పోచిరాజు సుబ్బారావు గారూ, తప్పించుకొని వెక్కిరించే పద్దతిలో సాగింది మీ పూరణ(?). బాగుంది. అభినందనలు. **** మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘కీర్తి + అప్డు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘కీర్తియె’ అనండి. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులారా! మన రచనలను సాధ్యమైనంత వరకు వ్యాకరణ బద్ధముగా నుండుటకే ప్రయత్నము చేయవలెను. కొందరు మహాకవులు వ్యాకరణ విరుద్ధములైన ప్రయోగములు చేయుటయు వాటిని "ఆర్య వ్యవహారములు గా" వదిలివేయుటయు జరిగినది. సమాసములలో పూర్వపదము చివరన "న్" లేక "ల్" వంటి వర్ణములు ఉన్నప్పుడు పర పదము "అ" కారము వంటి అచ్చుతో మొదలగునప్పుడు సంధి కార్యము ఎట్లుండును? ఉదా: వానిన్ + అక్కడ = వానినక్కడ (సాధు ప్రయోగము) ‘వానిన్నక్కడ’ అని సాధించుట వ్యాకరణ సమ్మతము కాదు. కొందరు పూర్వ కవులు ఎందరో వర్తమాన కవులు ఈ విషయమును గమనించుట లేదు. నా ఉద్దేశములో అట్టి దోష ప్రయోగములను చేయకుండుట మంచిది. పూర్వపదము సంస్కృత పదము అయినప్పుడు పర పదము అచ్చుతో ప్రారంభమయినప్పుడు సంధి కార్యము ఈ క్రింది విధముగా నుంటుంది: కస్త్వం + అనెను = కస్త్వమ్మనెను; తుభ్యం + అనుచు = తుభ్యమ్మనుచు. ఈ సూత్రమును కేవల తెలుగు సంధులకు అన్వయించుట తగదు. ఉంచెన్ + ఇక్కడ = ఉంచెనిక్కడ మాత్రమే అగును. ఉంచెన్నిక్కడ అని వాడరాదు. అటులనే: వచ్చెన్ + అంతట = వచ్చెనంతట మాత్రమే అగును. వచ్చెన్నంతట అని సంధి చేయరాదు. అందరకీ శుభాభినందనలతో. స్వస్తి! పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
నేను “పనులన్నక్రమ, రమున్నమ్మ,ప్రొద్దునన్నలసట” అని సందులు చేశాను. కొందరు కవిమిత్రులు కూడా పై సంధులు చేస్తున్నారు. పండిత నేమాని వారు అవి వ్యాకరణ సమ్మతం కాదు అనిచెప్పారు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీరు చెప్పిన వాస్తవము. అయితే ఇటువంటి ప్రయోగాలు మనకు పోతన కవిత్వంలో ఎక్కువగా కనిపిస్తాయి. తప్పని పరిస్థితులలో తప్ప తరుచుగా ఇటువంటి ప్రయోగాలు చేయరాదని కవిమిత్రులకు నా సూచన. ఇకనుండి ఇటువంటి ప్రయోగం ఏదైనా కనిపించినప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కక గ గ తత నన లు గర్ణుని దానగు
రిప్లయితొలగించండిణమును దెలుపు టక్క రములు గాని
వ్రాయ జేత గాదు వ్రాయలే నిప్పుడు
దయను జూడు నన్ను దాన కర్ణ !
జంకక చయ్యన నిచ్చును
రిప్లయితొలగించండిగొంకక వలె ననగ సతము కూరిమి నర్థిన్
వంకలు బెట్టక తతరతిఁ
శంకర! గగనమ్ము హద్దు సరి కర్ణునకున్ .
కోర హరికి నిచ్చె కవచ కుండలముల
రిప్లయితొలగించండిమరణ దేవత తనచెంత తిరుగు చుండ
రయమున నరహరికి పన్ను లాగి యిచ్చె
తాక కర్ణుని కీర్తప్డు ధరను మించి
గగన తలము, తనయు ప్రభా కరుడు మెచ్చె
శంక లేక కర్ణ స్వర్గపతియడుగ
రిప్లయితొలగించండిగవచ కుండలములు గత్తి రించె
దాన నమ్ర తలన ధరణీశు డాతండు
సూత తనయు డట్టి దాత కలడె
రిప్లయితొలగించండిప్రతి సరమున నర్ధికి తా,
సతతము, నడుగగ నొసంగు స్వాభావ్యముగా
ప్రతి పలుకక, కర్ణుడయెన్
వితరణ శీలిగ జగాన విఖ్యాతు౦డై
కాస్త కరుణ లేక కవచకుండలములు
రిప్లయితొలగించండిదాన మడుగ గట్టుదాయ కొసగె
గాన నతని వంటి దానకర్ణులు లేరు
సూత తనయుడయ్యె సూర్యజుండు !!!
మల్లెల వారి పూరణ
రిప్లయితొలగించండిఎవ్వడే నడుగగను తా నింపు నిడును
లేదు పలుకక దానమ్ము లిమ్ము జేసె
దాన నాత౦డు సంతత ధార్మికు డయె
సర్వులు ననరే దానంపు సౌరభు౦దు
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పద్యము
రిప్లయితొలగించండిసూత తనయునిచే తన సూనుడింక
కదనమున నణగునంచును కదలి వచ్చి
కవచ మడుగగ సుంత జంకక యొసంగె
ఆ వికర్తన సుతుడు స్వర్గాధిపతికి
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండితప్పించుకొని వెక్కిరించే పద్దతిలో సాగింది మీ పూరణ(?). బాగుంది. అభినందనలు.
****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కీర్తి + అప్డు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘కీర్తియె’ అనండి.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులారా!
రిప్లయితొలగించండిమన రచనలను సాధ్యమైనంత వరకు వ్యాకరణ బద్ధముగా నుండుటకే ప్రయత్నము చేయవలెను. కొందరు మహాకవులు వ్యాకరణ విరుద్ధములైన ప్రయోగములు చేయుటయు వాటిని "ఆర్య వ్యవహారములు గా" వదిలివేయుటయు జరిగినది. సమాసములలో పూర్వపదము చివరన "న్" లేక "ల్" వంటి వర్ణములు ఉన్నప్పుడు పర పదము "అ" కారము వంటి అచ్చుతో మొదలగునప్పుడు సంధి కార్యము ఎట్లుండును?
ఉదా: వానిన్ + అక్కడ = వానినక్కడ (సాధు ప్రయోగము)
‘వానిన్నక్కడ’ అని సాధించుట వ్యాకరణ సమ్మతము కాదు. కొందరు పూర్వ కవులు ఎందరో వర్తమాన కవులు ఈ విషయమును గమనించుట లేదు. నా ఉద్దేశములో అట్టి దోష ప్రయోగములను చేయకుండుట మంచిది.
పూర్వపదము సంస్కృత పదము అయినప్పుడు పర పదము అచ్చుతో ప్రారంభమయినప్పుడు సంధి కార్యము ఈ క్రింది విధముగా నుంటుంది:
కస్త్వం + అనెను = కస్త్వమ్మనెను;
తుభ్యం + అనుచు = తుభ్యమ్మనుచు.
ఈ సూత్రమును కేవల తెలుగు సంధులకు అన్వయించుట తగదు.
ఉంచెన్ + ఇక్కడ = ఉంచెనిక్కడ మాత్రమే అగును. ఉంచెన్నిక్కడ అని వాడరాదు. అటులనే:
వచ్చెన్ + అంతట = వచ్చెనంతట మాత్రమే అగును. వచ్చెన్నంతట అని సంధి చేయరాదు.
అందరకీ శుభాభినందనలతో. స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
నేను “పనులన్నక్రమ, రమున్నమ్మ,ప్రొద్దునన్నలసట” అని సందులు చేశాను. కొందరు కవిమిత్రులు కూడా పై సంధులు చేస్తున్నారు. పండిత నేమాని వారు అవి వ్యాకరణ సమ్మతం కాదు అనిచెప్పారు.
రిప్లయితొలగించండిరవి మాట వినక కర్ణుడు
రిప్లయితొలగించండిదివిజుల రాజడుగ గని యతిముదమ్ము న న
చ్చెవికిగల కుండలములన్
దివి దైవతతతియు బొగడ దీసి యొసంగెన్.
గగనమందునసూర్యుడు-గాచిచూసి
రిప్లయితొలగించండిఇంద్రరాక?కర్ణునికెరిగించియున్న?
దానమన?నమ్మెడిగుణనిదానపరుని
దాత|తలగీతమార్చునా?దానకర్ణ
గగన మందలి దేవత ల్గారవించ
రిప్లయితొలగించండినాననము నందు సంతస మగుపడంగ
జంకక యెపుడు సతతము జరిపి యతడు
దాన కర్ణ గ బేరొందె మాన నీయ !
ఎరుగగనేరడు లేదన
రిప్లయితొలగించండివెరవక కర్ణుండుతాను వెతలకునైనన్
నెరపెను సతతము దానము
ధరననదగు ప్రథిత ధర్మదాతగ యితనిన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీరు చెప్పిన వాస్తవము. అయితే ఇటువంటి ప్రయోగాలు మనకు పోతన కవిత్వంలో ఎక్కువగా కనిపిస్తాయి. తప్పని పరిస్థితులలో తప్ప తరుచుగా ఇటువంటి ప్రయోగాలు చేయరాదని కవిమిత్రులకు నా సూచన. ఇకనుండి ఇటువంటి ప్రయోగం ఏదైనా కనిపించినప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అగణితకీర్తి కౌముది,దయామతి,బొంకక దాన శీలతన్
రిప్లయితొలగించండిగగనచరుల్ భళీ యనగ , జ్ఞానవరుల్ వినుతింప , నిత్యమున్
సుగతి చరించి,సంతతముశోభిలి,ఆయువుపట్టులైన నీ
నగలనొసంగి మించితివినమ్ర సుధానన కర్ణ ధీమణీ
మద్దూరి రామమూర్తి .
కర్నూల్.
మద్దూరి రామమూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.