6, జనవరి 2015, మంగళవారం

దత్తపది - 62 (రామ-భరత-లక్ష్మణ-శత్రుఘ్న)

కవిమిత్రులారా!
రామ - భరత - లక్ష్మణ - శత్రుఘ్న
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

31 కామెంట్‌లు:

  1. రామ భక్తులై పాండవు ల్రాత్రి పగలు
    భరతు వోలెను బెదతండ్రి పాదములకు
    వంద నంబులు సేయుచు బ్రమద మలర
    లక్ష్మణుం డును శత్రుఘ్ను సాక్షి గాను
    నన్న దమ్ముల ప్రేమకు వన్నె దెచ్చె

    రిప్లయితొలగించండి
  2. దుర్యోధనుఁడు తన పుత్రుఁడైన లక్ష్మణకుమారుని గ్రురించి గురువైన బలరామునకు చెప్పుచున్నాడు.....

    బలరామ! నా కుమారుం
    డల భరతాన్వయమణి, వినయాధికుఁడై పె
    ద్దలు మెచ్చెడి లక్ష్మణుఁ డ
    వ్వల శత్రుఘ్నాగ్రజుఁడు గృపన్ దీవించెన్.
    (శత్రుఘ్నాగ్రజుఁడు = శత్రుఘ్నుఁడు అనువాని యన్న, అక్రూరుఁడు)

    రిప్లయితొలగించండి
  3. కురుసభలో ద్రౌపది కృష్ణుని ప్రార్థంచుట...

    కృష్ణ! సుగుణాభిరామ! యీ కితవమందు
    భరతకులమానమే చూడ పతనమాయె
    నార్తరక్షణలక్ష్మణా! యాదుకొనుము,
    పతులు శత్రుఘ్నులై కూడ పలుకరైరి.

    (కితవము=జూదము; లక్ష్మణా=పేరుగలవాఁడా, శత్రుఘ్నులు=శత్రువులఁ జంపువారు)

    రిప్లయితొలగించండి
  4. దత్తపది ని ఎట్ల పూరించాల్నో అంత బాగా పూరించి చూపినారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీమతి లక్ష్మీదేవి గారూ , రెండవ ద్విపద మొదటి పాదంలో ' శత్రుఘ్న ' పదమూ, తత్సంబంధి గణము సరి చూసుకోగలరు ...

    రిప్లయితొలగించండి
  6. గురువుగారూ చాలా రోజులకు మీ నుంచు అద్భుతమైన పద్యాలను చూశాం.

    రిప్లయితొలగించండి
  7. కృష్ణుఁడు సుభద్రతో ....

    ఆరామమున నున్న యతి యెవ్వరనిన
    భరత వంశీకుడు పార్థుఁడు విజయ
    లక్ష్మణమున్నట్టి రాకుమారుండు
    శత్రుఘ్నబిరుదున సరిపోలువాడు.

    మంజరీ ద్విపద.
    లక్ష్మణము =ఆహ్వ, సంకేతము

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మణములనుగనిరేడు రామకప్డు
    భరత నాట్యము బొధించ పంచె నరుని
    దాగె శత్రుఘ్నులైన పృథా కొమరులు
    విదురు కొలువున వివిధమౌ విధులలోన

    రిప్లయితొలగించండి


  9. ఆరామ,శకుంతల,నఘ
    దూరుడు,శత్రుఘ్నుడైన దుష్యంతుడు,స్వీ
    కారము తో లక్ష్మణ యుతు
    డౌ రాగుని భరత జననమాయెను వాసిన్

    రిప్లయితొలగించండి
  10. ప్రణామములు గురువుగారు..మనోజ్ఞంగా రెండు పద్యాలు పూరించి మాకందించారు..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి

  11. శత్రుఘ్నంబగు కీర్తి గల్గియును కృష్ణా! నా పతుల్ శక్తి యే
    మాత్రంబున్ సరిపోక ధర్మరతి రామన్ గావ నిర్లిప్తులే,
    ఓ త్రాతా! భరతాంగనన్ కనగదే యో శ్రీహరీ! మాధవా!
    చిత్రంబౌనె త్వదీయ సోదరి వెతల్ శ్రీలక్ష్మణా! బ్రోవవే.



    రిప్లయితొలగించండి
  12. మల్లెలవారి పూరణలు
    ఏకచక్ర పురమునను నేర్పడంగ
    పాండుపుత్రులు లక్ష్మణ వర్తులవక
    విప్రులౌచును శత్రుఘ్న పేర్మి నంది
    రామణీయత భరతులు రంజిలిరట
    2.రామ పా0చాలికే కీడు రాజరాజు
    సలుప లక్ష్మణ గాగను జడను వదల
    నామె,శత్రుఘ్న భీముడు అనిని వెసను
    జంపె దుస్ససేను భరత సమర మందు
    3.విరటు సూనుడు పాండవ వీరులుండ
    గోవులన్నిటి కోల్పోయి గొప్ప భీరు
    లక్ష్మణుండటు బీరాలు రామలకనె
    భరత సేనకు శత్రుఘ్న బలుడ ననుచు
    4.హనుమ లక్ష్మణ కేతను డర్జునుండు
    భరత యుధ్ధాన శత్రుఘ్న బలము తోడ
    రామబాణమ్ము నట్టుల రమ్యమైన
    గా౦డివమ్మును బట్టెను ఘనుడు నౌచు

    రిప్లయితొలగించండి
  13. శత్రుఘ్నుడొక శతఘ్నిలా అడ్డుపడ్డాడు. దేవశ్రవసుని పెద్ద కొడుకుని ఎలా ఉపయోగించాలా అని తలబట్టుకుకూర్చుంటే, గురువుగారు అద్భుతమైన పద్యములతో మార్గదర్శి అయ్యారు.గురువుగారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. అవును సత్యనారాయణ రెడ్డిగారూ! గురువుగారు ఎప్పుడూ మార్గదర్శులే.

    రిప్లయితొలగించండి
  15. నేను ముందు అత్యుత్సాహంతో ఉత్పలమాల మొదలుబెట్టి 3 పాదాలు వ్రాశాక శతఘ్ని అడ్డు తగిలింది. అక్కడితో దాన్ని ఆపేసి మళ్ళా మత్తేభంతో శతఘ్నిని ప్రక్కకు తప్పించా గలిగాను.

    రిప్లయితొలగించండి
  16. శంకరు డెదురుగ రాగా
    కొంకక తానడుగ సాగె కోహమ్? కస్త్వమ్?
    శంకర బదులియ్య వయా
    బొంకక అద్వైత సుధను బోధింప గదే!


    ఇలపావులూరి శేష శ్రీధర్ - అద్దంకి

    రిప్లయితొలగించండి
  17. గురువుగారికి వందనములు. మీపద్యాన్ని చదివే భాగ్యాన్నందించారు. చాలా సంతోషమండీ.

    దుర్యోధనుడి సుతుడైన లక్ష్మణుడు తనయొక్క ప్రతాపాన్ని తన అనుచరులతో అంటునట్లుగా ఒక ఊహ.

    ఔరా! మత్తగజంబు మాడ్కి రణమందత్యంత దర్పోద్ధతిన్
    శూరత్వంబును జూపి వైరితత రాజుల్ పాలి శత్రుఘ్నుఁడై
    వీరత్వంబెసఁగంగనిబ్భరత యుర్విన్ నూత్నతేజంబుతో
    శ్రీరంజిల్లఁగ వెల్గు చూడుమిదె నిశ్చింతన్ లక్ష్మణుండెంతయున్.

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    భరతలక్ష్మణ శత్రుఘ్ను లరయ రామ
    సేవజేయుట౦ దేమి విశేష ముండె
    అన్న కంటె శౌర్యమున తామధికు లయ్యు
    ధర్మరాజాజ్ఞ ననుజులు దాటలేదు
    సర్వశత్రుఘ్నబలయుత సాహసికులు
    చంద్ర కులజాత సుగుణ లక్షణులు వారు

    రిప్లయితొలగించండి
  20. గుండు మధుసూదన్ గారి పూరణలు....

    (దుర్యోధనుని ఘోషయాత్ర....)
    1.
    ఆరామగతులుఁ బాండుకు
    మారులునౌ భరతకులుల మానము డుల్పన్
    జేరెను లక్ష్మణ యుతుఁడై
    రారాట్ శత్రుఘ్నునంచు రంజిలుచు వెసన్!
    2.
    ఏ విరామ మెఱుంగని హీన యోచ
    నాస్థ లోభరతుఁడు కౌరవాగ్రజుండు
    లక్ష్మణునిఁ గన్నతండ్రి దుర్లక్షణుండు
    విఘ్నమిడఁగా వనిఁ జనె శత్రుఘ్నులకును!
    (శత్రుఘ్నులు=పాండవులు)

    రిప్లయితొలగించండి
  21. స్వయంవరములో ద్రౌపదితో కృష్ణుడు..

    భరత వంశపు వీరుడు పార్ధుడతడె
    సకల లక్ష్మణములుగల సవ్యసాచి
    పవర మందున శత్రుఘ్న బలుడితండు
    రామ! పాంచాలి జూడుమ రాజు సుతుని !!!

    రిప్లయితొలగించండి
  22. రావె గావగ లోకాభి రామ కృష్ణ!
    భరత వంశపు ఖ్యాతియే భ్రష్టు పట్టె
    పాండు సుతులు శత్రుఘ్నులై బండబాఱె
    మాన రక్షక లక్ష్మణా మహిమ జూపు!!!

    రిప్లయితొలగించండి
  23. రామశోభ-రతనములరాశిగాక?
    పార్థుమదిలోన-ద్రోపదిభాగ్యనిధియె|
    లక్ష్మణాన్తర్యమెరిగినలౌఖ్యమట్లు
    మత్చ్యయంత్రాన్నిశత్రుఘ్నుమలుపునందు
    గొట్టిగెలిచెనుసభయందుపట్టుదలచె
    అర్జునుందూహనిజమైన?హరినిదలచె|

    రిప్లయితొలగించండి
  24. ఈనాటి సమస్యకు నా పూరణలను మెచ్చుకొని ప్రశంసించిన మిత్రులు....
    లక్ష్మీదేవి గారికి,
    మిస్సన్న గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    శైలజ గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి
    ధన్యవాదాలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘లక్ష్మణములను గని’ అనడంలో మీ భావాన్ని తెలియజేయండి.‘విరటు కొలువున’ అనడానికి బదులు ‘విదురు కొలువున’ అన్నట్టున్నారు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మిస్సన్న గారూ,
    శార్దూలంలో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నిబ్బరత’ను ‘నిబ్భరత’ అన్నారు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    టైపాట్లు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త పడండి.

    రిప్లయితొలగించండి
  25. మాస్టరు గారూ ! చాలా రోజుల తర్వాత మీ పూరణలు చూసే భాగ్యము కలిగినది.
    రామ సోదరులను రమణీయముగా భారతము దరికి చేర్చారు.
    మిత్రులందరు చక్కని పూరణలు చేశారు..అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. 1. లక్ష్మణముః లక్షణముః a predicate, any thing by which an object is designated, or distinguished, దర్శనము, చూపు(పైఅర్థములను బట్టి బృహన్నల స్వరూపమును బట్టి నృత్యము నేర్పమని విరటుడు కోరాడు అనినా ఉద్దేశ్యము.
    2. విరటు విదురుగా టైపు అయ్యింది

    రిప్లయితొలగించండి
  27. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ వివరణ సంతృప్తికరంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి