కవి మిత్రులందరికి విన్నపము. దిలీప్ అనే ఇంజనీర్, ఛందస్సు గురించి సాప్టు వేర్ తయారు జేశారు.ఆయన భాగవతం మొత్తాన్ని పరీక్షించారు. ఇంకా కొన్ని దోషాములుండ వచ్చు. పద్యమును బ్లాగులో పెట్టే ముందు పరీక్షించి,చి న్న దోషాలను సరిచేసుకోవచ్చు.గురువుగారు దాని లింకు ఆంధ్ర భారతి పైన పెట్టి యున్నారు.అచ్చు ఆధారిత సంధి గుర్తింపు కొరకు కుడివైపున టిక్ చెయ్యంది. పదమును కట్ చేయాలంటే కామా పెట్టండి. క్రొత్త కవిమిత్రులకు యిది చాలా ఉపయోగకరము.
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, విలక్షణమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మర్మము మాయలు దెలియును
రిప్లయితొలగించండిదుర్మార్గుని బొత్తువలన, దొలగు నఘమ్ముల్
కర్మను ఘాటున వెలసిన
వర్మా ! యా యాం జనేయు భక్తిని గొలువన్
ధర్మమునకు హాని జరుగు
రిప్లయితొలగించండిదుర్మార్గుని పొత్తువలనఁ, దొలగు నఘమ్ముల్
కర్మఫలములను గూర్చిన
మర్మములనెఱిగి సతమ్ము మనిన జగతిలో
ధర్మము నశించి నడచును
రిప్లయితొలగించండిదుర్మార్గుని పొత్తువలన , దొలగునఘమ్ముల్
శర్మము కలుగును నిరతము
కూర్మిన్ సజ్జనుని చెలిమి గూర్చును యశమున్ !!!
ధర్మాచరణమునందున
రిప్లయితొలగించండిదుర్మార్గుడు తాను c జూడ దుర్మార్గులకున్,
నిర్మాణా త్మక పనులకు
దుర్మార్గుని పొత్తువలన దొ c లగు నఘమ్ముల్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
ధార్మిక చింతన తోడన్
రిప్లయితొలగించండికర్మలజేయగఁ దొలగు నఘమ్ముల్! గురువా!
మర్మమ్మేమో పలుకగ
'దుర్మార్గులపొందువలనఁ దొలగు నఘమ్ముల్!'
కవి మిత్రులందరికి విన్నపము. దిలీప్ అనే ఇంజనీర్, ఛందస్సు గురించి సాప్టు వేర్ తయారు జేశారు.ఆయన భాగవతం మొత్తాన్ని పరీక్షించారు. ఇంకా కొన్ని దోషాములుండ వచ్చు. పద్యమును బ్లాగులో పెట్టే ముందు పరీక్షించి,చి న్న దోషాలను సరిచేసుకోవచ్చు.గురువుగారు దాని లింకు ఆంధ్ర భారతి పైన పెట్టి యున్నారు.అచ్చు ఆధారిత సంధి గుర్తింపు కొరకు కుడివైపున టిక్ చెయ్యంది. పదమును కట్ చేయాలంటే కామా పెట్టండి. క్రొత్త కవిమిత్రులకు యిది చాలా ఉపయోగకరము.
రిప్లయితొలగించండిదుర్మతి దుర్గతులెదుగును
రిప్లయితొలగించండిదుర్మార్గుని పొత్తువలనఁ దొలఁగు నఘమ్ముల్
మర్మ రహిత కార్యమ్ముల
ధర్మార్ధుల సాధుజనుల దాస్యము గోరన్
చందస్సు సాఫ్టు వేరును
రిప్లయితొలగించండిపొందికగ దిలీపు గారు భువి నిలిపారే
అందగ జేసిరి " మాస్టర్ "
పొందిక పద్యాల పూలు పూయించండీ !
రిప్లయితొలగించండిఅవమానము పదుగురి ము౦
దు వచ్చు సజ్జనుల కెపుడు దుర్మార్గుని పొ
త్తు వలన;దొలగునఘమ్ముల్
భువిలో సద్భాగవతుల పూజి౦పంగన్
మల్లెలవారిపూరణలు
రిప్లయితొలగించండి1.కర్మాచరణము నందున
దుర్మార్గులు పెరిగి నపుడు దుష్టుల నణచన్
ధర్మము నిలుపును దైవము
దుర్మార్గుని పొత్తువలనఁ దొలఁగు నఘమ్ముల్
2.దుర్మార్గుని నెయ్యమునను
కర్మల సన్మార్గము విడి ఘనులే చెడినన్
ధర్మము వేగన కావలె
దుర్మార్గుని పొత్తువలనఁ దొలఁగు నఘమ్ముల్
3.దుర్మార్గులు లేనపు డిల
కర్మల సన్మార్గ చరుల గాంచగ లేమా
దుర్మార్గాలణగరె తుద
దుర్మార్గుని పొత్తువలనఁ దొలఁగు నఘమ్ముల్
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
విలక్షణమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మర్మముదెలియనివాడొక
రిప్లయితొలగించండిదుర్మార్గునిపొత్తువలన-తొలగునఘమ్ముల్
కర్మలుజేరవటంచు|న
ధర్మముబోదించ?ఫలము?దగ్డమెసుమ్మీ|
కర్మా చరణకు భంగము
రిప్లయితొలగించండిదుర్మార్గుని పొత్తు వలన;దొలగు నఘమ్ముల్
ధర్మాచరణము చేయగ
కర్మంబులు వీడిప్రజకు కల్గవె సుఖముల్!
ఇలపావులూరి శేష శ్రీధర్ ; అద్దంకి
ధర్మవిదుల బోధనతో
రిప్లయితొలగించండిధర్మాత్ముండయ్యె దొంగ తాఁ జేయుచు స
త్కర్మల - ధర్మజ్ఞులతో
దుర్మార్గుని పొత్తువలనఁ దొలఁగు నఘమ్ముల్
వివిధ రకములుగ చెడి చ
త్తువు తప్పక కుక్కచావు దుర్మార్గుని పొ
త్తువలనఁ - దొలఁగు నఘమ్ముల్,
దివికిన్ జేరెదవు కొలువ దివ్యపురుషులన్
ధర్మానికి హానిగలుగు
రిప్లయితొలగించండిదుర్మార్గుని పొత్తు వలన ;దొలగు నఘమ్ముల్
ధర్మాచరణమ్మువలన ;
ధర్మాత్మునిచెలిమి ధరణి తరగని చెలిమౌ !!!
కె యెస్ గురుమూర్తి ఆచారి గార పూరణ
రిప్లయితొలగించండిని౦దాస్తుతి
న్నర్మిలి తో నింటింటికి
నిర్మలుడై మెసగు బొజ్జనిండుగ కుడుముల్
కర్మాచరణము ము౦దా
దుర్మార్గుని పొత్తువలనఁ దొలఁగు నఘమ్ముల్
మధ్యాక్కర
రిప్లయితొలగించండివలదు ",దుర్మార్గునిపొత్తువలన?తొలగునఘమ్ముల్"య
న?లవణంబందునతీపినంజుకొనుటయగు|మనకు
అలవోకగధనసంపదలు?ఆపదలకవిమూలమగు
విలువలుదరుగు|సుఖంబువిజ్ఞతనశియించునిజము|
చర్మము తొలగును దుర్గుణ
రిప్లయితొలగించండిదుర్మార్గుని పొత్తువలన, దొలఁగు నఘమ్ముల్
నిర్మల కర్మము దెలిసిన
ధర్మార్గుని మైత్రి వలన ధర్మాదులచే.
చర్మము తొలగును దుర్గుణ
రిప్లయితొలగించండిదుర్మార్గుని పొత్తువలన, దొలఁగు నఘమ్ముల్
నిర్మల కర్మము దెలిసిన
ధర్మాత్ముని మైత్రి వలన ధర్మాదులచే.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
టైపు దోషాలను సవరించి పోస్ట్ చేయమని మీకు గతంలో చెప్పినా జాగ్రత్తపడడం లేదు.
*****
ఇలపావులూరి శేష శ్రీధర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నది. అభినందనలు.
*****
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ మధ్యాక్కర బాగున్నది. అభినందనలు.
‘అఘమ్ముల్ + అన’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘అఘమ్ములంచ|న...’ అనండి.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చర్మము తొలగును..’?
శ్రీ శంకరయ్య గురువుగారికి నమస్కారములు
రిప్లయితొలగించండి'చర్మము వలుస్తా' అంటే దెబ్బలు తింటావు అనే భావముతో వాడుతారు గదా. అదే భావమొస్తుందని ' చర్మము తొలగును '
అన్నాను . తొలిగించ మంటారా ?
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండి‘చర్మము వలుస్తా’కు ‘చర్మము తొలగును’కు భేదేం ఉంది. దానిని బదులు ‘ధర్మము తొలగును’ అంటే బాగుంటుదేమో?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమర్మాభిఘాతమబ్బును
రిప్లయితొలగించండిదుర్మార్గుని పొత్తు వలన; తొలగునఘమ్ములు
ధర్మాత్ముసేవనంబున
ధర్మమునే తెలుసుకోర ధరణిని బ్రతుకన్
ధర్మాధర్మ విచక్షణ
రిప్లయితొలగించండిదుర్మార్గుని పొత్తు వలన దొలగును; నఘమ్ముల్
మార్మ్రోగి చుట్టుచుండును
ధర్మార్ధీ! మార్గమెంచి ; దారిని చనుమా
శ్రీపాద గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘తెలుసుకోర’ అన్నదాన్ని ‘తెలిసికొనుము’ అనండి.
రెండవ పూరణలో ప్రాసతప్పింది. మ్రోగు, మోగు రూపాంతరాలుగా బ్రౌణ్యం తదితత నిఘంటువులు చెపుతున్నాయి కనుక ‘మార్మోగి’ అనండి.
బర్మా పోవుచు జింకల
రిప్లయితొలగించండికుర్మానున్ తినక మెండు కూరిమి తోడన్
శర్మా! వెన్నను దొంగిలు
దుర్మార్గుని పొత్తువలనఁ దొలఁగు నఘమ్ముల్