కవిమిత్రులకు నమస్కృతులు. మొదట ‘త’వర్గాక్షరాలన్నిటికీ నిషేధం విధించాను. ఇప్పటికి వచ్చిన రెండు పూరణలలో ‘న’కారప్రయోగం ఉంది. నకార నిషేధంతో పద్యరచన ఎంత కష్టమో అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాను. నేనూ ప్రయత్నించి విఫలమయ్యాను. అందువల్ల తవర్గ కాకుండా కేవలం త-థ-ద-ధ లకే నిషేధాన్ని సవరించాను. మిత్రులకు కలిగించిన ఇబ్బందికి మన్నించమని మనవి.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** భళ్లముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మల్లెలవారిపూరణలు 1.ప్రజయె ప్రభువౌచు రాజ్యాలు వాసి వెలిగె పూర్వభాగమ్మువెలిగేటి పుణ్య భూమి పశ్చిమంబున బరగెడి భాగ్య భూమి రెండు కూడ వే సూర్యుడు లేచు రోజు 2.సూర్యు పూజల కొలువగా శుభము కలుగు ఆయురారోగ్య భాగ్యాల హాయి వొడము రేయి పగలవి చక్రమ్ము లింపు మెరయు రోజు సూర్య ప్రభ లవియెరోచిసిడగ
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. కాని నిషిద్ధాక్షరాలను ఎక్కువగానే ప్రయోగించారు.
భాస్కరుండు పుట్టిన రోజు పావనమగు
రిప్లయితొలగించండిమాఘ మాసము లోవచ్చు మంచి రోజు
నిష్టగ రవిని బూజించ నిచ్చు ససిని
యేడు జన్మల పాపముల్ వీడు మనకు
మాఘ మాసపు పండుగ మంచి యయ్యె
రిప్లయితొలగించండిభాస్కరుడు పుట్టు సప్తమి పగలు కాగ
ఏడు గుఱ్ఱాల బండిపై నేగు సామి !
యాల కించుచు మా గోడు హర్ష మీయు
సూర్యు పుట్టిన రోజున సొంపుగాను
రిప్లయితొలగించండిజరుగ చుండగ వేడుకల్, జనులు నిష్ట
వెళ్ళు చుండ్రి కాంచ నరస వల్లి గుడిని
కోరు కోరికలన్నియున్ కూరుకొరకు
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమొదట ‘త’వర్గాక్షరాలన్నిటికీ నిషేధం విధించాను. ఇప్పటికి వచ్చిన రెండు పూరణలలో ‘న’కారప్రయోగం ఉంది. నకార నిషేధంతో పద్యరచన ఎంత కష్టమో అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాను. నేనూ ప్రయత్నించి విఫలమయ్యాను. అందువల్ల తవర్గ కాకుండా కేవలం త-థ-ద-ధ లకే నిషేధాన్ని సవరించాను. మిత్రులకు కలిగించిన ఇబ్బందికి మన్నించమని మనవి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికటిక చీకటి పాలిట కడుపు మంట
రిప్లయితొలగించండికొలను కలువల కెన్నగా గుండె మంట
ఏడు గుర్రాల బండిపై నేగు మింట
వేయి కరముల మారాజు వెలుగు పంట.
మాఘ మాసపు టేడవ మంచిరోజు
పొడుపు కొండల పైకెక్కి భూరి కృపను
జీవ కోటుల జీవిక భావములను
కనుల వెల్గుల నింపుచు చనెడి గనుడు.
మాఘ మాసపు పండుగ మనకు నయ్యె
రిప్లయితొలగించండిభాస్కరుడు పుట్టనేడవ పగలు వలన
ఏడు గుఱ్ఱాల బండిపై నేగు సామి !
యాల కించుచు మా గోడు హర్ష మీయు
ఏడు గుర్రాల బిగిని సూరీడు వచ్చి
రిప్లయితొలగించండిసురభి వేడ్కలు చక్కగ జూడ నిచ్చి
మాఘ మాసపు లాహిరి మనము నింపి
కోరు వారికి పంచడే కోటి ప్రభలు !!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
భళ్లముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భుజుని పుట్టిన రోజున పుడమి జనులు
రిప్లయితొలగించండిచిక్కుడాకులు చేకొని శ్రీకరమగు
పాయసముసమర్పించుచు బాళి గాను
చండరుక్కుని బూజించి శరణు వేడు !!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమల్లెలవారిపూరణలు
రిప్లయితొలగించండి1.ప్రజయె ప్రభువౌచు రాజ్యాలు వాసి వెలిగె
పూర్వభాగమ్మువెలిగేటి పుణ్య భూమి
పశ్చిమంబున బరగెడి భాగ్య భూమి
రెండు కూడ వే సూర్యుడు లేచు రోజు
2.సూర్యు పూజల కొలువగా శుభము కలుగు
ఆయురారోగ్య భాగ్యాల హాయి వొడము
రేయి పగలవి చక్రమ్ము లింపు మెరయు
రోజు సూర్య ప్రభ లవియెరోచిసిడగ
మూడురంగులజండాలు-నేడుగాంచి|
రిప్లయితొలగించండిఏడురంగులచాయలే-తోడురాగ|
ఏడుగుఱ్ఱముల్బండిలోనేకబిగిన
నేడురవిరాగ?పర్వమే|తోడునీడ|
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాఘమాసములోనసమాన కర స
రిప్లయితొలగించండిమాశ్రయంబుగ పొడసూపె నాకసమున
భాస్కరుండుగ నామంబు వడసి లోక
మెల్ల వెలుగులఁ బూయించెనినకరుండు.
మాఘ మాసపు సిత పక్ష మమర యారు
రిప్లయితొలగించండినొకటి,వాసరమ్మున రవి శకట మింక
నర్ధపతి నివసించెడి యాశ వైపు
తరలి పోయెడి వేళ భాస్కరుని పూజ
ఆయు రారోగ్య దాయకమై చెల౦గు
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని నిషిద్ధాక్షరాలను ఎక్కువగానే ప్రయోగించారు.
బ్రహ్మ విష్ణు మహేశ్వర వరుస మింటఁ
రిప్లయితొలగించండిబనుల నిర్వహించెడు ఘనా పాటి యంటు
కనులు మూసియే మ్రొక్కడు గగనమణికి
పూజ సేయరె పుట్టిన రోజ టంచు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగురుదేవులు మన్నించాలి
నిషిద్దాక్షరములు తొలగించి సవరించిన పద్యము
మాఘ మాసశుక్లపు పక్ష మమర యారు
నొకటి,వాసరమ్మున రవి శకట మింక
నర్ధపుడు నివసించెడి యాశ వైపు
పరుగు పెట్టిన వేళ భాస్కరుని పూజ
ఆయు రారోగ్యముల నిచ్చి అలర జేయు