గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, కనుమను బసవన్నల వే డ్కను వర్ణించితివి మేలుగా నిపు డిది చ క్కని పద్యం బనుటకు నా కనుమానము లేదు గోలి హనుమచ్ఛాస్త్రీ! **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
బసవన్న వచ్చాడు మా ఇంటికి
రిప్లయితొలగించండిరారన్న రారన్న సుస్వాగతం
పూమాల వేసేము పచ్చ గడ్డి వేసేము
కరుణించి స్వీకరించు మన్న బసవన్న !!
శుభోదయం
జిలేబి
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండిశుభోదయం! మీ భావానికి నా పద్యరూపం.....
వచ్చె బసవన్న మాయింటి ప్రాంగణమున
కెల్ల రాహ్వానమును బల్కి యెంతొ వేడ్క
పూలమాలలు వేసిరి పూరి యిడిరి
స్వీకరించి కరుణను దీవించ మనిరి.
పాడి పంటకు ముఖ్యము పశుగణమ్ము
రిప్లయితొలగించండిపెంచ వానిని ప్రేమతో మంచి యనుచు
కనుమ దినమున పూజలు కానుమిచట
సాంప్రదాయము లందున సార మిదియె
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కానుమిచట’ అన్నదాన్ని ‘కాంచుమిచట’ అనండి.
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండికను మావంకని గోవులు
కనుమను బసవన్న లంత కర్షకు దలచున్
కనుమా నేడె యెందుల
కనుమానము పూజ సేయు నాతడు ప్రీతిన్.
చిత్ర మాయెను జూడగ జిత్రమునట
రిప్లయితొలగించండిపూల మాలను జేబూని పూవు బోడి
పచ్చ గడ్డిని గరమున పడుచు పిల్ల
పట్టు కొనియుండి రచ్చట పశువు గనుచు
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండికనుమను బసవన్నల వే
డ్కను వర్ణించితివి మేలుగా నిపు డిది చ
క్కని పద్యం బనుటకు నా
కనుమానము లేదు గోలి హనుమచ్ఛాస్త్రీ!
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పశువు లనాదిగా మనిషి బాసట, జంతువు లేని వేళలో
రిప్లయితొలగించండివశమగునే వసుంధరను వాటముగా లభియించు సంపదల్?
శిశువుల రీతి సాకనవి జెచ్చెర క్షేమము గూర్చు నేరికిన్
విశదము కాదె యీ నిజము వేల యుగమ్ముల నుండి మిత్రమా!
గో సంపద మానవులకు
వాసిని రాశియున మిన్న పండుగ పూజల్
చేసి కృతజ్ఞత చాట క-
నీసపు ధర్మమ్ము మనకు నిజమిది తెలియన్.
ఇట్టి సూక్తి ననాదిగా నెరిగి యుంట
కనుమ పండుగ దినమున కర్షకాళి
పసుల పూజించి ప్రకటింత్రు వాని యెడల
నెదను కలిగెడు మాలిమి నింపుగాను.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
జంతువులందున మానిసి
రిప్లయితొలగించండికొంత యనువుగలిగి, కొంత కూరిమినుండన్
చింతలు దీరునటంచును
సుంత తెలుపు వేడుకలివి, సొబగుగ తోచున్.
గోలివారు మూడవ పాదాన్ని కొద్దిగా సవరించాలి.
రిప్లయితొలగించండిఆరుగాలము పనిఁజేయ నవతరించి
రిప్లయితొలగించండిపాడి పంటల కైసదా పాటు పడుచు
రైతులకు మేలు సలిపెడి ఱంకెలెద్దు
పూజ సలుపుచు నుండిరి పూల తోడ
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
మిస్సన్న గారూ,
ధన్యవాదాలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గోవుకుపూజలెందులకు?కోర్కెలుదీ ర్చునుకామదేనువే|
రిప్లయితొలగించండిఆవన?నర్దకేజికనకాకృతి|"పూర్వులసామెతెంచియే"
జీవనసారసంపదను-చిత్రముగాసమకూర్చుగాన|నా
భావనభాగ్యమైవరల?భారతజాతియెభక్తినింపిరే|
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఘనముగ సింగారించుచు
రిప్లయితొలగించండికనుమను గోవులను గొలుచు కర్షకులంతా
జనులకు మేలొసగెడిగో
ధనమౌ పశువులనుకాస్త దయతో గనుమా!!!
పాడి పంటల వృద్ధికై పశు గణమును
రిప్లయితొలగించండికర్ష కులు మ ఱి పూ జింత్రు కనుమ నాడు
పసుపు కుంకుమ యక్షత ల్బరగ మిగుల
సంత సంబున బ్రతి యేట సంతు గూడి
మాస్టరుగారూ ! పద్యాభినందనకు ధన్యవాదములు...
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ ..కనుమా " నేడే "... ..టైపాటు జరిగినది...ధన్యవాదములు.
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిపసుపున్ కుంకుమబొట్టు పెట్టేదమునీఫాలాన, శృంగమ్ములన్
మిసిమిన్ దీర నొనర్తు మయ్య నడుమన్ మేలైన పూలుంతు నీ
కుసుమగ్రైవము వైతు మయ్య మెడలో కొండంత ప్రేమాస్పదన్
బసవా!గంధముపూసి కొల్తుము నినున్ భర్గుండు హర్షి౦పగా
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మెడపై కాడిని మోసిన
రిప్లయితొలగించండితొడుకా! పూదండ తోడ దోయిలి గొనుమా!
కుడువగ నోటికి భాగ్యం
బిడ పుంగవమా! తృణపు నివేదన గనుమన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.