చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** జిగురు సత్యనారాయణ గారూ, సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. పూరణమాత్రం సందిగ్థంగా ఉంది. **** వసంత కిశోర్ గారూ, మీ సురాదీనుల, నాతుకాదీనుల పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. **** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మన్నించండి. కందపద్యాన్ని చూసి నిన్నటి పూరణే అనుకున్నాను. ఉత్పలమాల పాదాన్ని కందంలో ఇమిడ్చి చేసిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు. **** లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కె. ఈశ్వరప్ప గారూ, మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీరు సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. **** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ధర్మవేల్పులన్’ అనడం దుష్టసమాసం. ‘ధర్మదేవులన్’ అనండి.
హీనులకంటు పాపమవహేళనజేసి యకారణంబుగా
రిప్లయితొలగించండిదీనులఁ బ్రోచువారలను దిట్టినఁ గొట్టినఁ - బుణ్య మబ్బురా
హానినిజేయకేరికిని యందరి మేలును కోరు వారికిన్
దానము చేయువారికిని ధర్మముదప్పని మంచివారికిన్
సూనృత వాక్కులై ప్రజను సోదర భావము తోడ జూచుచున్
రిప్లయితొలగించండిదాన గుణంబుతో ధనము దాచక సాయము జేయు వారికిన్
మానిత పుణ్యమబ్బు ననుమానము లేకయె! యేవిథంబుగన్
దీనులఁ బ్రోచువారలను దిట్టినఁ గొట్టినఁ బుణ్య మబ్బురా?
భానుని కాంతులన్ నిలచి ప్రార్ధన జేసిన మోక్ష మీయగన్
రిప్లయితొలగించండిపానము చేయగా సుధను పాపుల కైనను నూర్ధ్వ లోకముల్
మానిని ద్రౌపదిన్ గనిన మాధవు డెంతగ నాదరిం చెనో
దీనులఁ బ్రోచువారలను దిట్టినఁ గొట్టినఁ బుణ్య మబ్బురా
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
మద్యం షాపులపై స్త్రీల / పురుషుల దండయాత్ర :
( అడ్డొచ్చిన వారిని తన్నుడు, తిట్టుడు, బొమికలేరుడు , పుంగి బజాయించుడు - జెరాయినంక బొందబెట్టుడే )
౦౧)
______________________________________________________________
పానము తోడ మత్తులయి ♦ భార్యల బిడ్డల బాధ బెట్టుచున్
మానవ రూపు నుండి తమ ♦ మాన ధనాదుల సర్వమొడ్డుచున్
దానవ రీతి వర్తనను ♦ తల్లిని దన్నెడు క్రూరులౌ సురా
దీనులఁ బ్రోచువారలను ♦ దిట్టినఁ గొట్టినఁ బుణ్య మబ్బురా !
______________________________________________________________
అదీనుడు = ధనవంతుడు
సురాదీనుడు = సుర అనే ధనము కలిగిన వాడు(కడుపున) = తాగుబోతు
సురాదీనుల బ్రోచువారు = మద్యపు వ్యాపారులు
వ్యభిచార గృహ నిర్వాహకుల కండ దండ లందించు వారిని - యేం జెయ్యాల్నె భయ్ :
రిప్లయితొలగించండి( తన్నుడు, తిట్టుడు, బొమికలేరుడు , పుంగి బజాయించుడు - జెరాయినంక బొందబెట్టుడే )
౦౨)
______________________________________________________________
దీనల, బేలలన్, దుదకు ♦ ధీదలనెంచక స్వార్థ బుద్ధితో
గానము నృత్యము ల్సలుప - కాసులు , గోమును , గూర్చు వంచనన్
మానము నమ్ము గౌరలుగ ♦ మానవిహీనల జేయు; నాతుకా
దీనులఁ బ్రోచువారలను ♦ దిట్టినఁ గొట్టినఁ బుణ్య మబ్బురా !
______________________________________________________________
ధీద = బాల = పదునా రేండ్లకు లోబడిన పిల్ల
గోము = గౌరవము
గౌరలు = వర్తకులు
నాతుక = స్త్రీ
నాతుకాదీనులు = స్త్రీ(వేశ్య)లనే ధనము గలిగిన వ్యభిచార గృహ నిర్వాహకులు
నాతుకాదీనుల బ్రోచువారు = వారిని కాపాడే అధికారులు(పోలీసులు),రాజకీయులు, ధనమదాంధులు
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
జిగురు సత్యనారాయణ గారూ,
సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
పూరణమాత్రం సందిగ్థంగా ఉంది.
****
వసంత కిశోర్ గారూ,
మీ సురాదీనుల, నాతుకాదీనుల పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు.
దానముఁ జేయగా వలెను ధార్మికు లెప్పుడుఁ గాచ దీనులన్
రిప్లయితొలగించండిమానవ సేవయే యగును మాధవ సేవ సతమ్మెవిధిన్
దీనులఁ బ్రోచు వారలను దిట్టినఁ గొట్టినఁ బుణ్య మబ్బురా?
దానవులైన వారికి సదా కడుయత్నము మార్పు తెచ్చెడిన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిప్రశ్నార్థకమైన సమస్యగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం చివర గణదోషం. ‘సతమ్ము నేవిధిన్’ అంటే సరి!
మానము ప్రాణమున్ చిదుము మానవ హీనులనేకులేకమై
రిప్లయితొలగించండిదానవ కాండలన్ సలిపి ధర్మము న్యాయము మంటగల్పుచూ
వైనము వాటముల్నెరిగి వాసము జేయు కుబుద్ధి రాక్షసా
దీనులఁ బ్రోచువారలను దిట్టినఁ గొట్టినఁ - బుణ్య మబ్బురా
హీనులు దీనులన్గని మహిన్ మననీయరు ద్రోచుకొంచు నా
రిప్లయితొలగించండిహీనుల దుష్కృతుల్ గని సహించని దైవము మానుషాకృతిన్
హీనుల గొట్టి, తిట్టి,యవహేళనపాలొనరించి ప్రేమతో
దీనులఁ బ్రోచు. వారలను గొట్టినఁ దిట్టినఁ బుణ్యమబ్బురా!
పూజ్య గురుదేవులకు నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిభళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మంట గల్పుచున్| వైనము వాటము ల్దెలిసి...’ అనండి.
****
చింతా రామకృష్ణా రావు గారూ,
విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిన్న బమ్మెరలో పోతన సమాధివద్ద ‘భాగవత గణనాధ్యాయి’ ఊలపల్లి సాంబశివరావు గారు కలిసారు. మిమ్మల్ని జ్ఞాపకం చేసారు.
మానవ సేవజేసినను మాధవసేవని మాన్యులందురే !
రిప్లయితొలగించండిదానము జేయువారినిల దండన జేయుట ధర్మమవ్వదే ?
దీనుల బ్రోచువారలను దిట్టిన గొట్టిన బుణ్యమబ్బురా ?
పూనికతోడ జేయు సెస పోడిమి నిచ్చును మానవాళికిన్ !!!
మాష్టారు నిన్న పూరణ ఆలస్యముగా పోస్ట్ చేసాను .. సమయముంటే సమీక్షించ ప్రార్ధన
రిప్లయితొలగించండివినరా నా మాటల నెటు
రిప్లయితొలగించండిలను దీనులఁ బ్రోచువారలను దిట్టినఁ గొ
ట్టినఁ బుణ్య మబ్బురా? వా
రిని సన్మానించుము తగురీతిగ నరుడా
మనవసేవయేమనకుమాధవసేవనిపెద్దలెందరో
రిప్లయితొలగించండిజ్ఞానులుదెల్పియుండ?మనజన్మకుసార్థకమైన,నా
దీనులబ్రోచువరలనుతిట్టినకొట్టినబుణ్యమబ్బురా
నానుడిలేదునెక్కడనునాణ్యతగాదదిమెచ్చరెవ్వరున్
ఈనరజన్మగొప్పదనినీర్షలుమానియుమానవత్వమున్
రిప్లయితొలగించండిపూనియుజేయ?పుణ్యమనిపూర్వపురాణములన్నిదెల్పగా
దీనులబ్రోచువారలనుతిట్టినకొట్టినబుణ్యమబ్బురా
దానవతత్వమేదేలుప?ధర్మమునిల్చున?దక్షతెట్లగున్?
2జానెడుపొట్టకైజరుపుచంచలమైనమనస్సుచేతనే
పూనికగాకలోకులకుపుట్టినదుర్గతిమాన్పబూనుచున్
దీనులబ్రోచువారలను-తిట్టినకొట్టినబుణ్యమబ్బురా
మానుమునట్టిమాట,మానసమందునజేర్చకెప్పుడున్
రావణ నీతి
రిప్లయితొలగించండిదానవ జాతి నీతి యిది ధర్మము తప్పుట.హింసబెట్టుడీ దీనులబ్రోచు వారలను,తిట్టిన గొట్టిన,పుణ్య మబ్బురా;
మౌనులజాతి నంతయును మంటనుగాల్చుడు మాధవు౦డెరా
నీ,నవ దుర్గ రూపమున, నిర్జర స్త్రీల బలాత్కరించుడీ
రిప్లయితొలగించండిహీనపు జాతి వాడనుచు నెన్నియొహంగులు పొందువాడెయౌ
దీనుడు సర్వసంపదలు దీటుగ గల్గియు సంవిధానమే
దానము జేసె హక్కనుచు ధర్మము తప్పిచరింతు రిట్టి యీ
దీనులబ్రోచు వారలను,తిట్టిన గొట్టిన,పుణ్య మబ్బురా
దానవ వంశ వృక్షమును దగ్ధము చేతువె బిడ్డ యేలరా
రిప్లయితొలగించండియీ నయవంచనంపు నుడు లీ యసురారి నుతుల్ పదేపదే
యేనుగుఁ గాచె నందు వది యేమి విశేషమె? నీవు పేర్కొనే
దీనులఁ బ్రోచువారలను దిట్టినఁ గొట్టినఁ బుణ్య మబ్బురా.
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిపూనికతో హిరణ్యకశిపు౦ డిటు చాటెను -"విష్ణుభక్తులన్,
మౌనుల పారద్రోలక సమాశ్రయ మిచ్చినవారు ఘోర శి
క్షానుభవార్హు లౌదురిక నాహరి గొల్చెడి మానహీనులన్
దీనులబ్రోచు వారలను,తిట్టిన గొట్టిన,పుణ్య మబ్బురా"
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ రెండవ పాదం చివర గణం తప్పింది. ‘లేదు + ఎక్కడను’ అన్నప్పుడు నుగాగమం రాదు. ‘లేదదెక్కడను’ అనండి.
రెండవ పూరణలో ‘గొప్పదని యీర్ష్యలు...’ అనండి.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘నిర్జరస్త్రీ’ అన్నప్పుడు ర గురువై గణదోషం.
****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తానములాడుచున్ సిరుల తాడిత పీడిత పేదలన్ మదిన్
రిప్లయితొలగించండికానక యున్నచో కలుగు కాలుని లోకము నిశ్చయమ్ముగన్
దానమునీక దాచినను తానెవిడున్ సిరి, శిక్షతప్పునా
దీనులఁ బ్రోచు వారలనుదిట్టినఁ గొట్టినఁ పూణ్య మబ్బురా?
మాస్టారు నా రెండవ పూరణ చూడలేదు
రిప్లయితొలగించండికాననమందునైన, కనుగానక పాపముఁ జేయువారినిన్,
రిప్లయితొలగించండికూనలనైన, భక్తి మదిఁ గొల్చు దరిద్రులనైన, ప్రేమతో
దీనులఁ బ్రోచువారలను దిట్టినఁ గొట్టినఁ బుణ్య మబ్బు, రా
ధానుతు నన్ని పద్ధతులఁ దక్కగొనంగ సదా తపింపరే,
దీన జనోద్ధరుంగడప దిక్కని నమ్మిన భృత్యులిద్దరున్?
ఆనదులందుకల్మషమునందరునింపగ?కంపు|తిట్టినన్
రిప్లయితొలగించండిస్నానపుపానియంబునిడు,సర్వులగాచు"నదీమతల్లి"నీ
ప్రాణమునిల్పిభత్యమునుబంచడిచెట్లనుగొట్ట?దేనికో
దీనులబ్రోచువారలనుతిట్టినకొట్టినబుణ్యమబ్బురా|
సవరించిన పద్యము ప్రస్తుతిస్తున్నాను
రిప్లయితొలగించండిరావణ నీతి
దానవ జాతి నీతి యిది ధర్మము తప్పుట.హింసబెట్టుడీ దీనులబ్రోచు వారలను,తిట్టిన గొట్టిన,పుణ్య మబ్బురా;
మౌనులజాతి నంతయును మంటనుగాల్చుడు మాధవు౦డెరా
నీ,నవ దుర్గ రూపమున, నిర్జర యోషల సంగమించుడీ
కాననమందునైన, కనుగానక పాపముఁ జేయువారినిన్,
రిప్లయితొలగించండికూనలనైన, భక్తి మదిఁ గొల్చు దరిద్రులనైన, హీనులన్,
దీనులఁ బ్రోచువారలను దిట్టినఁ గొట్టినఁ బుణ్య మబ్బు, రా
ధానుతు నన్ని పద్ధతులఁ దక్కగొనంగ సదా తపింపరే,
దీన జనోద్ధరుంగడప దిక్కని నమ్మిన భృత్యులిద్దరున్?
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మన్నించండి. కందపద్యాన్ని చూసి నిన్నటి పూరణే అనుకున్నాను.
ఉత్పలమాల పాదాన్ని కందంలో ఇమిడ్చి చేసిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీరు సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
మానవజాతి యందునను మాన్యతనందును యెల్లవేళలన్
రిప్లయితొలగించండిదీనులబ్రోచు వారలను,-తిట్టిన కొట్టిన పుణ్యమబ్బురా
హీనులునంచు వారలను హేయముగాగను చూచువారలన్
దీనులునైన వారెయిల దేవుని కిష్టులు నండ్రుగా బుధుల్
దీనుల యందు దైవమును తేరిచి చూచుట మానవత్వమౌ
మానవులందు గొప్పయన మంచిని చేయుట,పుణ్యమబ్బదే
దీనుల బ్రోచువారలను-తిట్టిన,కొట్టిన పుణ్యమబ్బురా
హీనమునైన వర్తనను నేచెడి వారిని లోకమందునన్
(క్రమాన్వయము లో)
మానవులందరొక్కటను మంగళ భావము తోడమెల్గగా
వానికి నెట్టులబ్బునిల పావన పుణ్యము?-1; తోటివారినే
హీనులు దీనులంచనెడు హేయపు బుద్ధుల నేమిచేయనౌ?-2
దీనుల బ్రోచువారలను-1 తిట్టిన,కొట్టినపుణ్యమబ్బురా-2
మానవ జన్మగొప్పదని మాన్యులు పల్కరె?మేలుగల్గు నా
దీనుల బ్రోచువారలను -తిట్టిన,గొట్టిన పుణ్యమబ్బురా
దీనులటంచసభ్యముగ తిట్టెడి;గొట్టెడి వారినిద్ధరన్
దీనులు వేరెగాదు తము తేటగు వర్తనలేనివారలే!
గురువుగారికి నమస్సులు.
రిప్లయితొలగించండిక్రమాలంకార పూరణము.
శ్రీనవనీతచోరుఁడు వశిష్ఠమునిప్రవరాది సంస్తుతుం,
డేనగభేదియైనను సహింపఁడె శిక్షల భక్తులైన, సం
ధానముఁజేసి కర్మములఁ నాథుననంతునిఁజేరి కొల్వఁగా,
దీనుల బ్రోచు - వారలనుఁ దిట్టినఁ గొట్టినఁ - బుణ్యమబ్బురా
మానస మందు గొల్వువలె మానవ రూపపు ధర్మ వేల్పులన్,
రిప్లయితొలగించండిదీనుల బ్రోచు వారలను , దిట్టిన గొట్టిన బుణ్య మబ్బురా
దానము ధర్మముల్ మదిని దల్వని లోభ ధనాఢ్యు నెప్పుడున్
మానక నాదపిల్లలుగ మార్చి పకీరుల జేయు నీచులన్.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ధర్మవేల్పులన్’ అనడం దుష్టసమాసం. ‘ధర్మదేవులన్’ అనండి.
రీ కంది శంకరయ్య గురువుగారికి నమస్కారము
రిప్లయితొలగించండిధర్మ వేల్పులు మీరనట్లు దుష్ట సమాసమే. మీ సవరణకు ధన్యవాదములు
హీనము హైందవమ్మనుచు హేళన జేయుచు పేదలన్ సదా
రిప్లయితొలగించండిగానము బైబిలున్ మురిసి గార్దభ శైలిని జేయురోయనిన్
దానము జేతుమో మతము దబ్బున మార్చినచో యటంచుచున్
దీనులఁ బ్రోచువారలను దిట్టినఁ గొట్టినఁ బుణ్య మబ్బురా!
వీనుల విందుగా పలికి పిల్లల పాపల చంకనెత్తుచున్
రిప్లయితొలగించండికోనల కోనలన్ తిరిగి గొల్లున నేడ్చుచు దండమిచ్చుచున్
వానల లోన నెండలను పంచుచు మందును వోట్ల కోసమై
దీనులఁ బ్రోచువారలను దిట్టినఁ గొట్టినఁ బుణ్య మబ్బురా!