కవిమిత్రులకు నమస్కృతులు. ప్రయాణపు ఏర్పాట్లలో ఉండి ఈరోజంతా బ్లాగు చూడలేకపోయాను. మన్నించండి.రేపు హైదరాబాదు, అక్కడినుండి పొద్దుటూరు పెళ్ళికి, తరువాత తిరుపతి ప్రయాణం.. ఫిబ్రవరి 2 వరకు నేను బ్లాగుకు అందుబాటులో ఉండను.అన్నిరోజుల సమస్యలను, పద్యరచనను షెడ్యూల్ చేశాను. నేను నా సెల్ పోనులో మీ పద్యాలను చూస్తూనే ఉంటాను. కాని వ్యాఖలను పోస్ట్ చేయలేను. దయచేసి ఈ ఐదారు రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి. ***** ఈనాటి సమస్యకు చక్కని పూరణలను అందించిన మిత్రులు... రాజేశ్వరి అక్కయ్యకు, పోచిరాజు సుబ్బారావు గారికి, చంద్రమౌళి సూర్యనారాయణ గారికి, మిస్సన్న గారికి, శైలజ గారికి, (కర్కశచీకటి?) కే. ఈశ్వరప్ప గారికి, (వస్తువుల్ యన్నది?) (‘విజ్ఞతఁ గన్నుల దానమీయరే’ అనండి) అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి, కెంబాయి తిమ్మాజీ రావు గారికి, మల్లెల సోమనాథ శాస్త్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు.
మన్నన సేయగా కొలిచి మానస మందున భక్తి మీరగన్
రిప్లయితొలగించండిసన్నుతి చేయుచున్ శివుని సాగిల మ్రొక్కుచు దీక్షి తుండునై
యున్నతి పొందగా దలచి యోగము నందున పారవశ్య మున్
కన్నులు గ్రుడ్డివే యయినఁ గానఁగ వచ్చు సమస్త వస్తువుల్
కన్నులు గ్రుడ్డివే యయిన గానగ వచ్చు సమస్త వస్తువు
రిప్లయితొలగించండిల్మాన్యులు జెప్పగా మరిని మన్నన తోడన జూడగ ల్గుట
న్మి న్నగ వచ్చునే నికను సన్నుతి నెప్పుడు జ్ఞాననే త్రము
బన్నుగ జూడగా వలయు పండిత వాక్కుల నిజ్జగంబునన్
అంధురాలైన భార్యతో భర్త :
రిప్లయితొలగించండికన్నులు లేనిదానవని కళ్ళు చెమర్చకు మాటిమాటికిన్
దన్నుగ నేను నీకెపుడు తప్పక యుండెద నీదు చూపునై
అన్నిట వెంటనుందు బ్రతుకంతయు తల్చుము నీవిగానె నా
కన్నులు - గ్రుడ్డివే యయినఁ గానఁగవచ్చు సమస్తవస్తువుల్
ధృతరాష్ట్రుడు విశ్వరూపమును చూచిన పిదప:
రిప్లయితొలగించండిమన్నన జేసి నా యెడల మాధవ! నీదగు విశ్వరూపమున్
క్రన్నన జూడ దివ్యమగు కన్నుల నిచ్చితి వీవు ధన్యుడన్
మన్నిక గల్గి నా బ్రదుకు మాన్య మయెన్ భవదీయ సత్కృపన్
కన్నులు గ్రుడ్డివే యయినఁ గానఁగవచ్చు సమస్తవస్తువుల్.
తిన్నడు కాలకాలునికి తీరుగ బెట్టినవేమి జెప్పుమా ?
రిప్లయితొలగించండికన్నుల జూడనీయకిల కర్కశ చీకటి గ్రమ్మునెప్పుడున్
మిన్నగ కాంతియున్ననిల మేలగు నెందుకు మానవాళికిన్ ?
కన్నులు , గ్రుడ్డివే యయిన, గానగ వచ్చుసమస్త వస్తువుల్!!!
నిన్నటినేత్రదానములె?నేటికిఅంధులచూపునింపగా|
రిప్లయితొలగించండికన్నులుగ్రుడ్డివేయయిన?కానగావచ్చు-సమస్తవస్తువుల్
యన్నదివైద్యశాస్రములకందినసత్యము|నిత్యమవ్వగా?
"విన్నపమంటిమీరిపుడువిజ్ఞతచే"కనుదానమివ్వరా?
పిన్నటి రేణువౌ యణువు పేల్చగలేమని తేల్చె డాల్టనే
రిప్లయితొలగించండిమిన్నగు విజ్ఞతన్ కరము మేలగు విద్య నసాధ్యమున్నదా?
