9, జనవరి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1578 (షణ్ముఖాత్మజుండు చంద్రమౌళి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
షణ్ముఖాత్మజుండు చంద్రమౌళి.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

  1. పరిచయంబు చేసె పత్నికి బ్రహ్మాజి
    చిన్ననాటి నాదు స్నేహితుండు
    పేరు షణ్ముఖుండు వెనుకనుండినవాడు
    షణ్ముఖాత్మజుండు చంద్రమౌళి.

    రిప్లయితొలగించండి
  2. కందిసంకరయ్య గారు : నా సొంత సమస్య మీకు పంపిస్తున్నాను దీనిని చిత్తగించి గ్రూపు లో ఇవ్వగలరు.

    సమస్య : మాతనుపెండ్లియాడితనుమాన్యతనొందెనుచూడగా ఇలన్

    రిప్లయితొలగించండి
  3. షణ్ము ఖాత్మజుండు చంద్ర మౌళి యుకాదు
    చంద్ర మౌళి కొడుకు షణ్ము ఖుండు
    రెల్లు గడ్డి యందు రేతస్సు మూలాన
    పుట్టి నట్టి శివుని పట్టి యార్య !

    రిప్లయితొలగించండి
  4. దయచేసి పేర్లు టైప్ చేసేటపుడు కొద్దిగా చూడమని మనవి లేకపోతే శంకరయ్యగారు 'సంకరయ్య' అయిపోతే చాలా బాధగా ఉంటుంది. ఇది ఎవరినో నొప్పించాలని కాదు సుమా.

    రిప్లయితొలగించండి
  5. వినుడు విజ్ఞులార విశ్వమంతయు దెలియు
    చంద్రమౌళి సుతుడు షణ్ముఖుండు
    సంస్కృతమ్ము రాక సరియొక్కడిటు జెప్పె
    షణ్ముఖాత్మజుండు చంద్రమౌళి.

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    ధన్యవాదాలు. ఇకనుండి మీరేమైనా సమస్యలను పంపినప్పుడు నేరుగా బ్లాగుకు కాకుండా నా ఇమెయిల్ (shankarkandi@gmail.com)కు పంపండి.
    మన బ్లాగులో వృత్తరచనలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు. కాని వృత్తరచనకు ఇబ్బంది పడే వాళ్ళూ ఉన్నారు. అందుకే నేను ఎక్కువగా జాత్యుపజాతుల్లోనే సమస్యలు ఇస్తున్నాను.
    మీ ఉత్పలమాల పాదాన్ని ఇలా కందంగా మార్పు చేశాను.
    ‘మాతను బెండ్లాడి సుతుఁడు మాన్యుం డాయెన్’.
    ఉత్పలమాల, కందం రెండింటిలో ఏది ఇవ్వాలో మీరే సలహా ఇవ్వండి.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శర్మ గారూ,
    ధన్యవాదాలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. బ్రహ్మ విష్ణు భవుల వావి వరసలెల్ల
    నరుల వశమె తెలియ ధరణి లోన
    తండ్రి కొడుకు వావి తారుమారైనదే
    షన్ముఖాత్మజుండు చంద్రమౌళి?

    రిప్లయితొలగించండి
  8. గండూరి లక్ష్మీనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. పౌత్రు నుదహరించ పండితుండనెనిట్లు
    షణ్ముఖాత్మజుండు, చంద్రమౌళి
    వారి పౌత్రు డగును!వావి వరుసలన్ని
    గౌర వించు వాడె ఘనత నందు!

    రిప్లయితొలగించండి
  10. సురభినాటకానచూసియుగమనించ
    షణ్ముఖాత్మజుండుచంద్రమౌళ
    వేషమెవరిదైనవేడుకగుర్చుటే|
    నాటకానవేయునాటకాలె|


    రిప్లయితొలగించండి
  11. చిత్రమది వినగను చినకొడుకైనట్టి
    షణ్ముఖాత్మజుండు చంద్ర మౌళి
    త్రాగుబోతు వాని తప్పుడు కూతయె
    యనుచు మదిని దాని కనగవలయు

    రిప్లయితొలగించండి
  12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారికి నమస్కారములు.

    క్రమాలంకార పూరణ.

