10, జనవరి 2015, శనివారం

న్యస్తాక్షరి - 22

అంశం- వెన్నెల
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా ‘చం - ద - మా - మ’ ఉండాలి.

29 కామెంట్‌లు:

 1. చంద మామయే యిచ్చును జల్ల నైన
  దండి వెన్నెల మనకుగా ధరణి యందు
  మామ యత్రిమ హర్షికి బ్రహ్మ యంశ
  మ!నిజ మిదినమ్ము డా ర్యులు మాట నాది

  రిప్లయితొలగించండి
 2. చంద్ర కిరణము సోకిన సంత సమున
  దనరు చుండెను కలువలు తమకు తామె
  మామ యరుదెంచె గగనాన మత్తు జల్లి
  మమత పంచును వెన్నెల మనసు దీర

  రిప్లయితొలగించండి
 3. చందురుడువెన్నెలుంచగ?చక్కదనము
  దరికిజేరునురాత్రిళ్ళుదర్పణముగ|
  మాతృభూమికి-ప్రకృతిమమతలల్లి
  మనకుబంచగనేతెంచు|మధువువోలె|

  రిప్లయితొలగించండి
 4. చంద్ర కాంతులు తనువుకు చల్లగాను
  దరము కొచ్చెను వలపులు ధరణి తలము
  మాటు మడుగున జంటల మంత నాలు
  మరులు గొల్పగ వెన్నెల మధువు నిచ్చి

  రిప్లయితొలగించండి
 5. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘రాత్రిళ్ళు’ అన్నదాన్ని ‘రాత్రులు’ అనండి.
  మూడవ పాదంలో ‘ప్రకృతి’ అన్నచోట గణదోషం. ‘ప్రకృతియె’ అనండి.
  ****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘దరముకొచ్చెను’.. అర్థం కాలేదు. ‘ఒచ్చెను’ అనడం గ్రామ్యం.. సవరించండి. ‘కురియసాగెను వలపులు...’ అని నా సవరణ...

  రిప్లయితొలగించండి
 6. చందురుని మించినది యేది యందమందు?
  దరినిఁ జేరు వెన్నెలయే కదా, మరి! మటు
  మాయమగునట్లు జేయునే గాయమైన
  మదిని శాంతి యొసగి బాధ మరువజేయు.

  రిప్లయితొలగించండి
 7. చంద్రు డుదయించె ప్రభలతో చదలపైన
  దయకలుగగను కలువల ధ్యానము విని
  మామ గమనపు చంద్రికల్ మరులుగొల్ప
  మత్త జంటలు చేరిరి మంచె పైకి

  రిప్లయితొలగించండి
 8. చంద్రికలు వెదజల్లుచు చలువ నిడెడి
  దక్షజాపతి నిగనగ ధరణి జనుల
  మానసమ్ములు పులకించి మరచు వెతలు
  మమత నిండును చక్కని మామ జూడ !!!

  రిప్లయితొలగించండి
 9. గురువర్యులకు ధన్యవాదములు ....
  చంద్ర కాంతులు తనువుకు చల్లగాను
  దరుము లిడుచువచ్చె వలపు ధరణి తలము
  మాటు మడుగున జంటల మంత నాలు
  మరులు గొల్పగ వెన్నెల మధువు నిచ్చి

  రిప్లయితొలగించండి
 10. చందమామయ్య వెలుగులు చంటిపాప
  దరిని బువ్వను తినిపించు తాయిలాలు
  మాధవుని రాక గోరెడు రాధ పాలి
  మదన తాపాగ్ని రగిలించు మాయ తెరలు.

  రిప్లయితొలగించండి
 11. subbarao gaaru మీపూరణలో మొదటి అక్షరాలూ చం ,దం మా మ వచ్చాయి . మనకి కావలసినవి చందమామ కదా దయచేసి గమనించగలరు

  రిప్లయితొలగించండి
 12. చందనమువలె చంద్రిక జల్లగానె
  దలను రంజిల్ల చిందుచున్ దనరు చంద
  మామ గాంచిన తరుణుల మనములందు
  మరులు ప్రేమాను భూతులు కెరలుచుండు .

  రిప్లయితొలగించండి
 13. తే.గీ. చందమామరావేయనిచంద్రునడగ
  దయకలిగిగగనమునయందముగ తిరుగ
  మాకొలనుకలువలికహంసలుగవెలుగ
  మనసుహాయిగ రేయిఝామంతగడుప

  రిప్లయితొలగించండి
 14. చ౦దురుని కా౦తి వర్షమ్ము చి౦ద గానె
  దరికి జేరిన దంపతుల్ తనివి దీర
  మారునిన్ తృప్తి గావించి మసలు కొనుచు
  మనసువిహగము యాకసమందు ఎగుర

  రిప్లయితొలగించండి
 15. మల్లెల వారి పూరణ
  చందువైనట్టి కాంతిని సర్వజనులు
  దయిత లందున కోరిక తాము పొంద
  మారు సఖు డౌచు సుధ నిచ్చి మాయ జేయు
  మధుర మైనది జాబిలి మహిత జగతి


  రిప్లయితొలగించండి
 16. సుబ్బారావు గారు మీ పద్యం లో మూడవ పాదం యతి తప్పింది సరిచేయ గలరు.

