చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** మిస్సన్న గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన మూడవ పాదం తో పద్యం : మోపు నెత్తఁ బోయి మోకాళ్లు సోకంగ! చూపుఁ జూపు చిలుక సుధలుఁ బొంగ! బావ సైగ లోని భావాలు గుచ్చంగ! కుర్ర దాని బుగ్గ లెర్ర బారె!
పిరాట్ల ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** సహదేవుడు గారూ, ఈమధ్య మిత్రులు టైప్ దోషాలు ఎక్కువగా చేస్తున్నారు. ప్రచురించేముందు ఒకసారి సరిచూసుకోవలసిందిగా ఎన్నోసార్లు సామూహికంగా, వ్యక్తిగతంగా చెప్పాను కూడా. కాని మార్పు లేదు. అందుకని నేను టైపాట్లను ఎక్కువగా పట్టించుకోవడం లేదు. సవరించిన పద్యం బాగున్నది. సంతోషం. **** శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. **** సుసర్ల నాగజ్యోతి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం! మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘మావోయ్’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. గ్రామీణుల విషయం కనుక పాత్రోచిత భాషను ప్రయోగించడం తప్పు కాదనుకోండి. అయినా అక్కడ ‘మామా’ అంటే సరిపోతుంది కదా!
మంద పీతాంబర్ గారూ, ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు! చాలా సంతోషం.. నిజానికి ఈరోజు ఉదయమే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘కాపూ’ అనడమే కాస్త ఇబ్బందిగా ఉంది. ‘కాపుల ప్రేమికుల...’ అనవచ్చుకదా! **** సుసర్ల నాగజ్యోతి గారూ, ఒకసారి ప్రచురించాక ఇక సవరించడానికి అవకాశం లేదు. బ్లాగు నిర్వాహకుడనైన నాకు కూడా! సవరణలుంటే మళ్ళీ టైప్ చేసి క్రొత్తగా పోస్ట్ చెయ్యడమే! పైన గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ టైపు దోషాలతో ముందు పోస్ట్ చేసి, ఆ దోషాలను సవరించుకొని ‘సవరించిన పద్యం’అంటూ మళ్ళీ పోస్ట్ చేశారు. గమనించండి.
నాగజ్యోతి గారూ, దోషాలేమైనా ఉంటే మొదటి పద్యాన్ని పూర్తిగా తొలగించే అవకాశం మాత్రం ఉంది. ఆ పద్యం క్రింద తేదీ, సమయం ప్రక్కన చెత్తడబ్బా బొమ్మ కనిపిస్తున్నది కదా! దాన్ని క్లిక్ చేసి సూచనలను పాటిస్తే సరి!
నెత్తిమీదమోపుమెత్తి యీ మోపును (మోపుము+ఎత్తి )
రిప్లయితొలగించండికోరమీసమున్న కోతిబావ
గడ్డి మిషను జూపి కవ్వించనేలనే
కొంటె చూపు తోడ కోమలాంగి
పచ్చ గడ్డి మోపు భామకు దలపైన
రిప్లయితొలగించండిపెట్టు చుండె భర్త బిట్టు గాను
మోపు బరువు నామె మోయగ లేదేమొ ?
తాత ! యెత్తు కొనుము దయను నీవు
మోపును నెత్తిన బెట్టుచు
రిప్లయితొలగించండిచూపులు సారించె నతడు సొగసులు విరియన్
కోపమున బలికె చిన్నది
సాపత్యము గాదు వినుము సరసుడ యనుచున్
నల్ల కాటుక చాటున పిల్ల వలపు
రిప్లయితొలగించండిబరువు నెత్తికెత్త యతని కరువు దీర్చె
రెండు జూపులు కలియగ రెప్ప పాటు
మదన యుద్ధమ్ము ప్రకటించె మనసు గూడ
ధాన్య రాసుల పోకలు తనవి దీర
రిప్లయితొలగించండికష్ట పడిన రైతన్నకు కరువు దీర్చు
సకల భోగములు భువిని సత్కరించ
సంకు రాతిరి అందాలు సంతరించు !!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మోపెత్త బావ నాయుడు
రిప్లయితొలగించండిచూపులనెడు మోకుగట్టి చుట్టెను వానిన్
మోపొకటి తలను బెట్టెను
మోపుగ నింకొకటి యెంకి ముడిచెను తలపున్.
మోపు నెత్త మంచు ముగ్ధ కన్నుల లోని
రిప్లయితొలగించండిమెరుపు జూసి మేని విరుపు జూసి
మోపు మాట మరచె మురిసి నాయుడుబావ
ఎంకి కనుల పూచె పంకజాలు.
ఆటపాటలందునన్నిపనులయందు
రిప్లయితొలగించండికలిసిమెలిసియుండ కనులపంట
చూచువారికెల్ల సొగసైన కాపుర
మనగనేమొ జూపుననుట సొబగు.
మోపు నెత్తుచు మరదలి యేపుఁ జూసి
రిప్లయితొలగించండిమదన భాణపు హతి హృది కదము ద్రొక్క
మంచె కాడను కలువగ నెంచి కోర
బావ కోర్కెను మన్నించి బాస చేసె
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఏమి కత యిది మరదలా ?ఎచటనుండి
రిప్లయితొలగించండిఎత్తుకొచ్చితి? మోపున న్నెత్త మనుచు
మోపుకాదహే నిన్ను నీ కైపు సొగసు
మెత్తగా నెత్త గలనె నీ పొత్తు కుదర
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం సరసంగా ఉండి అలరించింది. అభినందనలు.
మోపు నెత్తఁ బోయి మోకాళ్లు సోకంగ!
రిప్లయితొలగించండిచూపుఁ జూపు చిలుక సుధలుఁ బొంగ!
భావ సైగ లోని భావాలు గుచ్చంగ!
కుర్ర దాని బుగ్గ లెర్ర బారె!
బావ,మరదలసంభాషణ
రిప్లయితొలగించండిఎత్తకుగడ్డిమోపు|సుతిమెత్తనిచూపులుమోయలేను|"నీ
సత్తువలేదదేల?"మనసందునచిత్తముతక్కువాయెగా|
"క్రొత్తగజెప్పుటెందులకు?"కోర్కెలతీర్పులునెంచశఖ్యమా?
మత్తుగనుందువేల?"ననుమానపుతూకముబెంచినందుకే"|
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మోపు నెత్తగ లేనింక పోరమగడ
రిప్లయితొలగించండికాయ కష్టము వద్దంచు కస్సు మనియె
ఓర చూపుల పెండ్లాము నూర బెట్టి
మోతు వయ్యారి నినుగూడి మోపు ననియె .
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన మూడవ పాదం తో పద్యం :
రిప్లయితొలగించండిమోపు నెత్తఁ బోయి మోకాళ్లు సోకంగ!
చూపుఁ జూపు చిలుక సుధలుఁ బొంగ!
బావ సైగ లోని భావాలు గుచ్చంగ!
కుర్ర దాని బుగ్గ లెర్ర బారె!
నెత్తిన మోపును బెట్టుచు
రిప్లయితొలగించండిముత్తెమువలెనున్న పిల్ల ముద్దుల మోమున్
చిత్తరువై గనుచు నతడు
బిత్తరి చూపులు తెలిపిన ప్రేమకు మురిసెన్!!!
నడుమిక నొచ్చును మావోయ్
రిప్లయితొలగించండివడివడిగా మోపునెత్తి-వాటము జూపన్
తడబడనిక నీతోడుగ
విడిబడకనె మోతునుగద-వినవోయ్ మావా!
పిరాట్ల ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
సహదేవుడు గారూ,
ఈమధ్య మిత్రులు టైప్ దోషాలు ఎక్కువగా చేస్తున్నారు. ప్రచురించేముందు ఒకసారి సరిచూసుకోవలసిందిగా ఎన్నోసార్లు సామూహికంగా, వ్యక్తిగతంగా చెప్పాను కూడా. కాని మార్పు లేదు. అందుకని నేను టైపాట్లను ఎక్కువగా పట్టించుకోవడం లేదు.
సవరించిన పద్యం బాగున్నది. సంతోషం.
****
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
****
సుసర్ల నాగజ్యోతి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం!
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మావోయ్’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. గ్రామీణుల విషయం కనుక పాత్రోచిత భాషను ప్రయోగించడం తప్పు కాదనుకోండి. అయినా అక్కడ ‘మామా’ అంటే సరిపోతుంది కదా!
మోపెత్తు మనెడు కోమలి
రిప్లయితొలగించండిచూపులలో చిక్కుకొనుటచోద్యంబెట్లౌ
బాపూ కుంచెకు పూసిన
కాపూ ప్రేమికుల తీరు కమనీయంబౌ !!!
ఇక్కడ పద్యం ఎడిట్ చెయ్యటమెలాగో తెలీటము లేదు శంకరయ్యగారూ
రిప్లయితొలగించండిమంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిఎన్నాళ్ళ కెన్నాళ్ళకు! చాలా సంతోషం.. నిజానికి ఈరోజు ఉదయమే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కాపూ’ అనడమే కాస్త ఇబ్బందిగా ఉంది. ‘కాపుల ప్రేమికుల...’ అనవచ్చుకదా!
****
సుసర్ల నాగజ్యోతి గారూ,
ఒకసారి ప్రచురించాక ఇక సవరించడానికి అవకాశం లేదు. బ్లాగు నిర్వాహకుడనైన నాకు కూడా! సవరణలుంటే మళ్ళీ టైప్ చేసి క్రొత్తగా పోస్ట్ చెయ్యడమే!
పైన గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ టైపు దోషాలతో ముందు పోస్ట్ చేసి, ఆ దోషాలను సవరించుకొని ‘సవరించిన పద్యం’అంటూ మళ్ళీ పోస్ట్ చేశారు. గమనించండి.
నాగజ్యోతి గారూ,
రిప్లయితొలగించండిదోషాలేమైనా ఉంటే మొదటి పద్యాన్ని పూర్తిగా తొలగించే అవకాశం మాత్రం ఉంది. ఆ పద్యం క్రింద తేదీ, సమయం ప్రక్కన చెత్తడబ్బా బొమ్మ కనిపిస్తున్నది కదా! దాన్ని క్లిక్ చేసి సూచనలను పాటిస్తే సరి!