21, జనవరి 2015, బుధవారం

పద్యరచన - 797

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

 1. చిత్ర మందున జూడుడు చిత్రముగను
  రామ చంద్రాదు లచ్చట రమ్య మలర
  త్యాగ రాజున కిచ్చిరి దర్శ నమ్ము
  దైవ తుల్యుడే గదమఱి త్యాగ రాజు

  రిప్లయితొలగించండి
 2. బంటు రీతి కొలువు పరమాత్మ శ్రీరామ
  నాకు నీయ మన్న నయము గాను
  బంటు తోడ నిలచె పట్టాభి రాముడు
  త్యాగ రాజు భాగ్య మాహ! ఘనము.

  రిప్లయితొలగించండి
 3. రామ సోదరుల్ మారుతి రమణి సీత
  త్యాగ రాజు గానము విని తన్వయముగ
  దర్శనము నొసంగిరి తాను తలచగానె
  దైవములఁ గన్నత్యాగయ్య ధన్యుడయ్యె

  రిప్లయితొలగించండి
 4. ఎవ్వారి కీర్తనల్ నింపుగా పాడ గా
  .......యకుల కంఠములు ధన్యతగడించు
  ఎవ్వారి చరితంబు నించుక రచియించ
  .......కవులకలమ్ములు కలలు గనును
  ఎవ్వారి నామమ్ము కించిత్తు దలచినా
  .........తల్లి భారతి మదిన్ వెల్లివిరియు
  ఎవ్వారి గానమ్ము రవ్వంత వినిపింప
  ........శ్రీరామచంద్రుండు జేరి వినును


  అట్టి త్యాగయ్య కీర్తన మాలపింప
  రామచంద్రుడు సతితోడ రమ్యముగను
  తమ్ములనుగూడి వినవచ్చె తన్మయముగ
  ధన్యుడయ్యెను భక్తుడు త్యాగరాజు !!!  రిప్లయితొలగించండి
 5. రాగమె ప్రాణమై నిలిపి రామునికై తన సేవ జేసి యా
  త్యాగమె యోగమై నిలిపి ధారుణికిచ్చెను గానరాశులన్
  భోగములన్నియున్ విడచి పూర్ణత పొందెను మోక్షసిద్దియై
  వేగమే పొంది నాడుగద వేడుకతో పరి పూర్ణ తత్వమున్


  ఇలపావులూరి శేష శ్రీధర్. అద్దంకి

  రిప్లయితొలగించండి
 6. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘నా కొసంగు మన్న’ అంటే బాగుంటుందేమో?
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మనోహరమైన పద్యాన్ని రచించారు. బాగున్నది. అభినందనలు.
  ‘ఏవ్వాని వాకిట నిభమదపంకంబు రాజభూషణరజోరాజి నడరు’ అన్న తిక్కన పద్యాన్ని గుర్తుకు తెచ్చారు.

  రిప్లయితొలగించండి
 7. ఇలపావులూరి శేష శ్రీధర్ గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  చక్కని పద్యంతో బ్లాగులో అడుగుపెట్టారు. సంతోషం! అభినందనలు.
  క్రమంతప్పకుండా వ్రాస్తూనే ఉండండి.

  రిప్లయితొలగించండి
 8. ఆగకపంచరత్నముల|నార్థనినాదమునందజేయ?నా
  త్యాగయె|రామదాసు|పరితాపముజుసియురామ,లక్ష్మణుల్
  వేగమెసీతచేరగనె?వేల్పులగాంచియుభక్తియందునే
  ఆగకరామనామజపమందునదేలెను|మంత్రముగ్దుడై|

  రిప్లయితొలగించండి

 9. పద్యరచన త్యాగరాజు వారి కృతి "సీతమ్మ మాయమ్మ"
  ఆధారముగా
  పద్యము:ఉత్సాహ
  అమ్మమాకు సీత రాము డప్పలక్ష్మణాదులున్
  తమ్ములై చెలంగ పాదదాసుడై కపీశుడున్
  అమ్మునీ౦ద్రు లైన నారదాదు లెల్ల బాంధవుల్
  రమ్ము బ్రోవు మంచు త్యాగ రాజు సంస్తుతించె గా

  రిప్లయితొలగించండి
 10. రామలక్ష్మణ సీతనేరుగరాకజూసిన?త్యాగయే
  స్వామిపాదముబట్టనెంచెడిసాత్వికాకృతులెన్నియో
  రామనామపదాలుజేర్చియు|రాగమందునపాడగా?
  భూమిపుట్టుకసార్థకంబనిపూర్తినమ్మెను"రాజుగా"|

  రిప్లయితొలగించండి
 11. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ ఉత్పలమాల బాగున్నది. అభినందనలు.
  ‘ఆర్ధనినాదములు’? అది ‘ఆర్తనినాదములు/ ఆర్ద్రనినాదము’ లకు టైపాటా?
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  ఉత్సాహంగా మీరు వ్రాసిన పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ మత్తకోకిల బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. శ్రీమతి శైలజ గారూ మీ సీస పద్యము చాలా బాగుంది .ఒకటవ పాదమును ఎవ్వారి కీర్తన లింపుగా పాడ అనీ, మూడవ పాదమును- యతి ప్రతిపాదనార్థమై - ఎవ్వారి నామమ్ము నిసుమంత దలఁచిన అని మారిస్తే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 13. గురుతుల్యులు డా.విష్ణునందన్ గారి సూచనకు ధన్యవాదములు...

  రిప్లయితొలగించండి
 14. ఎదలో మెదిలేటి ప్రభువు
  యెదుటే సాక్షాత్కరింప నే నిథు లేలన్?
  ముదమని రాముని సన్నిథి
  పదముల త్యాగయ్య పలికె పరవశ మందన్!

  రిప్లయితొలగించండి
 15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘మెదిలేటి’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘ఎదలోన మెదలెడి ప్రభువు’ అనండి.

  రిప్లయితొలగించండి
 16. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
  ఎదలో మెదిలెడు ప్రభువే
  యెదుటే సాక్షాత్కరింప నే నిథు లేలన్?
  ముదమని రాముని సన్నిథి
  పదముల త్యాగయ్య పాడె పరవశ మందన్!

  రిప్లయితొలగించండి
 17. గురువుగారూ మీ సూచనకు ధన్యవాదములు.

  శైలజ గారి సీసము చాల బాగుంది.

  రిప్లయితొలగించండి