22, జనవరి 2015, గురువారం

పద్యరచన - 798

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. కవిసమ్మేళనమందున
  నవయువ కవులందరుండెనలరించుటకై
  కవితా కుసుమంబులతో
  నవవర్ష శుభాభినందనలను తెలుపుచున్

  రిప్లయితొలగించండి
 2. కవుల సమ్మేళ నమయది ,కాన బడియె
  గురువు మధ్యగా నిరువైపు లరయ వారు
  నొకరు మించిన నొకరుగా నుండి రచట
  జయము నా బడు వత్సర చర్చ కొఱకు

  రిప్లయితొలగించండి
 3. ప్రతియుగాది దినము కవి పండిత సభ
  యువకవులకు నిజమ్ముగ నుపకరణము
  సుమ్మ, కవుల సంధానము శుభముఁ గూర్చు
  తెలుగు భాషకు జాతికిన్ తీరుగాను

  రిప్లయితొలగించండి

 4. పంట్లాము తొడిగిన పంచె కట్టిన నేమి
  చీర కట్టిన షేర్వాణీ వేసుకున్న నేమి
  ఉగాది పర్వ సమ్మేళనం కనుల
  పండుగయై వినసొంపైన సమ్మిళితం !

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘కవులందరు’ అన్నారు కనుక ‘ఉండిరి’ అనాలి. అక్కడ ‘నవయువ కవిసంఘ ముండె’ అనండి.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  జిలేబీ గారూ,
  _/\_

  రిప్లయితొలగించండి
 6. గురువుగారికి నమస్కారములు.

  మామూలుగా ఉగాదినాడు కవిసమ్మేళనములో అవధానము నిర్వహించడము ఒక ఆనవాయితీ.

  ఒక అవధానిమాహాశయులు ప్రారంభ పద్యము చెప్తున్నట్లుగా ఒక ఊహ.

  అవధానంబులొనర్తు పద్యరచనా వ్యాపారసంసిద్ధతన్
  కవిరాజేంద్రులు పృచ్చకోత్తములుగా కావ్యంబులంశంబులై
  నవసాహిత్య వివేచనాగరిమచేఁ నానాప్రకారంబు ప
  ద్యవివాదంబులు కర్ణపేయములుగానత్యంత దివ్యంబుగా.

  రిప్లయితొలగించండి
 7. వగలు సెగలు గుబులు కొనుచు
  ఎగిసి పడగ నవ్య కవులు ఏకము కారే !
  ప్రగతికి నాంది బలికి ఈ
  పొగలిక వద్దని ఉగాది పూరణ లిడరే

  రిప్లయితొలగించండి
 8. కవులిటపంచిపెట్టెదరుకమ్మనికావ్యసుధాంశసూక్తులున్
  భవితకుభాగ్యసంపదగ,భావములన్నియుపండజేసి|మీ
  చెవులకుజేర్చభూనుటకుచింతిలుచుండిరి|శ్రోతలార|యీ
  నవయువకాగ్రశేఖరులనాగరికంబుకుముఖ్యమైనవే

  రిప్లయితొలగించండి
 9. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘కవులు + ఏకము’ అన్నప్పుడు సంధికార్యం జరుగుతుంది. ‘కవులు నేకము’ అనండి.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘నాగరికంబుకు’ అనకుండా ‘నాగరికంబునకు’ అని ఉండాలి. అక్కడ ‘నాగరికానికి’ అందాం.

  రిప్లయితొలగించండి
 10. 'జయ'కవి సమ్మేళనమది
  జయముఁ గలుగంగఁ గోరి స్వాగతమనగన్!
  దయనీయమ్ముగ బుధజన
  క్షయమై వీడ్కోలుఁ బలుకు సమయమ్మాయెన్!

  రిప్లయితొలగించండి
 11. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ద్వితీయపాదంలో గణదోషం..‘జయమది కలుగంగఁ గోరి...’ అనండి.

  రిప్లయితొలగించండి
 12. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
  జయ'కవి సమ్మేళనమది
  జయమది కలుగంగఁ గోరి స్వాగతమనగన్!
  దయనీయమ్ముగ బుధజన
  క్షయమై వీడ్కోలుఁ బలుకు సమయమ్మాయెన్!

  రిప్లయితొలగించండి
 13. కవివరు లెల్ల గూడిరిట గానముసేతు రుగాది నాడు జ క్కవకవవిందు చుట్టు చలచంచువు వోలెను,మావిశాఖపై
  కువకువ గానముల్ వినిచి కోయిలరీతిని,చూడ ముచ్చటౌ,
  భవనము నందు శారదకు పద్య నివాళుల సేవ చేయగా

  రిప్లయితొలగించండి
 14. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పద్యము
  ఆ శారదాదేవి అర్చనార్ధము విక
  సించిన సితసరసిజము లనగ
  సాహిత్య భవనము స౦స్థిరమ్ముగ నిల్పు
  మహిత శక్తిగల స్తంభము లన౦గ
  అవధానవిద్య మహాద్భుత కందుక
  ఖేలన మాడెడి బాలురుగను
  సత్కవితా రస సౌందర్య రాశి వి
  గ్రహము మలచు శిల్పకారులనగ
  కవులు ప౦డితు లెల్లరు కలిసి రిచట
  స్వచ్ఛ జల యుత మైనట్టి సరమునండు
  స్వేచ్చగా విహారమ్మును చేయు కొఱకు
  వచ్చి చేరిన హంసల వలె తనరుచు

  రిప్లయితొలగించండి
 15. శుభముగ నుగాది నాడున
  సభదీరిరి సత్కవులట సంతోషముగన్
  ప్రభవించెను నవకవితల్
  త్రిభువనములు పులకరించు దీయని తెనుగున్!!!

  రిప్లయితొలగించండి
 16. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి