7, జనవరి 2015, బుధవారం

పద్యరచన - 783

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

 1. ఆంజనేయు సురస యడ్డగించుచు నోరు
  పెద్ద జేయ హనుమ పెంచె రూపు
  దాని నోట దూరె తన రూపు త్రగ్గించి
  నోటినుండి దుమికి యాట లాడె

  రిప్లయితొలగించండి
 2. సీత జాడను కొఱకునై శీఘ్ర ముగను
  ఆకసంబున బరువిడు హనుమ జూచి
  రక్క సిసురసి మ్రింగగ నొక్కసారి
  వచ్చె బయటకు రయమున వానరుండు

  రిప్లయితొలగించండి
 3. రామ భక్తి గల్గు నా మారుతిని మ్రింగ
  చిక్కు లందదె పెను రక్క సైన!
  రామ బాణమట్టి లక్షణంబులు నిండ
  హనుమ నాప వశమె హరునకైన!

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘తగ్గించి’ టైపాటు వల్ల ‘త్రగ్గింది’ అయింది.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘సీత జాడ తెలిసికొన...’ అంటే బాగుంటుందేమో?
  ****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘వంటి’ అనడానికి ‘అట్టి’ అన్న గ్రామ్యపదాన్ని ఉపయోగించారు. ‘రామశరమువంటి’ అనండి.

  రిప్లయితొలగించండి
 5. దక్షిణపుదిక్కు సీతకై తరలుచున్న
  గాడ్పు కొడుకుఁ బరీక్షించు కాంక్షతోడ
  సురలు పిలిపించిరగమాత సురస వేగ
  కోరలనుపెంచి యసురగ మరి సురస
  యడ్డగించె కొండవలెనా హనుమ నప్డు
  నాదు యనుమతి లేకుండ నన్ను దాటి
  సాగరము దాటి నీవిప్డు సాగలేవు
  నోటిలోనికి చని కడు దాటి గాను
  వెలికి రాకున్న నానుండి వేగముగను
  మారుతి చిరు రూపును దాల్చి దూరి నోట
  వెలికి వచ్చెవాయువుఁ బోలు వేగముగను
  సురస తనరూపును ధరించి శుభముఁ బల్కె

  రిప్లయితొలగించండి
 6. సీత జాడ వెతకు శ్రీహను మంతుని
  ఆకశాన సురస అడ్డగించె
  నొడలు చిన్న జేసి నోటదూరియతడు
  వైరి మాయ లెల్ల వమ్ము జేసె

  రిప్లయితొలగించండి
 7. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
  రామ భక్తి గల్గు నా మారుతిని మ్రింగ
  చిక్కు లందదె పెను రక్క సైన!
  రామ శరము వంటి లక్షణంబులు నిండ
  హనుమ నాప వశమె హరునకైన!

  రిప్లయితొలగించండి
 8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ తేటగీతిక బాగున్నది. అభినందనలు.
  ****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. గగన మందు జనెడు గాలిచూలినిగని
  దారి గాచి సురస నోరు తెరువ
  సూక్ష్మ రూపమందు సురస నోటనుదూరి
  వాయువేగ ముగను వచ్చె హనుమ !!!

  రిప్లయితొలగించండి
 10. రామ దూతను నేను లంకకు పోనుంటి
  ........నెవరి వమ్మా నన్ను నిట్టు లాప
  నీ వెవ రైనను చేవ గల్గిన నిన్ను
  ........హాయిగా భుజియింతు నాగవయ్య
  సీత జాడను జూచి శీఘ్రమే నే వత్తు
  ........విడువ వమ్మా నాకు కడలి దారి
  నిన్ను పో నిత్తునా నీమాట నమ్మను
  ........మ్రింగు దాన నిపుడె మిడిసి పడకు

  వానరుడు చాల పెద్దగా మేను పెంచె
  నురిమి పెద్దది జేసెను సురస నోరు
  సూక్ష్మ రూపాన యుక్తిగా జొచ్చి నోట
  వెలికి వచ్చెను మారుతి వేగముగను.

  రిప్లయితొలగించండి
 11. సురసిననోటదూరిపరిశోదకుడట్లుగపొట్టదూరియున్
  తిరిగియువచ్చెగాహనుమ-దివ్యప్రతాపపునవ్యరీతిగా
  అరుదుగపళ్లమధ్యగని?నచ్చెరువందెనురాక్షసచ్చటన్
  మరణములేనిమారుతుకిమంగళమౌననెనాగమాతయే|
  2చూడభయంకరంబయినచూపులు,కోరలునున్నపళ్ళతో
  దాడియుజేయరాక్షసినిదక్షతచేతనుఆంజనేయుడే
  పాడియుగాదునీకిపుడు-ప్రక్కకువెళ్ళమనంగ?నడ్డగా
  ఓడకసూక్ష్మరూపుడుగనోటనుదూరియుగాంచెవింతగా|

  రిప్లయితొలగించండి
 12. నూరు యోజనముల నోరు దెరచె మ్రింగ
  సురస-కడుపు జొచ్చి మరలె హనుమ
  తీరె బ్రహ్మవరము తీరె నీ యాకలి
  యనుచుమింటి కెగసి నరిగె లంక

  రిప్లయితొలగించండి
 13. శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  మిస్సన్న గారూ,
  మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  కె.ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు వృత్తాలు బాగున్నవి. అభినందనలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి