17, జనవరి 2015, శనివారం

సమస్యా పూరణం - 1582 (గానసుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గానసుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే

28 కామెంట్‌లు:

 1. వీనులవిందగు పాటల
  తానేలాగైన వినగ దలచుచు కొని తా
  నానాడే చెవిటి మిషను
  గానసుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే

  రిప్లయితొలగించండి
 2. ఆనతి నీయగ నిటులను
  గాన సుధారసము గ్రోలెగద బధిరుండే
  వీనుల వినదగు గానము
  వీనులు బనిచేయ నపుడు వినదగు నగునే ?

  రిప్లయితొలగించండి
 3. ఒక యోగి లోపలి నాదాన్ని వింటూ... అవును అతను "చెవిటి వాడే"!

  నానము ధరించియు సుఖా
  సీనుడగుచు వెలుపలి రొద చెవి బెట్టకయే
  ధ్యానము సేయుచును ప్రణవ
  గానసుధారసముఁ గ్రోలెఁ గద! "బధిరుండే"!

  రిప్లయితొలగించండి
 4. మానస మందున ప్రీతిగ
  గానసుధా రసముఁ గ్రోలెఁ గద బధిరుండే
  నీనిజ రూపము గాంచుచు
  తానా పదములను పాడి తన్మయ మొందన్

  రిప్లయితొలగించండి
 5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  చెవిటి మిషనుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వినదగు నగునే’ అన్నదాన్ని ‘వినగా నగునే’ అనండి.
  ****
  మాజేటి సుమలత గారూ,
  బహుకాల దర్శనం... సంతోషం!
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. ధ్యానము జేయుచు గుడిలో
  మౌనముగా వేడుకొనెను మదిలో రామున్
  పానకమీయగ త్రాగెను
  గాన, సుధారసము గ్రోలె గద బధిరుండే !!!

  రిప్లయితొలగించండి
 7. నానో యుగమున నేడు వి
  జ్ఞానమ్మునకవధిలెవ్వి జగమున జూడన్
  దానము పొందగ యంత్రము
  గానసుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే

  రిప్లయితొలగించండి
 8. శైలజ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘విజ్ఞానము’ అన్నప్పుడు ‘వి’ గురువై గణదోషం. ‘నానోయుగమ్మిదే వి|జ్ఞానమ్ము...’ అనండి.

  రిప్లయితొలగించండి
 9. వీనుల వినికిడి తగ్గగ
  తానే యొక మూలికొకటి దంచుచు పిండెన్
  తేనెను గలిపిన తగ్గును
  గాన, సుధా ! రసముఁ గ్రోలెఁ గద బధిరుండే.

  రిప్లయితొలగించండి
 10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. వీనులు పనిచేయవనుచు
  దీనునిగ తలంచ జనులు, ధీరత తోనో
  మానిని వరించ, ప్రేమ జ
  గాన సుధారసముగ్రోలె గద బధిరుండే!

  రిప్లయితొలగించండి
 12. జ్ఞానపు సింధువు కృపతో
  ధ్యానముఁ జేయు సమయమునఁ దాదాత్మ్యముతో
  మానసమున హరి రూపునుఁ
  గానసుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే.

  రిప్లయితొలగించండి
 13. వీనికి జెవుడని జనులున్
  నానా విధముగ నగవుల నరకము జూపన్
  చీనా వెజ్జుని మందుకు
  గానసుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే

  రిప్లయితొలగించండి
 14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  ప్రేమజగాన అన్న విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  బహుకాల దర్శనం. సంతోషం!
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. సుమలత గారి పూరణ చాలా బాగుంది.
  హనుమచ్ఛాస్త్రి గారి పూరణ అద్భుతంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 16. పానము చేయుట కై యీ
  వీనులతో పని యేటికి?వేడ్కను త్రాగన్
  ఆనన మొక్కటి చాలును
  గాన;సుధారసము గ్రోలె గద బధిరుండే

  2.దీనుల మొర లాలించును
  హీనుల కరుణించు తిరుమలేశుడు శైల
  మ్మైనా కీర్తనలోగల
  గానసుధారసము గ్రోలె గద బధిరుండే

  రిప్లయితొలగించండి
 17. మల్లెల వారి పూరణలు
  దీనులు బొగడగ కృష్ణుడు
  గానసుధారసము గ్రోలె గద బధిరుండే
  వీనుల బడయును,అంధుడు
  గానగ కన్నుల బడయును కన్నయ దయచే

  2.వీనుల విన లేడి౦పున
  గానము నైనను పెదవులు కదిపెడి రీతిన్
  వానికి తెలియును గీతము
  గానసుధారసము గ్రోలె గద బదిరుండే

  రిప్లయితొలగించండి
 18. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణలు
  కాన గలిగె నంధుడు స౦
  తానము కన గలిగె వంధ్య ధరణి పయిని వి
  జ్ఞాన మధిక మయె గానన్
  గానసుధారసము గ్రోలె గద బదిరుండే


  2,వీనులిపుడువినిపించవు
  గానీ యానాడు వినిన కమనీయంబౌ
  గానములు మదిన్ మ్రోగగ
  గానసుధారసము గ్రోలె గద బధిరుండే

  రిప్లయితొలగించండి
 19. అన్నపురెడ్డివారి పూరణ అలరించింది.

  రిప్లయితొలగించండి
 20. ఏనాడును విని యెరుగము
  గాన సుధారసము గ్రోలెగద బధిరుం డే
  జ్ఞానమహిమమో! లేకను
  మానవ శ్రుత సాధనపు సుమహిమౌనేమో!

  రిప్లయితొలగించండి
 21. ఈనాటి -వైధ్యశాస్త్రుడు
  దీనుడుకడుదిక్కులేకతిరుగుటజూసే|
  వానికిచెవిలోమిషినిడ?
  గానసుధారసముగ్రోలెగడ-బదిరుండే

  రిప్లయితొలగించండి
 22. కం. వీనుల కందక పోయిన
  రానీయుడునా కుసినిమ లాభించనుచున్
  తానా సబుటై టిలుతో
  గానసుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే.

  రిప్లయితొలగించండి
 23. అందరి పూరణలూ అలరించాయి.

  మానిని మూగని దెలుపక
  'వానికిఁ' బెళ్లాడఁ జూపఁ బాడగఁ గోరన్
  నా..నన్నా యను గమకపు
  గాన సుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే!
  (చెవిటికి మూగను కట్ట బెట్టే ప్రయత్నం! )

  రిప్లయితొలగించండి
 24. మిస్సన్న గారూ,
  ధన్యవాదాలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చూసే’ అన్నదానిని ‘కనియున్’ అనండి.
  ****
  పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 25. ధన్యవాదములు శంకరయ్య మాష్టారు, మిస్సన్న గారు.
  శంకరయ్య మాష్టారు : భవ సాగరాన్ని ఈదుతూ మధ్యలో వున్నానండి ;-)

  రిప్లయితొలగించండి
 26. "మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిమ్"

  జ్ఞానార్జనమ్ము కోరుచు
  ధ్యానము జేయుచు సతతము ధన్యాత్ముండై
  పానము జేయుచు గీతా
  గానసుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే

  రిప్లయితొలగించండి
 27. గానపు సభనున్ జొచ్చుచు
  పానును నమలుచును తీసి పాకెటునున్నన్
  వీనుల మిషనును దోపుచు
  గానసుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే

  రిప్లయితొలగించండి