చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, ‘ప్రసిద్ధ’మైన పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఊలపల్లి సాంబశివ రావు గారు భాగవతం.ఓఆర్ జి లో న్యత్యాక్షరి – 21 (భాగవతపు పూరణ) వివరణలు / పద్యమదురిమలు క్రింద లింకు చేశారు. శంకరాభరణం లోని పద్యాలన్ని దాని నుండి చూడ వచ్చు.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కే. ఈశ్వరప్ప గారూ, మీ మూడు పూరణలు (సీసపద్యంతో సహా) బాగున్నవి. అభినందనలు. రెండవ పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. సీసం ఎత్తుగీతిని తేటగీతిగా వ్రాసారు. కాని సమస్య పాదాన్ని ఆటవెలదిగానే ఉంచారు. మీ పద్యాలలో టైపు దోషాలు ఎక్కువగా ఉంటున్నాయి పోస్ట్ చేసేముందు ఒకసారి సరిచూడండి. **** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. **** కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నమ్మ బోకు సుమ్మ కమ్మగ మాట్లాడి
రిప్లయితొలగించండినాట కమ్ము లాడు నరుల నెపుడు
కల్లబొల్లికబురులెల్ల చెప్పుట లో ప్ర
సిద్ధుఁడైనవాఁడు బుద్ధి చెఱచు
కొంగ జపము జేయు దొంగ స్వాముల వెంట
రిప్లయితొలగించండినమ్మి తిరుగ వలదు నెమ్మి గాను
మంత్ర జలము జల్లి తంత్రము లనునేర్పు
సిద్ధుఁ డైన వాడుఁ బుద్ధి చెఱచు
సిద్ధి బొందు విధము శుద్ధ ము గజెపును
రిప్లయితొలగించండిసిద్ధు డైనవాడు, బుద్ధి జెఱచు
మంచి వాని జేరి మాయమా ట లచేత
దుష్ట బుద్ధి గలుగు దుష్టు డకట ,
పాద లేపనమ్ము ప్రవరాఖ్యున కొసంగ
రిప్లయితొలగించండిశైల సిరులఁ జూడ వాలె నచట
చిక్కు లందు ముంచె చెలఁగి వరూధిని!
సిద్ధుఁ డైన వాఁడు బుద్ధిఁ జెరచు!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండి‘ప్రసిద్ధ’మైన పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
దుష్ట మార్గములను దుర్యోధనుకు జూపి
రిప్లయితొలగించండిసర్వ నాశనమ్ము శకుని జేసె
మంత్ర విద్య నేర్చి మాయమాటలు జెప్ప
సిద్ధుఁ డైన వాడుఁ బుద్ధి చెఱచు
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదురితమైన చెడ్డ చరితతోడ కడు ప్ర
రిప్లయితొలగించండిసిద్ధు డైన వాడు బుద్ధి చెఱచు
మంచి వాని తోడ మనవలె సతతము
కరము సుఖము శాంతి కాంచు కొరకు
ఊలపల్లి సాంబశివ రావు గారు భాగవతం.ఓఆర్ జి లో న్యత్యాక్షరి – 21 (భాగవతపు పూరణ) వివరణలు / పద్యమదురిమలు క్రింద లింకు చేశారు. శంకరాభరణం లోని పద్యాలన్ని దాని నుండి చూడ వచ్చు.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
సాంబశివరావు గారి లింకు చూశాను. ధన్యవాదాలు.
బుధ్ధి బలము పెంచి ముక్తి మార్గము జూపు
రిప్లయితొలగించండిసిధ్ధు డైన వాడు, బుధ్ధి చెరచు
మూఢ భోధ జేసి ముప్పున బడవేయు
చదువు లేని వాడు సాధువైన
చిత్త శుద్ధి లేక శ్రీరంగనీతులు
చెప్ప నేమి ఫలము గొప్ప గాను
శుధ్ధి లేని మనసు సిధ్దిని బొందునా ?
సిధ్ధు డైన వాడు బుద్ధి చెఱచు !!!
కపటి మాయ లోడు కనికట్టు చేసేను
రిప్లయితొలగించండిజనుల వెర్రి మొగము చక్క చేసి
వివర మెరుగ కున్న వెర్రివెంగప్ప ,నే
సిద్ధుఁడైనవాఁడు బుద్ధి చెఱచు
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూఢనమ్మ కమున మునిగి తేలెడివారు
రిప్లయితొలగించండిమంచి మాట వినక పొంచి యున్న
చెనటి వాని కడకు చేర క్షుద్ర జ్ఞాన
సిద్ధుఁడైనవాఁడు బుద్ధి చెఱచు.
రిప్లయితొలగించండికౌరవులకుమామ, కపట కైతవమున
సిద్దుడైనవాడు,బుద్ధి చెరచు
వాడు .దార్త రాష్ట్ర పా౦డవులకు మధ్య
సమర మ౦దు కుక్కచావు చచ్చె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమల్ల్లెలవారిపూరణలు
రిప్లయితొలగించండి1.శకుని వోలె తాను సహవాసి యౌటచే
పాడు జేయ జూచు పగను గొనియు
చెలిమి నటన తాను చెడగొట్టగాను సం
సిద్ధుఁడైనవాఁడు బుద్ధి చెఱచు.
2.ఒరులమంచి గోరిఉద్ధరింప హితుడు
మ౦చి మాట జెప్పిమ౦చి గూర్చు
చెడును గూర్చు వాడు చెడు మంచి మార్చ ప్ర సిద్ధుఁడైనవాఁడు బుద్ధి చెఱచు.
3.సిద్ధు డతడు ప్రవరు సిద్ధమ్ము గాజేసె
యాత్ర వి౦త లెల్ల నమిత రీతి
వర్ణనమ్ముజేసి పాదలేప మిడడె
సిద్ధుఁడైనవాఁడు బుద్ధి చెఱచు.
4.సిద్ధి పొంది నంత సిధ్ధించు శ్రమలేక
సిరుల నెన్నొ యనుచు చెప్పు చుండి
చేయ గాను పనుచు చెడు కర్మ లెన్నియో
సిద్ధుఁడైనవాఁడు బుద్ధి చెఱచు.
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిఎదుట నున్న మనిషి ఎటులైన చావనీ
మేలు పడిన నేను-చాలట౦చు
దుష్పథమున నిన్ను ద్రోసివేయ సం
సిద్ధుఁడైనవాఁడు బుద్ధి చెఱచు.
సి'1 బాల్యవివాహాలుభవిషత్తుజెరచును
రిప్లయితొలగించండివిద్యలేకనెచటవిలువరాదు
వెట్టిచాకిరిమాన్పవెతలెల్లతగ్గులే
మూడనమ్మకాలుములజేర్చు
వరకట్నబాధలుకరుణతొమాన్పుము
లంచగొండులున్న?వంచనంబె
బ్రూణహత్యలుమాన్పు-పుట్టేడిబిడ్డలే
జీవనసమరానచింతమాన్పు
నీతికోవిధులెంచెడినీతులున్న
సిద్దుడైనవాడె|"బుద్దిజెఱచు
ఆశనత్యాసగామార్చి-హాయిలేని
మిత్రవర్యులనమ్మకు,మీకెముప్పు"
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కే. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు (సీసపద్యంతో సహా) బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ రెండవ పాదంలో యతి తప్పింది.
సీసం ఎత్తుగీతిని తేటగీతిగా వ్రాసారు. కాని సమస్య పాదాన్ని ఆటవెలదిగానే ఉంచారు.
మీ పద్యాలలో టైపు దోషాలు ఎక్కువగా ఉంటున్నాయి పోస్ట్ చేసేముందు ఒకసారి సరిచూడండి.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.