నేల నీ రగ్గియు గాలి యాకాశమ్ము ......నిండి వెల్గొందెడు నీలగళము! మూడు లోకమ్ములు మూడు గుణమ్ములు ......తానెయై యొప్పెడు తత్త్వపరము! జంగమ స్థావర సర్వ ప్రపంచంపు ......భూతాధినాధమౌ భూతగణము! యక్ష కిన్నర సుర రాక్షస మానవ ......పశుపక్షి ప్రభృతమౌ ప్రాణయుతము!
గురువర్యులు కంది శంకరయ్య గారు అన్నిపద్యములను పరిశీలించి వారి అభిప్రాయాన్ని నాద్వారా పంపించారు. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణ బాగున్నది. అభినందనలు. పోచిరాజు సుబ్బారావు గారూ, మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. కె. ఈశ్వరప్ప గారూ మీ పూరణ బాగున్నది. అభినందనలు. మిస్సన్న గారూ అద్భుతమైన పూరణ చేశారు. అభినందనలు.
శ్రీ మ హావిష్ణు వచ్చట శీ ఘ్రముగను
రిప్లయితొలగించండిదనదు రూపాలు జూపించి తన్మయు లను
జేసె మమ్ముల నెంతయో చిత్ర మందు
వంద నంబులు శ్రీ కృష్ణ ! వంద లాది
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది... కానీ అది శివుని విశ్వరూపం!
విశ్వేశుని రూపంబిది
రిప్లయితొలగించండివిశ్వము తానిండియుండె విశ్వము తానై
విశ్వాలింగన లింగడు
విశ్వాసము జూప జయము విశ్వంభరలో.
విశ్వ రూపమ్ము శంభుని వీ క్ష జేయ
రిప్లయితొలగించండిసరగు బులకించె నొ డలంత సంతసమున
నాది దేవున కర్పింతు నహరహమ్ము
వంద నంబుల శతమును వరుస గాను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశివుడన?లోకేశ్వరుడే|
రిప్లయితొలగించండిదివి,భువికదలికలనిడుచు|దిశ,దశమార్చే|
అవతారంబులుజూడగ?
కవులకువర్ణించతరమ?కలియుగమందున్|
నేల నీ రగ్గియు గాలి యాకాశమ్ము
రిప్లయితొలగించండి......నిండి వెల్గొందెడు నీలగళము!
మూడు లోకమ్ములు మూడు గుణమ్ములు
......తానెయై యొప్పెడు తత్త్వపరము!
జంగమ స్థావర సర్వ ప్రపంచంపు
......భూతాధినాధమౌ భూతగణము!
యక్ష కిన్నర సుర రాక్షస మానవ
......పశుపక్షి ప్రభృతమౌ ప్రాణయుతము!
సృష్టిపోషణలయముల చిత్తవృత్తి!
నిర్వికల్ప నిరాకార నిర్వికార
నిత్యశుద్ధ నిరంజన నిర్మలమ్ము!
విశ్వవిభు విశ్వరూపము విశ్వమయము!
శివుడొకవిశ్వరూపుడనిజేర్చినచిత్రముజూపుచుండె?యే
రిప్లయితొలగించండికవులకువర్ణనాంశమిడ?కల్పనశక్యమెనేరికైన?మా
ధవుడిగ,బ్రహ్మదేవుడిగ,దాతలు,నేతలునీశ్వరాజ్ఞచే
దివిభువినుండిరందరును|దీనశరణ్యునినాజ్ఞమేరకే|
గురువర్యులు కంది శంకరయ్య గారు అన్నిపద్యములను పరిశీలించి వారి అభిప్రాయాన్ని నాద్వారా పంపించారు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిస్సన్న గారూ
అద్భుతమైన పూరణ చేశారు. అభినందనలు.