాలతో.....

    మరొకప్రయత్నం.
    జనుల మెప్పించెడు పురాణ జనుల కథల
    నడుప స్ఫూర్తిని రగిలించి, నాటకీయ
    రచన నైపుణిఁ బెంచెనొ- వచనపటువు,
    ఘనుఁడు తిక్కన- యష్టదిగ్గజములందు.

    రిప్లయితొలగించండి
  20. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మన్నించండి. నేను యడాగమాన్ని దృష్టిలో పెట్టుకున్నానే కాని ‘యాజ్ఞ’ శబ్దం తట్టలేదు. మీ ప్రయోగం సరియైనదే. ధన్యవాదాలు.
    ****
    బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    ధన్యవాదాలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. మనుమసిధ్ధి యాస్ధానమున్ మణిగ వెలుగు
    ఘనుడు తిక్కన, యష్టదిగ్గజములందు
    మేటి పెద్దనామాత్యుని సాటి గలరె!
    మనుచరిత్రను వ్రాసిన మాన్యుడతడు!!!

    రిప్లయితొలగించండి
  22. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. తెలుగుకవులందుసత్కీర్తి|వెలుగునింప?
    ఘనుడుతిక్కన|"యష్టదిగ్గజములందు
    అల్లసానిపెద్దనలాగనలరెనాడు"
    భరతసంస్కృతిచాటగభవితకిపుడు|

    రిప్లయితొలగించండి
  24. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పెద్దనలాగ’ అన్నదాన్ని ‘పెద్దనవలె’ అనండి.

    రిప్లయితొలగించండి
  25. ఘనుఁడు తిక్కన యష్టదిగ్గజములందు
    లేక పోవుట యేమంత లేమి కాదు
    నాటి తిక్కనె యీభువ నవిజయంబు
    అష్ట దిగ్గజములవోలె యలరె నిపుడు

    రిప్లయితొలగించండి
  26. పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘విజయంబు| అష్ట..’ అని విసంధిగా వ్రాయడం సంప్రదాయం కాదు. అక్కడ ‘భువనవిజయంపు| టష్టదిగ్గజములవోలె’ అనండి.

    రిప్లయితొలగించండి
  27. ఘనుఁడు తిక్కన యష్టదిగ్గజములందు
    లేక పోవుట యేమంత లేమి కాదు
    నాటి తిక్కనె యీభువ నవిజయంబు
    నష్టదిగ్గజములవోలె నలరె నిపుడు

    రిప్లయితొలగించండి
  28. పిరాట్ల ప్రసాద్ గారూ,
    సరిపోయింది. సంతోషం.
    ‘భువనవిజయమున| నష్టదిగ్గజములవోలె..’ అంటే ఇంకా బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  29. నాటి పదమూడవ శతాబ్ది తేట తెనుగు
    ఘనుడు తిక్కన , యష్ట దిగ్గజము లందు
    కవులు పదహారవ శతాబ్ది కాల మందు
    కృష్ణ రాయల కిష్టులై కీర్తి గొనిరి!

    రిప్లయితొలగించండి
  30. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి