19, జనవరి 2015, సోమవారం

సమస్యా పూరణం - 1583 (నారాయణునకు నతు లనె నాస్తికుఁ డెలమిన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నారాయణునకు నతు లనె నాస్తికుఁ డెలమిన్.

40 కామెంట్‌లు:

  1. వీరయ శైవుడె యైనను
    నారాయణునకు నతులనె ,నాస్తికు డెలమిన్
    మారగ మఱి యా స్తికుడుగ
    గా రె వరును నాస్తికుండు కమలా ! భువినిన్

    రిప్లయితొలగించండి
  2. ఆరామా లయమందున
    పారాయణ మునువినగ పరిపరి విధముల్
    నేరక పొరబడితి ననుచు
    నారాయణు నకు నతులనె నాస్తికు డెలమిన్

    రిప్లయితొలగించండి
  3. బీరము లాడక బడుగుల
    యారాటము దీర్ప వారి యభ్యున్నతికై
    పోరాడు వామ పక్షపు
    నారాయణునకు నతు లనె నాస్తికుఁ డెలమిన్.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. పారాయణఁజేయక హరి
    దూరుచు భక్తుల, సదామధువుతో తూలే
    జారున కేమయెనోగద?
    నారాయణునకు నతులనె నాస్తికుడెలమిన్

    రిప్లయితొలగించండి
  6. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో ‘కారు..నాస్తికుడు’ అన్నారు. ‘కారెవరును నాస్తికులుగ కమలా భువిలో’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు/
    రెండవ పాదంలో ‘వినగ’ అన్నచోట గణదోషం... ‘వినంగ’ అంటే సరి!
    *****
    దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు గారూ,
    కమ్యూనిస్ట్ లీడర్ నారాయణ మీద పూరణ చేయాలని నిన్న సమస్యను షెడ్యూల్ చేస్తున్నప్పుడే అనుకున్నాను. ఆఛాన్స్ మీరు కొట్టేశారు. చక్కని పూరణ. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వాల్మీకి + అప్పుడు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘వాల్మీకి యపుడు’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. నారాయణు డెవ్వడురా
    తీరుగ నాముందు రాగ తెలియగ నేనే
    మారుదు, నప్పుడె పెడుదును
    నారాయణునకు నతు, లనె నాస్తికుఁ డెలమిన్.

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పూరణ నందించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ చాలా బాగుంది. సమస్యా పూరణలో ఒక కొత్తదారిని సూచించారు. వారికి వచ్చిన ఆలోచన బహుధా ప్రశంసనీయం. వ్యావహారికాధునిక పదాలైన 'రాగా' వంటి పదాలకు , ' రాగ ' అనే క్లుప్తీకరణలకు మనస్కరించక పోవడం చేతనూ, మరింత అన్వయ సౌలభ్యం కొరకూ , ' తీరుగ నా ముందు నిలిచి తెలుపఁగ నేనే ' అన్నట్లు మారిస్తే బావుంటుందని నా సూచన. ఏదేమైనా చక్కటి పూరణనందించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి అభినందనలు .

    రిప్లయితొలగించండి
  10. డా. విష్ణునందన్ గారూ,
    మీ ప్రశంసకు పాత్రులైన గోలివారు ధన్యులు. మీరు సూచించిన సవరణ సబబుగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. మీరు వెలిగించు ధూమము
    మీరిచ్చెడి హారతి సెగ మించు కొలిమినే
    యేరీతి భరించునొ యా
    నారాయణునకు నతు లనె నాస్తికుఁ డెలమిన్

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    ఆరాజకీయ సభ్యు౦
    డారాటము జెంది వోట్లకై భక్తుని యా
    కారమును దాల్చి గుడిలో
    నారాయణునకు నతు లనె నాస్తికుఁ డెలమిన్

    రిప్లయితొలగించండి
  14. మల్లెల వారి పూరణలు
    1. వేరామభక్తుడొకరుడు
    నారాయణునకు నతు లనె నాస్తికుఁ డెలమిన్
    పోరాని కష్ట మిచ్చెడి
    నారాయణు నేల కొలువ?నమ్ముము శ్రమనన్
    2. చేరడు భక్తిని గుడికిని
    దూరానికి తరుము నీకు తోడగు శ్రమయన్
    దూరును ఫలితము దక్కక
    నారాయణునకు నతు లనె నాస్తికుఁ డెలమిన్





    రిప్లయితొలగించండి
  15. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ

    మధ్యాక్కర
    కారులో నాస్తికు లెల్ల ఘనముగ నేగుచు నుండ
    దారుణముగ నన్నవరము దరి జరిగె ప్రమాదమపుడు
    వారిలో నొక్కడు బ్రతికి బైట పడెను భీతినొంది
    నారాయణునకు నతు లనె నాస్తికుఁ డెలమిన్ వినతిగ

    రిప్లయితొలగించండి
  16. నారాయణ యన తెలియద?!మన
    నారా వారే కద, మన నాయక మణి,యికపై,
    "నారా"కు"యణ"ను కలుపుచు
    "నారాయణునకు"నతులనె నాస్తికు డెలమిన్

    రిప్లయితొలగించండి
  17. కె. ఈశ్వరప్ప గారి పూరణ....

    పారాయణపరమార్థపు
    సారాంశముదెలియనట్టి-సారాప్రియుడే
    ప్రేరితవాల్మీకియపుడు
    నారాయణునకునతులనె-నాస్తికుడెలమిన్|

    రిప్లయితొలగించండి
  18. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ చివర ‘నమ్ము శ్రమ ననెన్’ అనండి.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘...మన నాయకు డికపై’ అనండి.

    రిప్లయితొలగించండి
  19. చేరినసతిసద్భక్తికి
    మారెనుమమకారమందు|మగడపుడు,సదా
    చారములెన్నో-దెలుపగ
    నారాయణునకునతులనె-నాస్తికుడెలమిన్

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. దూరిన నాతడె చివరకు
    సారంబగు భక్తుడయ్యె సత్యము దెలిసీ
    నోరూరగ గీర్తించుచు
    నారాయణునకు నతులనె నాస్తికుడెలమిన్!!!

    రిప్లయితొలగించండి
  22. సారాచారుల దూరుచు
    సారా సంపూర్ణగతిని స్వాంతము నిండన్
    యేరీ నాసాటి యనుచు
    నారాయణునకు నతులనె నాస్తికుడెలమిన్

    "క్రమాలంకారం లో"
    తీరగు మ్రొక్కులెవరికగు?
    చేరుచు దాసుండెటులను చిరమగు భక్తిన్?
    శౌరిని నమ్మని దెవరుడు?
    నారాయణునకు,నతులనె,నాస్తికుడెలమిన్.

    రిప్లయితొలగించండి
  23. శ్రీపాద, ఇందుపల్లి
    ధీరాముడు భక్తియుతుడు
    నారాయణునకు నతులనె! నాస్తికుడెలమిన్
    పోరాట జీవనంబే
    ఆరాటము తీర్చుననుచు అభిభాషించెన్

    రిప్లయితొలగించండి
  24. శ్రీపాద, ఇందుపల్లి
    వేరేదారిగ వెళ్ళుచు
    తీరా తన పౌరుషంబు తేలిక కాగా
    పోరాట(డి) జయము కోసము
    నారాయణునకు నతులనె నాస్తికుడెలమిన్

    రిప్లయితొలగించండి
  25. ఎలమిన్ అనెడి మాటకు ఏ అర్ధము లక్షితమో?!

    రిప్లయితొలగించండి
  26. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తెలిసీ’ అనడం గ్రామ్యం. ‘నోరారగ’ అన్నదానికి ‘నోరూరగ’ అన్నది టైపాటు కావచ్చు. ‘సత్య మెఱిఁగియున్| నోరారగఁ గీర్తించుచు...’ అనండి.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    శ్రీపాద గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ సలక్షణంగా వ్రాసారు. రెండవ పూరణలో పూర్తిగా వ్యావహారికాన్ని ప్రయోగించారు. ఈ బ్లాగులో పద్యాలు ఛందోవ్యాకరణ నియమాలను అతిక్రమించరాదు. వ్యావహారికంలో వ్రాయడానికి ఫేస్‍బుక్కులో ‘పద్యమాలిక’ వంటి గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ మాత్రం పూర్తిగా గ్రాంధికమే అయి ఉండాలి. గమనించగలరు.మీ రెండవ పద్యానికి నా సవరణ.....
    వేరొక దారిన నేగుచు
    తీరుగ తన పౌరుషంబు తేలిక కాగన్
    పోరాడి జయము కొఱకై
    నారాయణునకు నతులనె నాస్తికుడెలమిన్.
    ‘ఎలమి’ శబ్దానికి చాలా అర్థాలున్నా ‘సంతోషము/ ఆనందము’ అనేవి రూఢ్యర్థాలుగా ఉన్నాయి. ఎలమిన్ అంటే సంతోషముతో అనే అర్థాన్ని ప్రధానంగా స్వీకరించాలి.

    రిప్లయితొలగించండి
  27. గురువుగారికి ధన్యవాదములు
    సవరించినపద్యము

    నారాయణ యన తెలియద?!మన
    నారా వారే కద, మన నాయకు డికపై ,
    "నారా"కు"యణ"ను కలుపుచు
    "నారాయణునకు"నతులనె నాస్తికు డెలమిన్
    జనవరి 19, 2015 4:32

    రిప్లయితొలగించండి
  28. గోలివారికి అభినందనలు.

    నీరే జీవాధారము!
    కారకుడై నీటి చక్ర కార్యముఁ జూడన్
    దీరిన ప్రత్యక్ష సూర్య
    న్నారాయణునకు నతులనె నాస్తికుఁ డెలమిన్!
    (గురువుగారూ సూర్యన్నారాయణ అని గతంలో ఎక్కడో చదివిన గుర్తు.ఆమోదయోగ్యమేనానండీ?)

    రిప్లయితొలగించండి
  29. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సూర్యన్నారాయణ’ అనడం దోషమే. అంతేకాక మూడవ పాదంలో గణదోషం. ‘దీరిన ప్రత్యక్షఖమణి| నారాయణునకు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  30. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    విష్ణునందన్ గారూ ! " గురు " తెరిగి సూచించు మీ సూచనలు సర్వదా అనుసరణీయములు.ధన్యవాదములు మీసూచనకు కృతజ్ఞతలు.
    సహదేవుడుగారూ ! ధన్యవాదములు.

    విష్ణునందన్ గారి సూచన మేరకు సవరణతో....

    " నారాయణు డెవ్వడురా !
    తీరుగ నాముందు నిలిచి తెలుపగ, నేనే
    మారుదు, నప్పుడె పెడుదును
    నారాయణునకు నతు " లనె నాస్తికుఁ డెలమిన్.

    రిప్లయితొలగించండి
  31. శ్రీరామా, యన్నా, నీ
    దే రాజ్యమ్మను భరతుడు తృప్తి పడునటుల్
    నోరార పలుకు సాక్షాత్
    నారాయణునకు నతులనె నాస్తికుఁ డెలమిన్. (జాబాలి)

    రిప్లయితొలగించండి
  32. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :

    నీరే జీవాధారము!
    కారకుడై నీటి చక్ర కార్యముఁ జూడన్
    దీరిన ప్రత్యక్ష ఖమణి
    నారాయణునకు నతులనె నాస్తికుఁ డెలమిన్!

    రిప్లయితొలగించండి
  33. శ్రీరామా, యన్నా, నీ
    దే రాజ్యమ్మను భరతుడు తృప్తి పడునటుల్
    నోరార పలుకు సాక్షాత్
    నారాయణునకు నతులనె నాస్తికుఁ డెలమిన్.

    రిప్లయితొలగించండి
  34. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  35. కోరగ సీటయ్యయటికి
    పోరాటము సల్ప నేర్పి ప్రొద్దుట రాత్రిన్
    మా రామయ్యను మించిన
    నారాయణునకు నతు లనె నాస్తికుఁ డెలమిన్

    రిప్లయితొలగించండి
  36. ధ్యానము జేయక వాణిని
    సూనుని కాలేజి జేర్చి సుఖమందగ భల్
    దానము జేయుచు ఫీజును
    నారాయణునకు నతు లనె నాస్తికుఁ డెలమిన్

    రిప్లయితొలగించండి