17, జనవరి 2015, శనివారం

పద్యరచన - 793

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. భారత దేశము నందున
    యూరూరా యాడునట్టి యుత్తమ క్రీడై
    పేరును గాంచిన కబడీ
    నీరోజున యాదరించనెవరునులేరే

    రిప్లయితొలగించండి
  2. చిత్ర మందున బాలలు చెలిమి తోడ
    కబడి కబ్బడి యనుచును గట్టి గాను
    నాడు చుండిరి గకబడి యాటను నట
    చూడ ముచ్చట గానుండె జూడు తేజ !

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘దేశము నందున| నూరూరను నాడునట్టి....’ అనండి.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. గ్రామ క్రీడల నేర్పున కైపు బెంచి
    ఊరు వాడల యువతను చేర దీసి
    సద్దుమణిగిన యాటల నుద్ధరించ
    తెలుగు నాడుల తేజమ్ము తిరిగి వచ్చు

    రిప్లయితొలగించండి
  5. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. చెడ్డీ గట్టిగ గట్టి క
    బడ్డీ నే యాడుచుండె బాలురు కనరా
    బుడ్డీ ! శ్వాస నియంత్రణ
    నడ్డుల తొలగించు యొడుపు లలవడు వినరా !

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. చెడుగుడు కబడీ పదముల
    గడగడ బలుకుచు కరమునుఁ గట్టిగ చేప
    ట్టెడు వాడావల నాటా
    డెడువానిపయిన గెలువగనెప్పుడు తలచున్.

    రిప్లయితొలగించండి
  9. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. పల్లెలందున బుట్టిన బుల్లియాట
    వ్యాప్తి చెందెను జగతిన దీప్తితోడ
    చిన్న పల్లెల యందున చెడుగుడనగ
    బడుల యందున దాని కబడ్డి యంద్రు

    రిప్లయితొలగించండి
  11. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ

    బడికిన్ బోవుట మాని క
    బడి నాడగనేల?యిట్లు వారల క్రిందన్
    బడి యేడ్చుటేలని రవిని
    బడితెన్ గొని కొట్టే తండ్రి వాతలు పడగన్

    రిప్లయితొలగించండి
  12. బడి వదలగ?కబడేయన?



    తడబడకను-నాటకడకు-తప్పకరాగా?
    విడువరువిద్యార్థులకది
    నడవడికలొభాగమాయె-నాగరికంబున్

    రిప్లయితొలగించండి
  13. ఆటలయందునకబడీ
    పాటలలోదేశభక్తి,పరిమళమొసగే
    దీటగుమల్లియనిలలో
    పోటీలేనట్టివనిరి|పూర్వులు,నిపుడున్

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ప్రతిపక్షపు తాకిడికిన్
    గతి తప్పక కూత నాపు కర్మన బడకన్
    చతురుండు ముగ్గు దాటును!
    ప్రతీ యసెంబ్లీ 'కబడ్డి' పాలితుల కిలన్!

    రిప్లయితొలగించండి
  16. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ప్రతీ’ అనడం దోషమే. ‘ప్రతిసభలోపల కబడ్డి’ అందామా?

    రిప్లయితొలగించండి
  17. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
    ప్రతిపక్షపు తాకిడికిన్
    గతి తప్పక కూత నాపు కర్మన బడకన్
    చతురుండు ముగ్గు దాటును!
    ప్రతి సభ తప్పని'కబడ్డి' పాలితుల కిలన్!

    రిప్లయితొలగించండి
  18. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ సవరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి