8, జనవరి 2015, గురువారం

నిషిద్ధాక్షరి - 27

కవిమిత్రులారా,
అంశం- కైక వరములు.
నిషిద్ధాక్షరము - క.
ఛందస్సు - తేటగీతి.

25 కామెంట్‌లు:

  1. రాము నివనవా సముమఱి రాజ్య మరయ
    భరతు హస్తగ తముజేయ వలయు నధిప!
    యీ వ రంబుల నడుగంగ నీ శు నామె
    దారి లేమిని యి చ్చెను దశ రధుండు

    రిప్లయితొలగించండి
  2. దశరథునితో కైక మాటలు...

    వరముల గూరిచి నేడు వి
    వరముగ నే జెప్పవలెన వనముల పాలన్
    సరగున జేయుడు రాముని
    భరతుని రప్పించి రాజ్య పాలన నిమ్మా !

    రిప్లయితొలగించండి
  3. ధశరధుని మూడవసతియె దయను మాలి
    పంపుమయ్య రాముని వనవాస మిపుడు
    జీవనుడు భరతుని రాజు జేయమనుచు
    వరముల నడిగెను పతిని వరుస గాను !!!

    రిప్లయితొలగించండి
  4. పదియు నాలుగునేడులు వనమునందు
    వాసముండనె; రాముని పట్టమడిగె;
    నాడు నేడైన మతిలేని నరుల చేత
    లిట్లు పరిణమించుచునుండు నిలనునయ్యొ.

    రిప్లయితొలగించండి
  5. దశరథుని ముద్దు చినరాణి తనయు భరతు
    ని యువరాజుగజేయుమని తనపతిని
    వేడె మొదటి వరమ్ముగన్ పేర్మి సుతుని
    రాము పదునాల్గు సంవత్స రములు పంప
    వనములకు, వేడె రెండవ వరము గాను

    రిప్లయితొలగించండి


  6. రాజ్యపట్టమ్మునందు భరతుడు, రాము
    డడవిలో పదు నాలుగు హాయనములు
    వాసమొనరింప వలెనని వరము లిడగ
    దశరథుని వేడె మూడవ ధర్మపత్ని

    రిప్లయితొలగించండి
  7. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ కందపద్య పూరణ బాగుంది. అభినందనలు.
    కాని అడిగిన ఛందస్సు తేటగీతి. మీరు గమనించినట్టు లేదు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శంకరా భరణ బ్లాగ్ కవి మిత్రులందరికి సవినయ విన్నపము .
    పద్య సమస్యా పూరణము చేయువారు అనేక పూరణలు చేసి పంపించు చున్నారు . పద్యములు వ్రాయు చున్నప్పుడు తెలసి తెలియక పొరపాట్లు జరుగుట సహజము. వాటిని పరిశీలించ వలసిన అవసరమెంతైన యున్నది. మనము వ్రాసిన పద్యములో అతి ఉత్తమంగానున్న ఒకే ఒక పద్యమును పంపిస్తే బాగుంటుందని నా అభిప్రాయము. ఆలోచించండి
    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  9. కైకేయి శ్రీ దశరథ మహారాజుతో.................


    నాదు వరములఁ వెలయింపు నాథ మీరు
    మున్నునొసఁగిన పగిది సమ్మోదమెసఁగ
    రామచంద్రుడి వనవాసరము భరతుని
    రాజ్యభారార్హతయును నశ్రాంతముగను

    రిప్లయితొలగించండి
  10. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    భరతునిన్ పట్టభద్రు నొనరిచి,రామ
    భద్రునిన్ వనవాసము పంపుమనుచు
    దశరథమహీపతి తృతీయభార్య కిడిన
    వరము వలన దశముఖు వధ జరిగెను

    రిప్లయితొలగించండి
  11. నాడు మీరన్న వరములు నేడు వలెను
    రాము నమ్పగా వలయు నరణ్యములను
    పదియు నాలుగు వత్సరాల్, భరతు నుంచ
    వలయు రాజపదవి యందు రాజ రేపు.

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. గండూరి లక్ష్మీనారాయణారు "మనము వ్రాసిన పద్యములో అతి ఉత్తమంగానున్న ఒకే ఒక పద్యమును పంపిస్తే బాగుంటుందని నా అభిప్రాయము" అని అన్నారు.

    ఆ మాట బాగుంది.

    రిప్లయితొలగించండి
  14. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    తాడిగడప శ్యామల రావు గారూ,
    మీ సూచనకు ధన్యవాదాలు. నిజమే... పూరణలు తక్కువగా వచ్చిన రోజు బాధపడతాను. ఎక్కువైన రోజూ వానిని నిశితంగా పరిశీలించి దోషాలుంటే ఎత్తిచూపి సవరణలు సూచించడానికి సమయం దొరకక బాధపడతాను. మీ రన్నట్లు కవిమిత్రులు ఒక్కొక్క పూరణను పంపిస్తే బాగుంటుందని నా సూచన కూడా.. ఒకటి కంటె ఎక్కువగా పంపరాదన్న నిషేధం మాత్రం లేదు.గమనించగలరు.
    ****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ పద్యం చివరిపాదంలో ‘కరుణ’ అన్నారు. కకారం నిషేధం కదా! గసడదవాదేశం చేసి ‘చెప్పుము గరుణచేత’ అనండి.

    రిప్లయితొలగించండి
  15. "వనవాసము జేయవలె ప
    దునాలుగేండ్లు రఘువరుడు తొలుత-పిదప నా
    తనయుఁ భరతుఁ రాజుని జే
    సిన జాల"ని దశరధుని చిన్న సతియనెన్

    రిప్లయితొలగించండి
  16. మల్లెలవారిపూరణ
    మాయలో బడి దశరథు మాన్య రాజ్ఞి
    రాము నడవుల బంపంగ,రాజు సేయ
    భరతు,నాతడిచ్చినయట్టి వరము లడిగె
    నదియె నారంభ మా దైత్యు లంతమునకు

    రిప్లయితొలగించండి
  17. మందరందించుమాటలుమర్మమరిసి
    దశరథునిభార్యవరములదానమడిగె
    రామునడవినబంపుచు,రాజ్యమంత
    భరతుడేలగజెప్ప?నాభాగ్యమనెను

    రిప్లయితొలగించండి
  18. వరమడిగెదశరధుఁ జిన్న భార్య - యుండ
    వలెను రాముడు పద్నాల్గు వత్సరములు
    వనము లందు - రాజును చేయవలె భరతుని
    యనిన దిగ్భ్రాంతితోడ రాజలమటించె

    రిప్లయితొలగించండి
  19. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    కందమైనా, తేటగీతి ఐనా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. రామ వనవాసము!భరత రాజ పదవి!
    యింతి వరములు దశరధు చింత బెట్ట
    ప్రాణసము విడ మృత్యువు రాజుఁ గొనియె
    ధనుజ సంహార మొనరించ ధరణి మురిసె!

    కందంలో
    రాముని వనములఁ బంపుచు
    భూమిని భరతుడు వరించ పోరగఁ బతితో
    భామినితో వనమేగగ
    సేమముఁ గూరెను దనుజులఁ జెండాడగనే!

    రిప్లయితొలగించండి
  21. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. అవునండీ..క్షమించాలి..తేటగీతి అని చూచుకొనలేదు...మాస్టరుగారూ ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  23. ఒక్క పద్యం లేదా రెండు కు మాత్రమె తావు ఇస్తే మంచిది గురువుగారు.

    రిప్లయితొలగించండి