సత్యనారాయణ రెడ్డిగారూ ధన్యవాదములు. గుణదోష విచారణ జేయగల పరిపూర్ణ పరిజ్ఞానము నాకు లేదండీ. నేనే తరచూ తప్పులు చేస్తూ ఉంటాను. చంద్రమౌళి సూర్యనారాయణ గారు దీనికి సమర్థులుగా తోస్తోంది.
మిత్రులకు నమస్కృతులు. నిన్న రోజంతా అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, సి. రామమోహన్ గారు నాతోనే ఉండి, నన్ను రైలెక్కించి వెళ్ళారు. వారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం ప్రొద్దుటూరు చేరుకున్నాను. ముందుగా బ్రహ్మం గారి మఠం వెళ్ళి దర్శించుకుని మధ్యాహ్నం వరకు సహదేవుడు గారి కుమార్తె వివాహం జరిగే కళ్యాణ మండపం చేరుకున్నాను. భోంచేసి విశ్రాంతి తీసుకొని ప్రక్కనే ఉన్న నెట్ సెంటర్‌కు వచ్చాను. నా సెల్‌ఫోన్‌లో అందరి పూరణలు, పద్యాలు చదువుతున్నాను. విడివిడిగా సమీక్షంచే ఓపిక, సమయం లేవు. మన్నించండి. ఇప్పటి వరకు పూరణలు పంపిన మిత్రులు.... పోచిరాజు సుబ్బారావు గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, జిలేబీ గారికి (మీ భావానికి ఛందోరూపం ఇచ్చే సమయం లేదు. మన్నించండి), మిస్సన్న గారికి, కెంబాయి తిమ్మాజీ రావు గారికి, మల్లెల సోమనాథ శాస్త్రి గారికి, కె. ఈశ్వరప్ప గారికి, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి, చంద్రమౌళి సూర్యనారాయణ గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, అభినందనలు, ధన్యవాదాలు.
మాపటి వేళ యయ్యె నని మామయ గారుడు వంగ నప్పు డు
రిప్లయితొలగించండిన్దీ పము పెట్టె నింట యువతీ మణి, భళ్ళున తెల్ల వారిన
న్బాపను లేపి యామె మఱి పాలను దెమ్మని నానతీ యగ
న్నాపని జేయలేననిన నేపని జేతువు ? చెప్పుమా యనెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదీపము పెట్టెనింట యువతీమణి , భళ్ళున తెల్ల వారినన్
రిప్లయితొలగించండికోపము నందునన్ మరచి కోమలి గంకటి నాశ్ర యించగా
తాపము నొందుచున్ గనిన ధామము నంతయు వెల్గు లీనగన్
పాపము భర్తనే కసిరె వారిజ లోచన సత్యభా మయై
రిప్లయితొలగించండిభామామణి బ్రస్సెల్స్ నగరమునకు ఏగె
భానుని తీవ్ర జూను నెల న సమ్మరున
పొద్దు గూకినది గదా యని దీపము పెట్టె నింట
యువతీ మణి భళ్లున తెల్లవారినన్ !!
శుభోదయం
జిలేబి
కాపుర మేమొ క్రొత్త తన కాంతుడు వీడడు చెంగు నెన్నడున్
రిప్లయితొలగించండిరేపును మాపు ముచ్చటలె రేలన కాముని పున్నముల్ గదా
పాపము లేచునప్పటికి భానుడు తూర్పున దోచె సిగ్గుతో
దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్!
రిప్లయితొలగించండిఆపురి నేలు రాజు యొక డానతి జేసెను శాసనమ్ము గా
మాపటి వేళనే బరగు మండల కార్యము లన్ని, భానువున్
కైపుగ నిద్ర పోవలయు. కాదనశిక్షకు పాత్రు లౌదు,రన్
దీపము పెట్టె నింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్
మల్లెలవారి పూరణలు
రిప్లయితొలగించండి1.దీపముపెట్టువేళ కటుదీపమునుంచియు వెల్గు చూపు తా
దీపము నౌచు భర్తకును తియ్యని తోడయి పిల్లపాపలన్
దీపము వోలె చూచుచును తేటగ తానము లాడి,పూజకున్
దీపము పెట్టె నింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్
2.దీపము పెట్టు భార్యయె గతించగ నిల్లది బోసి పోవగా
శాపమునయ్యె భర్తకును చక్కని పిల్లల తీర్చి దిద్దగన్
వే సరు లెవ్వరిన్ గనక పె౦డిలి జేయకుమారు భార్యయే
దీపము పెట్టె నింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్
రూపసిబార్యకిన్దెలిపె-రూమునకేలకరెంటుబల్బు|నీ
రిప్లయితొలగించండిదాపుననున్నచాలుపరితాపముమాన్పగరాత్రియంతటన్
లోపములేనివెల్గుమనలోపలనుండె|నటన్న?నవ్వుచున్
దీపముపెట్టెనింటయువతీమణి|బళ్ళునతెల్లవారినన్|
మాపటి వేళయయ్యె వెస మర్కుని మ్రింగగ రాహువత్తఱిన్
రిప్లయితొలగించండిదీపముపెట్టెనింటయువతీమణి,భళ్ళున తెల్లవారినన్
తాపను వీడగా గ్రహము, ధాత్రి వెలింగెను సూర్యు కాంతితో
నేపున విచ్చె తామరలు హేళిని గాంచి ముదమ్ము తోడుతన్
కాపురమందునున్న తన కష్టములన్నియు స్వప్నమందు తా
రిప్లయితొలగించండినోపగజాలనంచునొక యోగికి చెప్పగనావునేతితో
దీపముపెట్ట కష్టములు తీరుననెన్ ముని-నిద్రలేచితా
దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్
రిప్లయితొలగించండిపండిత నేమాని గారిచే ఎన్నో ప్రశంసలందుకున్న మిస్సన్న కవివరేణ్యులు మా పద్యముల
గుణదోష విచారణ చేయ వలసిందిగా మనవిచేస్తున్నాను
పాపము! భర్తపై నలిగి భార్య పరుండెను రాత్రి కాంతుడే
రిప్లయితొలగించండిదీపము పెట్టెనింట, యువతీమణి భళ్ళున తెల్ల వారినన్
గోపము తోడ లేవకను కుంచతమౌ మదితో పరుండ దా
నే పనులన్ని జేసి కడు నేర్పున పత్నికొనర్చెచోద్యమున్.
సత్యనారాయణ రెడ్డిగారూ ధన్యవాదములు. గుణదోష విచారణ జేయగల పరిపూర్ణ పరిజ్ఞానము నాకు లేదండీ. నేనే తరచూ తప్పులు చేస్తూ ఉంటాను. చంద్రమౌళి సూర్యనారాయణ గారు దీనికి సమర్థులుగా తోస్తోంది.
రిప్లయితొలగించండిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న రోజంతా అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, సి. రామమోహన్ గారు నాతోనే ఉండి, నన్ను రైలెక్కించి వెళ్ళారు. వారికి నా ధన్యవాదాలు.
ఈరోజు ఉదయం ప్రొద్దుటూరు చేరుకున్నాను. ముందుగా బ్రహ్మం గారి మఠం వెళ్ళి దర్శించుకుని మధ్యాహ్నం వరకు సహదేవుడు గారి కుమార్తె వివాహం జరిగే కళ్యాణ మండపం చేరుకున్నాను. భోంచేసి విశ్రాంతి తీసుకొని ప్రక్కనే ఉన్న నెట్ సెంటర్‌కు వచ్చాను.
నా సెల్‌ఫోన్‌లో అందరి పూరణలు, పద్యాలు చదువుతున్నాను. విడివిడిగా సమీక్షంచే ఓపిక, సమయం లేవు. మన్నించండి.
ఇప్పటి వరకు పూరణలు పంపిన మిత్రులు....
పోచిరాజు సుబ్బారావు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
జిలేబీ గారికి (మీ భావానికి ఛందోరూపం ఇచ్చే సమయం లేదు. మన్నించండి),
మిస్సన్న గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
పెద్దలు మిస్సన్న గారికి ధన్యవాదములు ... నేనింకా పద్యరచనలో నర్సరీలోనే ఉన్నానండీ... మీలాంటి పెద్దలు నాపేరు గుర్తుచేసుకోవడమే మహద్భాగ్యం
రిప్లయితొలగించండిదీపము ధూపముల్ వెలుగ దేవత లందరి నింట నిల్పగన్
రిప్లయితొలగించండిపాపము కొపముల్ దునిమి వాడిమి నివ్వగ కోర్కె గోరుచున్
శ్రీ పరి వారమున్ దలచి శేముషి గల్గగ పూజ సేయుచున్
దీపము పెట్టె నింట యువతీ మణి భళ్ళున తెల్ల వారినన్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
రిప్లయితొలగించండిఆపరమేశు సన్నిధిని యర్చన జేయగ మ్రుగ్గు వేసియున్
దాపుననున్న పూవులను తానుగ కొన్నిటి గోసి తెచ్చి, నా
పాపములన్ని ద్రెంచుమని భక్తిని సోత్రము జేయబూనుచున్
దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్
పాపపు దారులన్ మసలి భాగ్యవశమ్మున జ్ఞానమేర్పడన్
రిప్లయితొలగించండిలోపలి చీకటుల్ తొలగి లోకుల గాచెడి భానుజూడగన్
దీపము పెట్టె నింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్
శాపము తీర్చి బ్రోచెడి నిశాంతుడు శ్రీహరి ప్రేమ సోకినన్
మొదటిసారి ప్రయత్నిస్తున్నాను. తప్పులు సవరించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
రిప్లయితొలగించండికోపము తోడ చీకటినె కోరుచు మాసిన చీరతోడ తా
రిప్లయితొలగించండిపాపము! పుత్రునిన్ వనికి పంపుట నాదని కోర్కె తెల్పగా
తాపము తీరె, హా! మగడు దారిని గానక యేడ్చుచుండగా
దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్ :)
రూపసి చేసి స్నానమును రుద్రము పల్కుచు మాఘపూర్ణిమన్
రిప్లయితొలగించండితీపిగ నాథునిన్ కొలిచి తియ్యగ మ్రొక్కుచు నత్తగారికిన్
పాపకు పాలనిచ్చి వడి పార్వతి నుంచిన మందసమ్మునన్
దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్!