బ్లాగు కవులను గోరుదు భవ్యు లార !సెల్లు నంబర్లు మీ యవి చెలువు గానునీయ వలయును నిచ్చిన నెపుడు నైనమాటలాడుట వీలగు మంచి మాటమఱియు దీ ర్చుకొం దునునను మానములను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
హింసయె వద్దని జనులక హింసను బోధించె గాంధి యేశ్రమకైనన్ సంసిద్ధుండై మతవి ధ్వంసమ్ములనాపనెంచి తనుబలియయ్యెన్ 9292204129
జాతిపితగనుబేరొంది జగమునందు సత్యము మఱియు నాయహింసా పథమ్ము నెఱపి యాంగ్లరాజులమఱి తఱిమి కొట్టి తెచ్చె రాజ్యము మనకు గా దెగువతోడ అంగ వస్రము ధరియించి యచట యుండి వడకు చుండెను దారము బాపు మిగుల శ్రద్ధ తోడన గనుడా ర్య ! చక్ర మునట ద్రిప్పు చుండగ గిరగిర దిరుగు చుండె
నూలు వడికేను గాంధీ 'కెమిస్ట్రీ'లు కోరేను మోదీ ఆతనిది నవ్య సత్యాగ్రహం ఈతనిది భవ్య అభ్యుదయాగ్రహం !!శుభోదయంజిలేబి
కాంచుచు పనిలో దేవుని గాంధి తాతసతముజీవితమ్ము గడిపె సంతసముగతానహింస సిద్ధాంతమున్ తనివి తోడనాచరించి జగతిన నారాధ్యు డయ్యె
అయ్యా, గడచిన దినములలో నెట్ సమస్య వల్ల వ్రాయలేకపోయిన పద్యములివ్వి. దయతో తప్పుయొప్పులనుఁ దెలుప మనవి.పద్యరచన 797అన్నదమ్ములతోడ వచ్చెనె యాలకింపగ కీర్తనల్మన్నియించెను త్యాగరాయని, మక్కువైనవటంచనెన్కన్నులందున కొల్వుదీరిన కల్పవృక్షమునార్తిగాకన్న భాగ్యము కన్న వేరగు కల్ములేవని తోచగా.సమస్యా పూరణం - 1584 (దుర్మార్గుని కర్మకు ఫలితము రూపునమర్మపు పాపములు పున్నెమంటుచునుండున్ధర్మమె యిట్టుల పలుకుట?-దుర్మార్గుని పొత్తువలనఁ దొలఁగు నఘమ్ముల్.పద్యరచన - 798జయముల్ కల్గునటంచు బల్కి కవితాసౌందర్యముప్పొంగగానయమున్ మెప్పునుఁ బొందు వారగుచు విన్నాణమున్ చూపుచున్లయపూర్ణంబుగ పాడిరో యెటుల నాలాపమ్ములన్ చేసిరోదయతో తెల్పరదెవ్వరున్, వినుచు నే తాదాత్మ్యమున్ చెందగా.న్యస్తాక్షరి - 23భారతమ్మున గొప్పదై పారుచుండునదిని గీర్వాణ జగతిని నడచునంద్రు. నాడు నా భగీరథుడిల నడువజేసెనంద్రు నట్టి యత్నమునకు నచ్చెరువగు.సమస్యా పూరణం - 1585 (గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్త...ఇలలోనెల్ల ప్రకృతినిన్పలువిధములుగా కొలిచెడు భారతవాసుల్చలిమిడుల తో సలుపు నాగుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్.దత్తపది - 65 (కక-గగ-తత-నన)సురపుత్రుండొక కర్ణుఁడుతరియించగ గడిపె దాన తత్పరతఁ; సదానెరనంటియున్న కవచమువెరువక నొసగి కననరిగె వీరపు చదలున్. పద్యరచన - 801నగలును దేహాంగములనునొగలునుఁ జూడ్కులను భక్తి నొప్పారంగాగగనముఁ దాకగఁ జెక్కిరిసొగసుగ నందిని! భళిభళి !సుందరమయ్యా!సమస్యా పూరణం - 1586 (చావు వార్త తెచ్చె సంబరమ్ము)జనుల బాధవెట్టి చంపుచునుండెడురక్కసుండు జచ్చె రణమునందుప్రజలకెల్ల నాఁడె పర్వమయ్యెను, వానిచావువార్త తెచ్చె సంబరమ్ము.పద్యరచన - 802మగవారలతోపాటుగమగువలు సైనికులలో తమదు పాటవమున్తగురీతిగఁ జూపించిరి, నగరములో తమదు ప్రతిభ నలుగురు మెచ్చన్.నిషిద్ధాక్షరి - 30అశ్వములఁ గూర్చి నడుపగ నరుణుడిట్లుకాల చక్రముఁ నడిపెనా గగనవిభుఁడు,చిక్కుడాకుల పల్లకి చేర్చి భువినిరవికి పూజలు జరుగును లక్షణముగ.పద్యరచన - 803రేకులు విచ్చు నందముల రేయి మరింతగ నందగించగా, చీఁకటి మాటుఁజేరె, శశి చిక్కటి వెల్గులఁ గ్రుమ్మరించగాప్రాకెనహో, నిలాతలముఁ బర్వె నెవో మధుభావవీచికల్నా కనుపాపలందు నది నర్మిలిఁ గొల్పెడు చిత్రమే యగున్.సమస్యా పూరణం - 1587 (కన్నులు గ్రుడ్డివే యయినఁ గానఁమిన్నగ నీశునిన్ మదిని మేల్మిఁ దలంచుచునున్నవారికిన్, దన్నుగ మోక్షమిచ్చునని తథ్యముఁ దెల్సిన భక్తవర్యుకున్, పన్నగభూషణున్ గొలుచు పట్టున మానస పూజలందునన్కన్నులు గ్రుడ్డివే యయినఁ గానఁగవచ్చు సమస్తవస్తువుల్.