29, జనవరి 2015, గురువారం

పద్యరచన - 805

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

 1. త్రాడుమీదనడువ తాసాహసించెను
  భయములేక చిన్న వయసులోనె
  చిన్న పిల్లలైన చేయక తప్పదు
  పొట్టకూటికొరకు నిట్టిపనులు

  రిప్లయితొలగించండి
 2. పిల్ల యొక్కతె యచ్చట బిడికి లందు
  చేతి కఱ్ఱను జేబూని చిత్రముగను
  నడచు చుండెను ద్రాటిపై నాగ ! జూడు
  మబ్బురంబును గలిగించ నందఱకును

  రిప్లయితొలగించండి
 3. గారడి జేయుచు జనులను
  బీరము లేకుండ వింత భీభత్స ములన్
  నేరుపుగా నెఱపు దురట
  వారసు లుగనొక రిమించి ప్రాభవ మనుచున్

  రిప్లయితొలగించండి

 4. భేటీ పడావో అని నాయకుండు అనగ
  భేటీ ,చడో కసరత్తు చేయ అయ్య అనగ
  అయ్య మాట విని చేసితి ఈ కసరత్తు
  దీనికైన కష్టమా నాకు పడాయి బడాయి !!

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. వీధి ప్రక్కన గారిడీ వెనక బెట్టి
  కూటి కోసము బిడ్డల ఆట మాని
  మంచి చదువుతో వారిని పెంచ బూని
  నారి శక్తికి తండ్రుల జోరు వలయు!!

  రిప్లయితొలగించండి
 6. ఆసియా క్రీడ లందలి యద్భుతములు
  ఘన యొలింపికు క్రీడా రికార్డులైన
  ఒక్క దొమ్మరి బాలిక యొడుపుగాను
  చూపు విన్యాసముల కౌనె సుంతయైన?

  రిప్లయితొలగించండి
 7. ప్రోత్స హించిన కొలదియే యుత్సుకమ్ము
  పడతి నేర్వగ రాదన్న పనియె లేదు
  రాతి యుగపు భావనలను పాతి పెట్టి
  క్రొత్త దారులు పట్టరో కొమ్మ లంత !!

  రిప్లయితొలగించండి
 8. పోట్టియుపొట్టకూటికని-పూర్వులనుండియునేర్పువిద్యనే
  కట్టడిలందుసాధనచె|కాలముబంచెడిమార్పుచేర్పుతో
  కట్టినతీగఫైనడక-కంతులచేతనుముందుకెళ్ళుటే
  చట్టమటంచుచూపరులుసందడిజేయగ?సాహసంబెగా|

  రిప్లయితొలగించండి
 9. పొట్టకూటికై త్రాటిపై పట్టుగాను
  నడచుచున్నది చిన్నారి వడివడిగను
  చూచు చుండిరి జనులంత సోద్యముగను
  దొసగులాచిన తల్లికి తొలగుటెపుడొ?

  రిప్లయితొలగించండి

 10. పద్యరచన:దొమ్మర సాని యాట
  చూడగ రండు పొట్ట కయి సొ౦పుగ త్రాటి పయిన్ చరించు యా
  క్రీడను,నేర్పు మీర నిరు కేలుల దండము బట్టి నెత్తి పై
  వేడుక నుంచి పాత్రలను వి౦తగ పాదములన్ ఘటించుచున్
  మూడు గజమ్ము లెత్తునను భూమికి,దొమ్మర సాని బాలికన్

  రిప్లయితొలగించండి
 11. పండిత నేమాని గారిచే ఎన్నో ప్రశంసలందుకున్న మిస్సన్న కవివరేణ్యులు మా పద్యముల
  గుణదోష విచారణ చేయ వలసిందిగా మనవిచేస్తున్నాను

  రిప్లయితొలగించండి
 12. సత్యనారాయణ రెడ్డిగారూ ధన్యవాదములు. గుణదోష విచారణ జేయగల పరిపూర్ణ పరిజ్ఞానము నాకు లేదండీ. నేనే తరచూ తప్పులు చేస్తూ ఉంటాను.

  రిప్లయితొలగించండి
 13. చంద్రమౌళి సూర్యనారాయణ గారు దీనికి సమర్థులుగా తోస్తోంది.

  రిప్లయితొలగించండి
 14. ఆశయసిద్ది-త్రాటిఫయినాశగబాలికనాడుచుండుటే
  యాశన?డబ్బుకేగద?ప్రయాసని,సంశయమెంచబోక,లో
  కేశునినమ్మిదొమ్మరులుకేవలమెంచెడివృత్తియైన?సం
  దేశము?బాలకార్మికులదీనతగాంచుమటంచుజూపుటే|

  రిప్లయితొలగించండి
 15. చిత్రాన్ని చూసి స్పందించి చక్కని పద్యాలను అందించిన మిత్రులు....
  చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
  పోచిరాజు సుబ్బారావు గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  జిలేబీ గారికి (మీ భావానికి ఛందోరూపం ఇచ్చే సమయం లేదు. మన్నించండి),
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారికి,
  మిస్సన్న గారికి,
  కె. ఈశ్వరప్ప గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. కోటి విద్యలెల్ల కూటి కొరకు చూడు మిచ్చటన్
  తిండిలేక చదవలేక తిరిగి తిరిగి వీధులన్
  గుండెలోన ప్రాణ భయము కూడి యున్న బెదరకన్
  తాడు పైన నడచు చుండె తడబడుచును కడుపుకై.

  రిప్లయితొలగించండి