    అరయనారు తలల యాదేవుఁడెవఁడు?
    శివునికేమియగును చిన్ని గణప?
    వెరసి యీబుడతల సరి తండ్రి యెవరురా?
    షణ్ము, కాత్మజుండు, చంద్రమౌళి

    రిప్లయితొలగించండి
  14. షణ్ముఖాత్మజుండు చంద్రమౌళికితాను
    మనుమడగును గాదె ఘనము గాను
    దేవసేన సుతుడు దేవేంద్ర పౌత్రుడు
    నైగమేషుడతడు నయము మీర

    రిప్లయితొలగించండి
  15. మల్లెలవారి పూరణ
    ఇంపుగా నొక యెడ ఏర్పడ నుండిరి
    చంద్రమౌళి తాత, సరసగతిని
    షణ్ముఖు౦డు కొడుకు,చక్కనౌ మనుమడే
    షణ్ముఖాత్మజుండు చంద్రమౌళి

    రిప్లయితొలగించండి
  16. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ క్రమాలంకార ప్రయత్నం బాగుంది. అభినందనలు.
    మొదటి పాదం చివర గణదోషం. ‘...యాదేవు డెవ్వడు’ అనండి.
    ఎవడు అన్న ప్రశ్నకు ‘షణ్ముఖుడు’ అని సమాధానం రావాలి కదా! కాని అక్కడ డుప్రత్యయం లేకుండా కేవలం షణ్ముఖ శబ్దమే ఉంది.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    షణ్ముఖాఖ్యు దగును చంద్రమౌళి సుతుడు
    షణ్ముఖాత్మజుండు చంద్ర మౌళి
    పౌత్రుడగును సుమ్మి వారలు మువ్వురు
    సురలు లేక గాని నరులు గాని

    రిప్లయితొలగించండి
  18. కె.యస్.గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి


  19. షణ్ముఖాత్మజు౦దు చంద్రమౌళికి ఎట్టి
    వావి గలదొ తెలుప వలె ననంగ
    మనుమ డగును లెమ్ము మరి యాతనికి ఏమి
    పేరు?తెలుప గలవ వీర వరుడ

    రిప్లయితొలగించండి
  20. శంకరయ్య గారు కాదేది కావ్యానికి అనర్హం . మీకు ఏది సబబని తోస్తే అదే ఇవ్వండి. కాకపొతే జాతులు ఉపజాతులు వ్రాసి వ్రాసి అసలు వృత్తాలు మర్చిపోయే అవకాసం కుడా లేక పోలేదు.అందువలన నాదొక సూచన సమస్య సమస్య కి మర్చి మర్చి ఇస్తే కవిత్వానికి న్యాయం చేసినవారు అవుతారేమో అని అనుకుంటున్నాను. నిర్ణయం మీదే.

    రిప్లయితొలగించండి
  21. శర్మ గారు మీరు తప్పునుఎత్తి చూపించారు బాగుంది . కాని అక్కడ ఉదాహరణ ఇచ్చి ఎవరినో నొప్పించేందుకు కాదు అనడం బహుశా మీకు మీ తెలివితేటల మీద వున్నా నమ్మకం కి ఉదాహరణ కావొచ్చు . దయచేసి ఒక సూచన గ్రహించగలరు తప్పు ను తప్పు అని ధైర్యం గా చూపించండి నిజమైన దానిని నిజంగా చూపించడం తప్పేమీకాదు . ఇకపోతే నావరకు నేను ధైర్యంగా ఒప్పుకుంటున్నాను అది కేవలం type mistake దానికి శంకరయ్య గారిని క్షమించమని ప్రార్ధిస్తున్నాను.శర్మగారి నిశిత పరిశీలనకి ధన్యవాదాలు . కాకపొతే ఆ దొర్లిన typing mistake లో ఎటువంటి దురుద్దేశం మాత్రం లేదు అని గమనిస్తే చాలు. పైన ఇచ్చిన ఈ comment లో కుడా ఏమైనా తప్పులుంటే సరిద్దిద్దు కొగలను .

    రిప్లయితొలగించండి
  22. కెంబాయ్ తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    ‘ఆటలో అరటిపండు!’.. ప్రమాదో ధీమతామపి అని ఊరికే అన్నారా?

    రిప్లయితొలగించండి