చంద్రమౌళి సూర్యనారాయణ గారూ - తినినన్+ ఎంతరు చియొ - యతి "ఎ" కే వేయాలి.ఇది తెలుగు పండితులు నాకు తెలిపిన విషయం. చంద్రమౌళి రామా రావు గారి అభిప్రాయం తీసుకొని నాకు కూడా తెలియ జేయండి.
చిన్న తనము లోను చీయంటి బీరనూ పెద్దయైన పిదప ప్రేమ బెరిగె లేత బీరకాయ లెస్సైన కూరగా వలపు జూప నాకు వగపు లేదు A.Satyanarayana Reddy గారు ఇప్పుడు సరి పోయిందా?
తినినన్+ ఎంతరు చియొ - యతి "ఎ" కే వేయాలి మీరన్నది సబబే. ఆ విధమైన యతిమైత్రిని "అఖండయతి" అంటారు. శుద్ధ తప్పు అని చెప్పలేము కానీ లాక్షణికులు ఈ విధమైన యతిమైత్రిని ఒప్పుకోరు. కొందరు ఉద్దండ కవిశేఖరులు కూడా ఈ విధమైన యతిమత్రిని వేశారు. కానీ ఈవిధమైన యతిమత్రిని వీలైనంత వరకు ఉపయోగించక పోవడము మంచిదనే అభిప్రాయము చాలా మంది కవులలో ఉంది. వాడడము తప్పు కాదు.
శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణగారూ, నొప్పించి వుంటే క్షమించండి.
బీరకాయ యనిన ప్రియము నాకెంతయో
రిప్లయితొలగించండిపప్పుదీనిచేయ గొప్పరుచిర
పచ్చడైనచేయ వచ్చును బీరతో
నేయికలపితినిన నెంత రుచియొ
చిత్ర మందున బెట్టిరి చెలువు గాను
రిప్లయితొలగించండిబీరకాయలు లేతవి యాఱు చూడు
నచ్చి , వాటిని కసకస నమలి మ్రింగ
నూరు చున్నది నానోరు మేరి ! కంటె
బీరలు వంటికి మంచిది
రిప్లయితొలగించండిబేరము లేకుండ తినిన బీరము చెడదే
నీరము నిండిన శాకము
కూరలలో శ్రేష్ట మనుచు కొనియాడె దరే
బీరకాయలోన పీచు మెండుగ (దండిగ)నుండు
రిప్లయితొలగించండిశుభ్ర పఱచి కడుపు, సుఖమునిచ్చు
బీరుగొనుట మాని బీరకాయ తినిన
రోగబారి పడరు రూఢి గాను
పద్య విద్యలో అడుగిడి తక్కువ సమయంలోనే అన్నిరకముల పద్యములను అవలీలగా వ్రాస్తున్న చంద్రమౌళి సూర్యనారాయణ గారికి అభినందనలు.
రిప్లయితొలగించండిలేత బీరకాయ చేతనత్వము బెంచు
రిప్లయితొలగించండిముదిరెనేని దాని ముట్టరెవరు
బాల్యమందె బుద్ధి వర్ధిల్ల వలయును
బీరకాయ లోని సారమిద్ది .
మద్దూరి రామమూర్తి
కర్నూల్
బీరములేనిబీరయన?బీదకయిష్టముగాదునెప్పుడున్
రిప్లయితొలగించండికోరినరీతిగోసిమనకోర్కెలమేర-మసాలనింపుచున్
చేరిననూనెతోనుడికిచెంతనజేరుచపాతి,రొట్టెతో
తీరికచేతతిండిదిన?దెల్పగపుష్టికినౌషదంబగున్
ఆకుపచ్చగనుండి నచ్చెరువుగొలుపు
రిప్లయితొలగించండి........బీరకాయలుగన సౌరు లొలుకు
గూర జేయనివియె గొనియాడు నందరు
.........పప్పు జేయగ నొప్పు గొప్ప రుచిగ
నూలు పొడిని జల్ల నోరూరు జనులకు
.........పచ్చడైన తినగ వహవ యనరె
గుత్తి బీరను వండ ఘుమఘుమ లాడుచు
..........చిచ్చర కంటైన మెచ్చు గాదె
వసుధలోన నిదియె పత్యంపు గూరగా
వాసిగాంచు బీర బలము నిడును
సులువుగాను వండు చెలువలందరుదీని
పొడుగు బీర నిన్ను బొగడ తరమె !!!
