ఆకలి చేత పిల్లలసహాయులుగా తపియించుచుండగా మీకొక స్నేహితుండతడు, మీ మొఱ విన్న చలించు కుండునే? గైకొని పొండు కొన్ని చెలికాడును మెచ్చగ నెవ్వియైన, నం చాకుల కాంత పల్కె, బలియౌ విధి జిక్కి కుచేలుడుండగా.
కవిమిత్రులకు నమస్కృతులు. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నాను. నా సెల్ ఫోన్‌లో మీ పూరణలను, పద్యాలను చూస్తున్నాను కాని ఫోన్ ద్వారా వ్యాఖ్యానించడనికి అవకాశం లేదు. కొద్దిగా సమయం దొరికితే ఒక నెట్ సెంటర్ నుండి ఈ వ్యాఖ్య పెడుతున్నాను. రేపు కూడా హైదరాబాదులోనే ఉంటాను. రేపటి సమస్య, పద్యరచన శీర్షిక షెడ్యూల్ చేసి ఉంచాను. దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి. పునర్దర్శనం ఎల్లుండి. అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాక్షలు.
ఆకలి చేత పిల్లలసహాయులుగా తపియించుచుండగా మీకొక స్నేహితుండతడు, మీ మొఱ విన్న చలించ కుండునే? గైకొని పొండు కొన్ని చెలికాడును మెచ్చగ నెవ్వియైన, నం చా కుల కాంత పల్కె, బలియౌ విధి జిక్కి కుచేలుడుండగా.
ఆ'కలి'కి తట్టుకొనలేక నలమటించు
రిప్లయితొలగించండిసతియు సుతులను జూచి తా 'చలి'తుడైన
యా కుచేలుడు 'చెలి'కాని నాశ్రయించ
యా 'బలి'ధ్వంసి స్నేహితునాదరించె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబలిమి నున్నట్టి యాకలి బాధ కోర్వ
రిప్లయితొలగించండిజాల కకుచేలు డంతట యాలి బుజ్జ
గించి చెలికాడు కృష్ణుని నంచితముగ
వేడు కొనగను నరిగెను విచ లి తుడుగ
కలిమి గల గోవిందుడు
రిప్లయితొలగించండిచలిబాధకు మైమరపున స్వర్గము నందున్
చెలికాడగు నీసుధాముని
బలిమిగ గెంటించు నేమొ భాగ్యం బెటులో
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తట్టుకొనలేక యలమటించు...’ అనండి.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
దత్తపదాలను పాదాదినుంచి చక్కని పూరణ చేశారు. అభినందనలు.
బేసి పాదాలలో గణదోషం. ‘కలిమి గలుగు గోవిందుడు’, ‘చెలికాడైన సుధాముని’ అనండి. ‘స్వర్గమునందున్’ అన్నచోట ‘స్వగృహము నందున్’ అంటే బాగుంటుంది కదా!
గురువులకు ధన్య వాదములు
రిప్లయితొలగించండిఎందుకో ఆ రెండు పాదాలు నాకూ నచ్చలేదు కానీ ఎలావ్రాయాలో తట్టలేదు ప్చ్ ! ఒకోసారి అంతే
కలికారకుండె కృష్ణుని
రిప్లయితొలగించండిచెలికాడై యవతరించ - చెలిమికి యిలలో
కలిమియు బలిమియు సాంతము
వలదని, భక్తికి చలించి వరములు గుప్పెన్
(కలికారకుడు - నారదుడు
కుచేలుడు - నారదుని అవతారము)
చెలికాడిసాయమందగ
రిప్లయితొలగించండికలియగ-శ్రీకృష్ణచెంత?కరుణామయుడై|
చలియించికుచేలునిగని|
కలిమిని,బలిమిని-సమముగగలువగజేసెన్|
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చెలిమికి నిలలో’ అనండి.
****
కె.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘శ్రీకృష్ణుఁ జేర’ అనండి.. అన్వయం కుదురుతుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలిమిని గలిగిన మిత్రుడు
రిప్లయితొలగించండిబలిబంధను వేడుమనుచు భార్యయె పనుపన్
చలితనము గన కుచేలుడు
చెలికానినిజూడవెడలె చిపిటమ్ములతో!!!
చిపిటములు = అటుకులు
చలితనము = ప్రాప్తము
మల్లెలవారి పూరణ
రిప్లయితొలగించండిబలితనమయ్యెపేదరిక బాధయు నీకును కూడు బెట్టగా
కలికిరొ!కట్టబట్టలును కావగ మానములేకయుండగా
చలికి వడ౦కుచు౦టి మిటు సాయము చేయును కృష్ణు డొక్కడే
చెలిమిని గుర్తునుంచు కొని చేకొనునంచు కుచేలు డేగెగా
ఆకలి చేత పిల్లలసహాయులుగా తపియించుచుండగా
రిప్లయితొలగించండిమీకొక స్నేహితుండతడు, మీ మొఱ విన్న చలించు కుండునే?
గైకొని పొండు కొన్ని చెలికాడును మెచ్చగ నెవ్వియైన, నం
చాకుల కాంత పల్కె, బలియౌ విధి జిక్కి కుచేలుడుండగా.
రిప్లయితొలగించండిబలి సేయకుసంతతి నా
కలి చలి బాధలకునోర్వ గా లేర"ని యా
కులసతి వేడ,కుచేలుడు
చెలికాడగు కృష్ణుజూచి సిరులను పొందెన్
ఆకలిని తాళ జాలక నాకుచేలు
రిప్లయితొలగించండిసతి, చెలియగు కృష్ణు నుతింప పతిని కోర
చలిత మానసుడై తాను చనియె నపుడు
బలియగు సతీసుతుల స్థితి తెలియజేసి
సాయమొందగ తనబాల సఖుని వేడి
చెలి మాట విని కుచేలుడు
రిప్లయితొలగించండికలి మేమియు లేని వాడు కష్టములున్నన్
చలియించక రాత్రి బవలు
బలిమిని బహుకష్టపడుచు బ్రతుకుచు నుండెన్.
కలిమిని కోరకే తిరిగె గౌరవ మొప్పగ చిన్ననాటిదౌ
రిప్లయితొలగించండిచెలిమిని జూపినా డహహ శ్రీసఖుడంచు నుతించి మాటికిన్
చలితుడు నా కుచేలుడు ప్రసన్న హృదిన్ కరుణార్ద్ర చిత్తుడే
బలితము నన్ను బోంట్లకు భవాబ్ధిని దాటగ నంచు మెచ్చుచున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికడుబలీయమౌ నాకలి గాసిఁబెట్ట
రిప్లయితొలగించండిబిడ్డలనుగూర్చి తనమది పిచ్చలించ
చెలియగు జనార్థనుని చేరి కొలుచుమనియె
నాకుచేలుని ప్రియపత్ని యాశ తోడ
పిచ్చలించుః భయపడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికె.యెస్,గురుమూర్తి ఆచారి గారిపూరణ
రిప్లయితొలగించండిచెలికాడున్ యదువంశ నాథు డగు నా శ్రీకృష్ణు నర్ధింప ని
శ్చలిత స్నేహముతో కుచేలు పరిరక్షన్ జేసె నవ్వారి యా
కలి బాధన్ సమయించుచున్ సకలభాగ్యమ్ముల్ ప్రసాదించుచున్
బలితుండౌ బలహీనుడైనను హరిన్ భావింప విశ్వాసియై
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నాను. నా సెల్ ఫోన్‌లో మీ పూరణలను, పద్యాలను చూస్తున్నాను కాని ఫోన్ ద్వారా వ్యాఖ్యానించడనికి అవకాశం లేదు. కొద్దిగా సమయం దొరికితే ఒక నెట్ సెంటర్ నుండి ఈ వ్యాఖ్య పెడుతున్నాను. రేపు కూడా హైదరాబాదులోనే ఉంటాను.
రేపటి సమస్య, పద్యరచన శీర్షిక షెడ్యూల్ చేసి ఉంచాను.
దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
పునర్దర్శనం ఎల్లుండి.
అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాక్షలు.
పొరబాట్లు సవరించినాక.....
రిప్లయితొలగించండిఆకలి చేత పిల్లలసహాయులుగా తపియించుచుండగా
మీకొక స్నేహితుండతడు, మీ మొఱ విన్న చలించ కుండునే?
గైకొని పొండు కొన్ని చెలికాడును మెచ్చగ నెవ్వియైన, నం
చా కుల కాంత పల్కె, బలియౌ విధి జిక్కి కుచేలుడుండగా.