యున్నవిమంచిరోజులిల యుత్తమ జ్ఞాన సమార్జనంబునన్
కన్నులు గ్రుడ్డివేయయినఁ గానఁగవచ్చు సమస్త వస్తువుల్
కన్నులు గ్రుడ్డివే యయిన గానగ వచ్చు సమస్త వస్తువు
రిప్లయితొలగించండిల్మాన్యులు జెప్పగా మరిని మన్నన తోడన జూడగ ల్గుట
న్మి న్నగ వచ్చునే నికను సన్నుతి నెప్పుడు జ్ఞాననే త్రము
బన్నుగ జూడగా వలయు పండిత సూక్తుల నిజ్జగంబునన్
రిప్లయితొలగించండిచిన్నది మోహనాంగి తన సేవలకై సతి యింట నుండగా
కన్నులు గ్రుడ్డివే, యయిన కానగ వచ్చు సమస్త వస్తువుల్
చెన్నుగ యంగడిన్ దొరకు చెల్వల పొందును హంగు పొంగు లె
ట్లన్న సుధన్ భుజింపక గరమ్మును గ్రోలెడి రీతి మూర్ఖులై
కన్నది బాహిరింద్రియము,కాంచగ ముఖ్యము నైనగాని యా
రిప్లయితొలగించండిపన్నుల కెల్ల యాకృతుల బాగుగ దెల్పడె మానసంబుకున్
వెన్నుని నామమద్దియును వీడక తామది భక్తి గొల్వగా
కన్నులు గ్రుడ్డివే యయిన కానగ వచ్చు సమస్త వస్తువుల్
కన్నది=(కన్ను+అది)
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిప్రయాణపు ఏర్పాట్లలో ఉండి ఈరోజంతా బ్లాగు చూడలేకపోయాను. మన్నించండి.రేపు హైదరాబాదు, అక్కడినుండి పొద్దుటూరు పెళ్ళికి, తరువాత తిరుపతి ప్రయాణం.. ఫిబ్రవరి 2 వరకు నేను బ్లాగుకు అందుబాటులో ఉండను.అన్నిరోజుల సమస్యలను, పద్యరచనను షెడ్యూల్ చేశాను. నేను నా సెల్ పోనులో మీ పద్యాలను చూస్తూనే ఉంటాను. కాని వ్యాఖలను పోస్ట్ చేయలేను. దయచేసి ఈ ఐదారు రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
*****
ఈనాటి సమస్యకు చక్కని పూరణలను అందించిన మిత్రులు...
రాజేశ్వరి అక్కయ్యకు,
పోచిరాజు సుబ్బారావు గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
మిస్సన్న గారికి,
శైలజ గారికి, (కర్కశచీకటి?)
కే. ఈశ్వరప్ప గారికి, (వస్తువుల్ యన్నది?) (‘విజ్ఞతఁ గన్నుల దానమీయరే’ అనండి)
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
మల్లెల సోమనాథ శాస్త్రి గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
అన్నువుఅమ్మ చూపు మరి అన్నువ గొల్పును తోడు నీడ, ఆ
రిప్లయితొలగించండిపన్నుల ఆపదల్ గనును ,పండితు పామరు వేరు జేయు ,ఎ
న్నెన్ని యొ మార్గముల్ దెలిపి నెయ్యము నేర్పును ఓర్పు తోడ ,ఆ
కన్నులు గ్రుడ్డి వే యయిన ( గాన ( గ వచ్చు సమస్త వస్తువుల్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
సుబ్బారావు గారి పూరణ రెండవ పాదం ప్రాస తప్పినట్లున్నది
రిప్లయితొలగించండికన్నులు గ్రుడ్డివే యయిన గానగ వచ్చు సమస్త వస్తువు
రిప్లయితొలగించండిల్న న్నువ జెప్పగా మరిని మన్నన తోడన జూడగ ల్గుట
న్మి న్నగ వచ్చునే నికను సన్నుతి నెప్పుడు జ్ఞాననే త్రము
బన్నుగ జూడగా వలయు పండిత సూక్తుల నిజ్జగంబునన్
subbaraavu gaaroo moodava paadamlo yatini koodaa sari cheyandi.
రిప్లయితొలగించండికొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పన్నులు నూడిపోయినను పచ్చడి యుండదె నెయ్యితోడుగా
రిప్లయితొలగించండిసున్నము లేకపోయినను సుందర మౌనుగ తమ్ములమ్మహా
సన్నుతి లేకపోయినను సాధ్యము జీవము దారయుండగా
కన్నులు గ్రుడ్డివే యయినఁ గానఁగవచ్చు సమస్తవస్తువుల్ :)
tooth : ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008
పన్ను, దంతం
కన్నెలు వెళ్ళగోరుచును కంబము లేకుకు ప్రీతియాత్రనున్
రిప్లయితొలగించండిచెన్నుగ చేరి తాతకడ చీకటి ప్రొద్దున నవ్వులాటలన్
చిన్నగ చేతినిన్ గొనుచు చెప్పుచు చూపగ వంటయింటిలో
కన్నులు గ్రుడ్డివే యయినఁ గానఁగవచ్చు సమస్తవస్తువుల్