26, జనవరి 2015, సోమవారం

పద్యరచన - 802

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
    క్రమశిక్షణనుజూపి కదిలెడి శకటాలు
    ................. దేశ సమగ్రతన్ తెలియ చెప్పు
    కదనరంగములోన గర్జించు టాంకర్లు
    .................. దేశ శస్త్ర పటిమ తేటపరచు
    జనుల మనము దోచు సైనికుల కవాతు
    .................. దేశ సైన్యము యొక్క తీరు తెలుపు
    సాహస విన్యాస స్వైర విహారాలు
    ................... దేశ ప్రజల యొక్క తెగువ చాటు

    సర్వ సత్తాక లౌకిక సామ్యవాద
    దేశ మందున గణతంత్ర దినము నేడు
    రాజధాని ఢిల్లీ లోని రాజపధము
    నందు జరగు చుండె నానందముగను

    రిప్లయితొలగించండి
  2. వంద నంబులు సేయగ వంద లాది
    సేన యంతయు నచ్చట శ్వేత ప్రభున
    కుమఱి సంతస మాయెను కుసుమ ! నాకు
    నెంత ముచ్చట వేసెనో , వింత జూడ

    రిప్లయితొలగించండి
  3. పూర్తి స్వాతంత్ర్యమీనాడు పొందినాము
    కాంచ లేదు బడుగువారు కరము వృద్ధి
    చిక్క ప్రగతి స్వార్థ పరుల చేతిలోన
    బడువారల బాధలు పాయు టెపుడొ

    రిప్లయితొలగించండి
  4. గణ తంత్ర పర్వ దినమును
    ఘనముగ జరిపి మనదేశ గారము చాటన్
    ఘనతను జూసి నొబామా
    మనమే యూగద ?నరేంద్ర మాన్యత బొగడన్ !

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్లముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి వారి గణతంత్ర కవాతుల వర్ణన మనోజ్ఞంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  7. జనగణ తంత్ర దేశముగ చక్కగ మారిన భారతావనిన్
    జనవరి యిర్వదా రనిన సైనిక పాటవమున్ గ్రహించగా
    మన కొక గొప్ప వేడ్క గద మాన్య సిపాయి లవక్ర విక్రమ-
    మ్మును చవి జూపి శత్రువుల మూల్గును పీల్చెడి సాధనమ్ములన్
    గని మురియంగ మేన పులకాంకురముల్ జనియించు సోదరా!

    రిప్లయితొలగించండి
  8. గుణతంత్ర్యమె?గణతంత్ర్యము|
    అణువణువున-దేశసేవకంకితమిడు-ఆ
    గుణవంతులె?సైనికులై|
    క్షణక్షణమునగాచువారె-గనిపింతురుగా|

    రిప్లయితొలగించండి
  9. దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. సైనిక పదాతి దళమా!
    పూనికఁ గన శత్రుదేశ బుర్రలు దిరుగున్
    మౌనుల దేశమ్మనుచు
    హీనులమని యెంచువార లేడ్చరె చూడన్!



    రిప్లయితొలగించండి
  11. గణ తంత్రపు వేడుకలన్
    మన పద సైనిక నికాయ మహిమయు క్రమశి
    క్షణగా, కవాతు నకు వ౦
    దనమిడు రాష్ట్రపతి ప్రజల తరఫున గనరే

    రిప్లయితొలగించండి
  12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పలువురుచూచుచుండగనె?ప్రక్కననున్నజవానులెందరో|
    విలువకవాతులండుకొనివిద్య-ప్రదర్సనజేయనెంచగా?
    తలపునభారతీయగణతంత్రమహోత్సవనేటివేడుకల్
    నిలచు|నొబామదంపతులనిత్సలతత్వమునందునెప్పుడున్

    రిప్లయితొలగించండి
  14. కె.ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    దయచేసి టైపు దోషలు లేకుండా చూడండి.

    రిప్లయితొలగించండి