  రిప్లయితొలగించండి
 17. ఈస్వరప్ప గారు మీపద్యం లో మూడవపాడం లో చివర సూర్య గణం తక్కువయ్యింది మరియు నాలుగవ గణం ఇంద్ర గణం వేసారు సరిచేయగలరు.

  రిప్లయితొలగించండి
 18. తిమ్మాజీరావు గారి పూరణలౌ గణాలు, యతి అన్నీ సరిగానే ఉన్నాయి పిరాట్లప్రసాద్ గారు

  రిప్లయితొలగించండి
 19. చందమామతోగూడి నక్షత్రములు ము
  దము గొలిపెడి వెలుగులతో తనరుచుండ
  మానసంబంత యానంద మయము కాగ
  మల్లెపూవంటి వెన్నెల మత్తు గొలిపె

  రిప్లయితొలగించండి
 20. చంద మామయే యిచ్చును జల్లదనము
  దనరు వెన్నెల మనకుగా ధరణి యందు
  మామ యత్రిమ హర్షికి బొమ యంశ
  మ!నిజ మిదినమ్ము డా ర్యులు మాట నాది

  రిప్లయితొలగించండి
 21. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మత్తజంటలు’ అనడం దుష్టసమాసం. ‘మత్తమిథునాలు’ అనండి.
  ****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదంలో చంద్రుడే చందమామ రావే అని పిలవడంలో మీ భావం అర్థం కాలేదు. మూడవ పాదంలో యతి తప్పింది. ‘కొలనులో కలువ లిక హంసలుగ వెలుగ’ అంటే సరి. ‘జాము’ను ‘ఝాము’ అన్నారు.
  మిత్రుల పూరణలను సునిశితంగా పరిశీలించి దోషములను తెలుపుతున్నందుకు ధన్యవాదాలు.
  సుబ్బారావు పూరణలోని (దం) దోషాన్ని నేను గమనించలేదు. అక్కడ ‘జల్లనౌ హృ| దయరంజకచంద్రికల్ ధరణియందు’ అందాం.
  కెంబాయి తిమ్మాజీ రావు గారి పూరణ మొదటిపాదంలో గణయతిదోషాలు లేవు. ప్రాసయతి వేయబడింది.
  సుబ్బారావు గారి పూరణ మూడవ పాదంలో యతి తప్పిన విషయాన్ని నేను గమనించలేదు. ‘మామ యత్రిమహర్షికి మర్కు నంశ
  మ!’ అని నా సవరణ..(మర్కుడు=బ్రహ్మ)
  ఈశ్వరప్ప గారి పూరణలో సవరణ సూచించాను.
  ****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ****
  సుబ్బారావు గారూ,
  మీ సవరణలో ‘బొమ’ అనడమూ దోషమే.. పిరాట్లవారికి నేనిచ్చిన సమాధానంలో మీ పాదానికి సవరణ చూడండి.

  రిప్లయితొలగించండి
 22. శంకరయ్య గారు చందమామ రావే అని పిలువగానే చంద్రుడు ఆకాసంలో ప్రత్యక్ష మయ్యాడు అని చెప్పను అండి. రెండవది మూడవ పాదం లో గణభంగం అవలేదు ఎందుకంటె మా కి బిందుపూర్వక మయిన య,ర,ల,వ,శ ,ష ,స ,హ ల తొ యతి మైత్రి కుదురుతుంది కాబట్టి. దయచేసి గమనించగలరు.

  రిప్లయితొలగించండి
 23. పిరాట్ల ప్రసాద్ గారూ,
  యతి విషయంలో నేను పొరబడ్డాను. మన్నించండి.
  “బిందుపూర్వకాలైన అంతఃస్థాలకు (య,ర,ల,వ), ఊష్మములకు (శ,ష,స,హ) మకారంతో యతిచెల్లడం ‘మవర్ణయతి’.

  రిప్లయితొలగించండి
 24. శంకరయ్య మీరు అంగీకరించినందుకు ధన్యవాదాలు . మీకు ఇంకొక వివరణ ఇవ్వదలిచాను .జాము , ఝాము రెండు ఒకటే ఏదైనా వాడవచ్చని నిఘంటువు లో వున్నది.

  రిప్లయితొలగించండి
 25. పిరాట్ల ప్రసాద్ గారూ,
  ‘ఝాము’ శబ్దం కేవలం బ్రౌన్, శ్రీహరి నిఘంటువులు మాత్రమే పేర్కొన్నవి.ఈ రెండూ జనసామాన్యంలో వాడుకలో ఉన్న (వ్యావహారిక/గ్రామ్య) పదాలను కూడా స్వీకరించారు.
  ప్రామాణికాలైన శబ్దరత్నాకరం, శబ్దచింతామణి, సూర్యరాయాంధ్ర నిఘంటువు, వావిళ్ళ నిఘంటువులు ‘ఝాము’ శబ్దాన్ని చెప్పలేదు. ‘ఝాము’ తత్సమం కాదు. తద్భవమనుకుంటే అచ్చతెలుగులో ఝ అక్షరం లేదు. గమనించ మనవి.

  రిప్లయితొలగించండి