2, జనవరి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1573 (మద్యపానరతుఁడు మాన్యుఁ డగును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మద్యపానరతుఁడు మాన్యుఁ డగును.

33 కామెంట్‌లు:

  1. రాష్ట్రప్రభుతకధిక రాబడివచ్చును
    మద్యమమ్మకముల మార్గమందు
    తానుచెడియు జేయు త్రాగి మేలుమనకు
    మద్యపానరతుడు మాన్యుడగును

    రిప్లయితొలగించండి
  2. ఎల్ల వేళల మఱి యుల్లాసముగనుండు
    మద్యపానరతుడు , మాన్యు డగును
    మంచి బుధ్ధిగలిగి మానవత్వము తోడ
    మసలు గొనెడు నతడు మహిని యందు

    రిప్లయితొలగించండి
  3. నిదుర లేచినంత నింపుచు గ్లాసును
    డోసు మీద డోసు వేసుకొనుచు
    వాలి తూలు వాడు వ్యసనమ్ము మానిన
    మద్యపానరతుఁడు మాన్యుఁ డగును!!

    రిప్లయితొలగించండి
  4. గురువులు శ్రీ శంకరయ్య గారికి సోదర సోదరీ మణు లందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు


    తాళి బొట్టు నమ్మి తనరుచు త్రాగంగ
    మనసు మమత లేక మైక మందు
    మంచి మార్గ మందు వంచన లేకుండ
    మధ్య పాన రతుడు మాన్యు డగును

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    పద్యం చివర ‘మహిని నెపుడు’ అనండి.
    ****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణలో కొంత అస్పష్టత, సందిగ్ధార్థం గోచరిస్తున్నవి. సవరించండి.

    రిప్లయితొలగించండి
  6. ఇల్లు గుల్ల జేసి యిల్లాలి హించించు
    మద్యపాన రతుడు, మాన్యు డగును
    వ్యసనములను వీడి వ్యాపారము సలుప
    మదిర త్రాగ వలదు మనుజులార!

    రిప్లయితొలగించండి
  7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అవును నాకూ ఏదో వెలితి అనిపించింది కానీ సరిగా అర్ధం కాలేదు ఇలా రస్తే సరిపోతుందేమో

    తాళి బొట్టు నమ్మి తనరుచు త్రాగంగ
    మనసు మమత వీడి మైక మందు
    తప్పు తెలెసి కొనగ దైవ చింతనయందు
    మధ్య పాన రతుడు మాన్యు డగును

    రిప్లయితొలగించండి
  9. విద్యనేర్వనోడు,వినయంబులేనోడు
    వ్యసనభాదలున్న?పసయటంచు
    మద్యపానరతుడు"|మాన్యుడగునుగాదె
    అట్టిగుణములేవిపట్టనోడు
    2ఈతిబాధలున్ననిష్టపడెడివాడు
    మద్యపానరతుడు|మాన్యుడగును
    స్నేహమందుచెడుగుచేర్చనిమనసుండి
    ఆశదోషమణచు,నార్యుడెపుడు|

    రిప్లయితొలగించండి
  10. 1. నీతి నిష్ట లేని నీచులు హీనులు
    స్వార్ధ పరులు కోరు సంఘ మందు
    రావణాశురుండు రాజ్యమ్ము నేలగ
    మధ్యపాన రతుడు మాన్యుడగును
    2. ఇల్లు భ్రష్టు జేసి ఇల్లాల్ని వేధించు
    మధ్యపాన రతుడు , మాన్యు డగును
    వ్యసనములను వీడి వ్యవహరించగ వాడు
    తన్ను నమ్ము వారి దక్ష తెరిగి

    రిప్లయితొలగించండి
  11. పోయి నట్టి దేదొ పూర్తగాఁ దెలియక,
    పోవు నట్టి దేదొ బోధ పడక
    తాగి తూగి రాగ భోగపు వాండ్లకు
    మద్య పాన రతుఁడు మాన్యుఁడగును!

    రిప్లయితొలగించండి
  12. ఉచిత బియ్య మంచు నూరించి వెచ్చించి
    మరల పొందు ప్రభుత మదిర నమ్మి
    నిక్క మెరుగ కుండ సుక్క త్రాగుచు సదా
    మద్యపాన రతుడు, మాన్యు డగును

    రిప్లయితొలగించండి
  13. అక్కయ్యా,
    ఇప్పటికీ మీ పద్యం సంతృప్తికరంగా లేదు. నా సవరణ....
    తాళి బొట్టు నమ్మి తనరుచు త్రాగంగ
    మనసు మమత వీడు మైక మందు
    దైవచింతనమున తప్పు దిద్దుకొనెడి
    మధ్య పాన రతుడు మాన్యు డగును
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలోే ‘నేర్వనివాడు, లేనివాడు’ శబ్దాలను ‘నేర్వనోడు, లేనోడు’ అని గ్రామ్యంగా ప్రయోగించారు. మీ మొదటి పూరణకు నా సవరణ......
    విద్య లేనివాడు, వినయదూరుండయి
    వ్యసనపరుడు గాగ బాధపడును
    మద్యపానరతుడు"|మాన్యుడగునుగాదె
    అట్టిగుణములేవిపట్టనోడు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘ఇల్లాల్ని’ అనడం గ్రామ్యం. ‘ఇల్లాలి నేడ్పించు’ అనండి.
    ‘దక్షత + ఎఱిగి’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. చిత్తు గాను త్రాగి మత్తులోన మునుగు
    మద్యపాన రతుడు, మాన్యుడగును
    చెత్త మందు వీడి చిత్తమందున భక్తి
    విత్తు నాట బొందు విమల యశము!!!

    రిప్లయితొలగించండి
  15. బాధ్యతలనెఱింగి పరమోత్తమంబైన
    విష్ణు కీర్తనములఁ వినుతిఁజేసి
    దుష్టవర్తనములఁ దొలగించుచును వీత
    మద్యపాన రతుఁడు మాన్యుఁడగును

    రిప్లయితొలగించండి
  16. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. అక్షరములు నేర్చి ఆనందమును బొంది
    పద్యపానరతుడు భాగ్యుడగును
    భగ్నప్రీతుడౌచు పార్వతి "దాసుడై"
    మద్యపానరతుడు మాన్యుడగును
    "దేవదాసు"

    రిప్లయితొలగించండి
  18. గురు వర్యులకు ధన్యవాదములు
    ఇల్లు భ్రష్టు జేసి ఇల్లాలి నేడ్పించు
    మధ్యపాన రతుడు , మాన్యు డగును
    వ్యసనములను వీడి వ్యవహరించగ వాడు
    తన్ను నమ్ము వారి దక్షతగని

    రిప్లయితొలగించండి
  19. రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. మద్యపానమెంతొ మత్తు నిచ్చిననైన
    సత్యమదియె పలుకు సరగు నతడు
    చేటుగూర్చు నదియె చెరచిన స్వాస్థ్యమ్ము
    మద్య పానరతుడు మాన్యుడగును

    పెళ్ళి,చావునైన,పెద్దైన పార్టీల
    నేడు గొప్పదనుచు నిడరె మద్య
    మదియ,గొననివాడు మర్యాద హీనుడౌ
    మద్యపానరతుడు మాన్యుడగును

    కష్టపడెడి కూలి కష్టంబు మరువగా
    మద్యమదియ గొనును మాయ,నొప్పి
    కాని గొప్పవారు కలిమి చిహ్నమనరె?
    మద్యపానరతుడు మాన్యుడగును

    మంచి వీడకుండ మరువగా చెడుచేష్ట
    మద్య సేవనంబు మార్గమనుచు
    మహిని గొనరె వారు,మాన్యమౌ బుద్ధిని,
    మద్యపానరతుడు మాన్యుడగును

    చలనచిత్రములను సాధువనుచు జూప,
    మద్యపానమెంతొ మహితమనగ
    చూచువారు దానిసొంపుగా నెంచరే
    మద్యపానరతుడు మాన్యుడగును

    ఆటవెలది తోడ నాటలాడెడివారు
    పనియు, పాటు లేని వ్యసనపరులు
    చుట్ట,కిళ్ళిలవియె సొంపైన వనుచును
    మద్యపానరతుడు మాన్యుడగును

    రిప్లయితొలగించండి
  21. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. కృతయుగమ్మునందు హితమె యాగవిధికి
    కలిని ధర్మశాస్త్ర్ర బలిమిలేదు
    చక్రయాగమన్న ప్రక్రియలోనున్న
    మద్యపానరతుడు మాన్యుడగును

    రిప్లయితొలగించండి
  23. మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. తెలిసితెలియనట్టికలుషితమనసున్న?
    మద్యపానరతుడు|"మాన్యుడగును
    పరులమేలుగూర్చుపరమాత్మభావాలు
    చేసిచూపగలుగుచింతయున్న
    2దైత్యగురువుశుక్రదయచేతబ్రతికినా?
    చచ్చినట్టిశిష్యుడొచ్చెనెట్లు?
    మద్యపానరతుడు-మాన్యుడగునుగాన
    శిష్యుడల్లుడాయెచింతలేక

    రిప్లయితొలగించండి
  25. కలిమిబలిమినమ్మికాంక్షలుబెరుగంగ
    మద్యపానరతుడు|"మాన్యుడగును
    విద్య,బుద్దినేర్పి-వేదనమాన్పించ?
    లోకహితముబెంచుశోకహరుడు

    రిప్లయితొలగించండి
  26. శ్రీతిమ్మాజీరావుగారిపూరణం
    మిరపకాయబజ్జి,కొరికితినుచుకల్లు
    త్రాగువాడుకడు-దురాత్ముడనగ
    బీరు,బ్రాంది,స్కాచి,విస్కీలు,వోడ్కాల
    మద్యపానరతుడుమాన్యుడగును
    2

    రిప్లయితొలగించండి
  27. శ్రీగురుమూర్తిగారిపూరణం
    ఆస్తిగుల్లజేసిఆలుపిల్లలవీడి
    బరువుభాధ్యతలనుమరచిపోయి
    చింతవంతనింకచీమంతయునులేని
    మద్యపానరతుడుమాన్యుడగును
    2ఎరుపుకనులతోడనేల్లవారినిదిట్టి
    త్రోవలోనతూగితొంగునతడు
    తెగులుసోకిఫైకితృప్తిగాజనునట్టి
    మద్యపానరతుడుమాన్యుడగును

    రిప్లయితొలగించండి
  28. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘వచ్చె’ను ‘ఒచ్చె’ అన్నారు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది.అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. కరిగి పోయ వత్తి కాంతి నిచ్చు నటుల
    కల్లు త్రాగి చెడుతు కాసు లిచ్చి
    యమ్ము వాని, ప్రభుత అక్కర దీర్చుచు
    మద్యపానరతుఁడు మాన్యుఁ డగును.

    రిప్లయితొలగించండి
  30. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. సత్యవాది యిచట చవటయనబడును
    మద్యపానరతుఁడు మాన్యుఁ డగును
    లోక రీతి చూసి లోయవెంటచనకు
    జనుల మెప్పు కొరకు జారిపోకు

    రిప్లయితొలగించండి