చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘మధుర మరిసెయౌ’ అనండి. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘చిత్రమందున నరిసెలు’ అనండి. **** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. చివరి పాదంలో గణదోషం. ఆ పాదానికి నా సవరణ...‘నెయ్యమ్మును పెంచు నందు నే నరిసెలుగా’
లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, అభినందనలు. మీ పద్యంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. ఎందుకంటే సంక్రాతికి ఎన్నోరకాల పిండివంటలు చేసినా మా మనుమడు కేవలం అరిసెల డబ్బానే చూపిస్తున్నాడు. ***** దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు గారూ, మీ ‘అరిసెలు’ ఖండికను గురించి ఏమని ప్రశంసించినా తక్కువే. అభినందనలతో కూడిన నమస్కృతులు. బెల్లం పాకాన్ని సరిగా శుద్ది చేయలేదేమో... అరిసెలో చిన్న కర్రముక్క వచ్చింది. అదే మూడవ పద్యంలో ‘పితృ’ అన్నచోట గణదోషం. ఆ రెండూ లఘువులే కదా! ‘పితరులైనవారి ప్రియమైన...’ అంటే ఎలా ఉంటుంది? ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘కరుగును + ఉల్లము’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘కరుగుచు| నుల్లము...’ అనండి. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. మొదటిపద్యంలో ‘సరసాలతొ’ అని విభక్తిప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ ‘సరసమ్ముల సాగుచున్న...’ అనండి. (తృతీయార్థంలో ద్వితీయ). ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘వెల్లివిరియ| నిల్లు...’ అనండి. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వరిపిండిని దంచి కలుప
రిప్లయితొలగించండిసరియగు పాకముగనుడుకు చక్కర యందున్
కరముల నదిమిన పిండిని
మరగెడు తైలమునవేయ మధురయరిసెయౌ
చిత్ర మందున యరిసెలు జెన్ను మీరి
రిప్లయితొలగించండికాన బడుచుండె జూడుము కన్ను గవను
నీకు జేయుట వచ్చునా ?నిజము చెప్పు
వచ్చు నెడలను జేయుము వారి జాక్షి !
వియ్యాలవారి విందుకు
రిప్లయితొలగించండికయ్యము రాకుండు నటుల కతుకుట కొరకున్
బియ్యము దంచిన పిండిని
నెయ్యము పెంచు నటంచు నేతి యరిసెలనంగా
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మధుర మరిసెయౌ’ అనండి.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చిత్రమందున నరిసెలు’ అనండి.
****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. ఆ పాదానికి నా సవరణ...‘నెయ్యమ్మును పెంచు నందు నే నరిసెలుగా’
ధన్య వాదములు
రిప్లయితొలగించండినేనింకా మొదటి పాదం గణదోషం అనుకుంటున్నాను
రిప్లయితొలగించండిఅదిరెడి అతి రసంబు లెట్టి
అదిరెడి అంత్యానుప్రాసములతో
అదిరెడి 'కామింటురసము'లతో
అదిరెడి సురస శంకరా !'సహభేషు' !
శుభోదయం
జిలేబి
బెల్లమున్ పాకముగఁ జేసి బియ్యపు పొడిఁ
రిప్లయితొలగించండిజేర్చి నేతితో ముద్దగఁ జేసి, చేతి
తోడ నొక్కుచు కడు తుష్టి తోడ మహిళ
లందరుకలసి చేయుదు రరిసెలిపుడు
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండి_/\_
****
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నేతిన వేగిన నరిసెల్
రిప్లయితొలగించండిప్రీతిగ తినుచుందురంత వేడుకలందున్
రీతిగ జేయుదు రిండ్లన్
ఖ్యాతినిగొనె నతిరసమ్ము కమ్మని రుచితో!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
అత్రసములనుఁ దినుటకయి
రిప్లయితొలగించండియాత్రముఁ జూపింపనేమి యగు? నేర్వంగన్
మాత్రము ముందుకుఁ జనరీ
చిత్రముఁ గనుడమ్మనింతి చేమంతుల్.
అత్రసములనుఁ దినుటకయి
రిప్లయితొలగించండియాత్రముఁ జూపింపనేమి యగు? నేర్వంగన్
మాత్రము ముందుకుఁ జనరీ
చిత్రముఁ గనుడమ్మనింతి చేమంతులిటన్.
నరులకు వరముగ దొరకెసు
రిప్లయితొలగించండిధరణిని హరువగు నరిసెలు తరుణుల చలువన్
మరువ దరమవదు తమరొక
పరి తిన నిది తమకగునొక వ్యసనము సుమ్మా!
(అతిశయోక్తి అయిందా?)
బియ్యము నానబెట్ట వలె, పిమ్మట పిండిగ చేసుకోవలెన్,
రిప్లయితొలగించండిచయ్యన బెల్లమున్ జలము సన్నని మంటను పాకమేర్పడన్
తియ్యగ జేసి, పిండినట తీరుగ జేరిచి, నువ్వుపప్పుతో
రయ్యన కల్పి, వత్తవలె రంగుగ అప్పము లట్లు మెల్లగా.
నూనె మరగ నిచ్చి నోరూరు రీతిగా
వత్తి నట్టి వాని వైచి యందు
కాస్త వేగ నిచ్చి గట్టిగా పిండిన
అద్భుతంపు రుచుల నరిసె కుదురు.