అందరికిని చాల దారు బీరలకూర
రిప్లయితొలగించండిరెండు వ్యంజనములు వండు నేడు
చెల్ల బోదు తల్లి చిరుచేదు తోచినా
తప్ప దింక చేయి దప్పళమును
బీరకాయ బజ్జి ప్రీతిగా దలవగా
రిప్లయితొలగించండినీరు ఊరి నోరు నిండు జూడు
బీర పొట్టు కూడ బేషుగా కూరౌను
బీర తోటి వంట బ్రియము నాకు
బీర కాయను జూడగా పిలచినటుల
రిప్లయితొలగించండిపలుకు కొన్ని జ్ఞాపకములు పసి తనమున
అమ్మ పెట్టిన పథ్యము అమృతమిపుడు
తెచ్చు కొన్నను జ్వరమమ్మ తిరిగి రాదు
చిన్న తనము లోను చీయంటి బీరనూ
రిప్లయితొలగించండిపెద్దయైన పిదప ప్రేమ బెరిగె
లేత బీరకాయ లెస్సైన కూరగా
ఒప్పు కొనుట కిపుడు నొచ్చుకోను
శౖలజ గారూ - బీరకాయపై చక్కని సీసపద్యం వ్రాశారు. అభినందనలు. "చిచ్చర కంటైన" - అర్థం తెలియ జేయండి.
రిప్లయితొలగించండిసుసర్ల నాగజ్యోతి గారూ చక్కని పద్యం వ్రాశారు. అభినందనలు. నాలుగవ పాదం యతి తప్పినట్లుంది. సరిచేయండి.
రిప్లయితొలగించండిపెద్దలు అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డి గారికి ధన్యవాదములు. మీపంటి పెద్దల సాహచర్యఫలం
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ - తినినన్+ ఎంతరు చియొ - యతి "ఎ" కే వేయాలి.ఇది తెలుగు పండితులు నాకు తెలిపిన విషయం. చంద్రమౌళి రామా రావు గారి అభిప్రాయం తీసుకొని నాకు కూడా తెలియ జేయండి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డిగారికి ధన్యవాదములు...చిచ్చరకంటి,.... శివుడికి మరోపేరు ...
రిప్లయితొలగించండిఆరుబీరలున్న?గీరిపీచునుదీసి
రిప్లయితొలగించండిముక్కలట్లుదరిగిముందుగానె
తరిగినట్టిఉల్లి,ధనియాలపొడివేసి
వంటజేసి ?తినగనంటురుచులు|
శూరుడు కర్ణుడు మొదలుగ
రిప్లయితొలగించండిధీర వనిత ఝాన్సిలక్ష్మి,దీటుగ బరిలో
పోరాడిన మోడి వరకు
బీర రుచులు మెచ్చు కోని వీరులు గలరే?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిsailaja garu - thank you
రిప్లయితొలగించండిచిన్న తనము లోను చీయంటి బీరనూ
రిప్లయితొలగించండిపెద్దయైన పిదప ప్రేమ బెరిగె
లేత బీరకాయ లెస్సైన కూరగా
వలపు జూప నాకు వగపు లేదు A.Satyanarayana Reddy గారు ఇప్పుడు సరి పోయిందా?
శ్రీ సత్యనారయణ రెడ్డిగారు,
రిప్లయితొలగించండినమస్కారములు.
తినినన్+ ఎంతరు చియొ - యతి "ఎ" కే వేయాలి
మీరన్నది సబబే. ఆ విధమైన యతిమైత్రిని "అఖండయతి" అంటారు. శుద్ధ తప్పు అని చెప్పలేము కానీ లాక్షణికులు ఈ విధమైన యతిమైత్రిని ఒప్పుకోరు. కొందరు ఉద్దండ కవిశేఖరులు కూడా ఈ విధమైన యతిమత్రిని వేశారు. కానీ ఈవిధమైన యతిమత్రిని వీలైనంత వరకు ఉపయోగించక పోవడము మంచిదనే అభిప్రాయము చాలా మంది కవులలో ఉంది. వాడడము తప్పు కాదు.
శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణగారూ, నొప్పించి వుంటే క్షమించండి.
సుసర్ల నాగజ్యోతి గారూ - మీ సవరణ సరిపోయింది.
రిప్లయితొలగించండిధన్యవాదములు సత్యన్నారాయణ రెడ్డి గారు
రిప్లయితొలగించండి