పితృదేవతలకు ప్రియమైన వంటగా
నరిసె పేరుగాంచె, పరిణయంపు
వేళ మధురమైన పిండివంట యిదంచు
మంచి కీర్తి బొందె మహిని యిద్ది.
అరిసె తినిన వారి కారు మాసములకు
నాకలుండ దనుదు రందు చేత
అతిగ తినిన మీకు నగ్నిమాం ద్యమ్మగు
మితము తీసుకొనిన మేలు మేలు.
బెల్లపు పాకంబైనను
రిప్లయితొలగించండితెల్లని శర్కరను గూడ తెలియుచు జేయన్
మెల్లగ నోటన్ కరుగును
యుల్లము రంజిల్ల నరిసె లూరించు గదా !
మిస్సన్న గారూ ! అరిసె ! కేక....
రిప్లయితొలగించండిఅరిసెలరుచినెట్లుండును?
రిప్లయితొలగించండిసరసాలతొ-సాగుచున్నసంభాషణలా|
మరినిటగనిపించినవో?
మరచినరుచినూహకుంచి|మైమరచుటయే|
తినుటకుగారెలురుచియని
రిప్లయితొలగించండివినుటకుభారతముమంచివిజ్ఞతనెటులో
అనువగుబియ్యపుమార్పులు
మనసులుగ్రహియించినపుడెమాధుర్యమగున్
కే*ఈశ్వరప్పగారిసమస్యాపూరణ
ఉదయకిరణాలసొబగులు
మదిలోఆలోచనాలుమలచెడిమమతా
వదనపురవినింగిగనగ
కదలెడితిరుణాలవోలెకనుపించునుగా
తినుటకుగారెలురుచియని
వినుటకుభారతముమంచివిజ్ఞతనెటులో
అనువగుబియ్యపుమార్పులు
మనసులుగ్రహియించినపుడెమాధుర్యమగున్
కే*ఈశ్వరప్పగారిసమస్యాపూరణ
ఉదయకిరణాలసొబగులు
మదిలోఆలోచనాలుమలచెడిమమతా
వదనపురవినింగిగనగ
కదలెడితిరుణాలవోలెకనుపించునుగా
పెళ్లి కూతు రత్తింటికి వెళ్ళు వేళ
రిప్లయితొలగించండిపసుపు కుంకుమ తో పాటువంద వంద
అరిసెలప్పాలు సున్నుండ లంపు చుంద్రు
లడ్లు మైసూరు పాకులు లక్షణముగ
బంధువులకు మిత్రులకును పంచిపెట్ట
వలయు కడుపు చల్లగ సంతు కలుగుటకును
పిల్లపాపలతో నిల్లు వెల్లివిరియ
యిల్లునూరిండ్లు యగుచువర్ధిల్లు టకును
ఎరుపు రంగున వేగిన యరిసెలు తిన
నారు నెలల క్రిందటి రోగ మతిశయిల్లు
ననుచు తెలిపిరి భిషగులు అందువలన
మితముగా తిను మన్న నా హితవు వినుడు
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పద్యము
రిప్లయితొలగించండిఅనురక్తిన్ గన తీపిగారె మధుమేహగ్రస్తు డత్యాసతో
తినగా నె౦చియు మెక్క జాలడటులే ధీశక్తి శీలు౦ డికన్
ఘనకార్యాచరణాభిలాషి యయినన్ నైరాశ్య భావమ్ము తో
వెనుదీయున్ గద వారి రక్షణము గావి౦చున్ జగన్నాథు డే
తులలో తూచియు దినుసుల
రిప్లయితొలగించండికలబోసియు పాకు బట్టి కాల్చ నతిరసాల్!
తిల లతికించియు దినగన్
వలలుండైనను నిలువడె వరుసను నేర్వన్!
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
అభినందనలు. మీ పద్యంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. ఎందుకంటే సంక్రాతికి ఎన్నోరకాల పిండివంటలు చేసినా మా మనుమడు కేవలం అరిసెల డబ్బానే చూపిస్తున్నాడు.
*****
దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు గారూ,
మీ ‘అరిసెలు’ ఖండికను గురించి ఏమని ప్రశంసించినా తక్కువే. అభినందనలతో కూడిన నమస్కృతులు.
బెల్లం పాకాన్ని సరిగా శుద్ది చేయలేదేమో... అరిసెలో చిన్న కర్రముక్క వచ్చింది. అదే మూడవ పద్యంలో ‘పితృ’ అన్నచోట గణదోషం. ఆ రెండూ లఘువులే కదా! ‘పితరులైనవారి ప్రియమైన...’ అంటే ఎలా ఉంటుంది?
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘కరుగును + ఉల్లము’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘కరుగుచు| నుల్లము...’ అనండి.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యంలో ‘సరసాలతొ’ అని విభక్తిప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ ‘సరసమ్ముల సాగుచున్న...’ అనండి. (తృతీయార్థంలో ద్వితీయ).
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘వెల్లివిరియ| నిల్లు...’ అనండి.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
బాగా చెప్పేరు గురువుగారూ కొంచెం లేత పాకం అన్నమాట. పదును చేసినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపాళ్ళు సరిజేసి అరిసె రుచిని పెంచారు..ధన్యవాదములు..మాస్టరుగారూ !
రిప్లయితొలగించండిబెల్లపు పాకంబైనను
తెల్లని శర్కరను గూడ తెలియుచు జేయన్
మెల్లగ నోటన్ కరుగుచు
నుల్లము రంజిల్ల నరిసె లూరించు గదా !