పద్యరచన - 804తాండవమాడుచున్న తఱి తాళము తప్పనితీరుగాంచ బ్రహ్మాండమునందునున్న నిఖిలంబున దేవతలెల్లవారులున్పండుగగా గనంగ నిట వచ్చిరొ ! విశ్వపు రూపుఁ జూచి నేదండముఁ జేతునయ్య ,నిను దాల్తు మనమ్మున నిశ్చలమ్ముగా.న్యస్తాక్షరి - 24పుక్కిటఁ బట్టినట్టివల పూర్వులు జెప్పిన గాథలన్నియున్చక్కగ నేర్చి మస్తకము శక్తియుతమ్ముగ వాడుచుండ్రి, నేఁడొక్కరు నైనఁ జేయరిటులుండరు, కబ్బములెల్ల వ్రాసినన్సొక్కునటంచు వ్రాయుదురు, సుందర గ్రంథములన్ ముదమ్ముతో.పద్యరచన - 805చకచక త్రాటిపై నడచు చక్కని శిక్షణ పొంది బాలలేతికమక లేక చేయుదురు; దేశయశస్సునుఁ బెంచు వీరినించుక గమనించువారెవరు? శుద్ధమనస్కులు శ్రద్ధ వెట్టుచోనిక మన దేశమున్ ప్రతిభకించుక నైన కొఱంత లేదహో!సమస్యా పూరణం - 1588 (దీపము పెట్టెనింట యువతీమణి భళ్...పాపలచక్కగా నిదుర పట్టున నుండగ జూసి యెప్పుడోయోపికతోడ వేకువనె యొప్పుగ ముగ్గుల వెట్టి, భక్ష్యముల్మోపుగఁ జేసి యెల్లరకు, మ్రొక్కులఁ దీర్చెడు దైవసన్నిధిన్, దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్!
ఖద్దరునూలుబట్టలన?గాంధిమహాత్మునికెంతయిష్టమోప్రొద్దుటరాట్నమున్నొడికిపోగుకుదారముపోగుజేసి|యేబద్దకమెంచకన్తగినబాధ్యతచేత-స్వదేశదుస్తులేముద్దనిబోధజేసితనమోజునుదెల్పెనుభారతాళికిన్|
చరఖా చక్రమునే సుదర్శనముగా సంధించి యాంగ్లేయ ముష్కర సంఘాత విభుత్వ గర్వమును వ్రక్కల్ చేసి స్వాతంత్ర్య సుస్థిర దీక్షామతియై చెలంగిన గుణశ్రీ మూర్తి బాపూజి సంస్మరియింతున్ సతతంబు భక్తి మెయి వాచా కర్మణా చేతసా !
భారతదేశ బడ్గులకు వల్వలు నిండుగ లేవు గాన నేధారణచేయ 'పంచొకటి తప్ప' శరీరముపైన దుస్తులన్దారుణమైన 'పూనికను' దాల్చిన గొప్ప దయాళు , త్యాగి మాభారత మాత గన్న జనవంద్యుడు రాట్నము ద్రిప్పు గాంధియే.
పద్యరచన:చరఖా త్రిప్పెడి గాంధిని బురఖాలో దాచి నేడు వోట్లను కొనగా సురపంచుచు ప్రజలకిపుడు ఎరపెట్టిరి నేతలు సభ కెన్నిక యవగన్ అమరుడయె గా౦ధి నాడుహత్య యొనర్చ జాతి పిత యని కొనియాడి చాటు కొనిరి చంపి వేసిరి యతని యాశయము లన్ని మద్యపాననిషేధమ్ము మతకలహము
ఖద్దరునే ధరియించెను వద్దనె హింసయు నసత్య వాదము మనకున్ రద్దనె పరాయి పాలనయిద్దినముననే గతించె నీ మన బాపూ.
చరఖా వడుకుచు గాంధియెచెరవిడిపించుచు జగతికి చేతన నిచ్చెన్భరతము యున్నంతవరకుమరువదుగా జాతి నిన్ను మాన్య మహాత్మా!!!
రాట్న మాయుధముగ రణము నడిపినాడుదండి లోన ఉప్పు వండినాడు కత్తి పట్ట కుండ కదముగెలిచినాడు గాంధి తాత చాల గడుసువాడు
బ్లాగు కవులను గోరుదు భవ్యు లార !
రిప్లయితొలగించండిసెల్లు నంబర్లు మీ యవి చెలువు గాను
నీయ వలయును నిచ్చిన నెపుడు నైన
మాటలాడుట వీలగు మంచి మాట
మఱియు దీ ర్చుకొం దునునను మానములను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహింసయె వద్దని జనులక
రిప్లయితొలగించండిహింసను బోధించె గాంధి యేశ్రమకైనన్
సంసిద్ధుండై మతవి
ధ్వంసమ్ములనాపనెంచి తనుబలియయ్యెన్
9292204129
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజాతిపితగనుబేరొంది జగమునందు
రిప్లయితొలగించండిసత్యము మఱియు నాయహింసా పథమ్ము
నెఱపి యాంగ్లరాజులమఱి తఱిమి కొట్టి
తెచ్చె రాజ్యము మనకు గా దెగువతోడ
అంగ వస్రము ధరియించి యచట యుండి
వడకు చుండెను దారము బాపు మిగుల
శ్రద్ధ తోడన గనుడా ర్య ! చక్ర మునట
ద్రిప్పు చుండగ గిరగిర దిరుగు చుండె
రిప్లయితొలగించండినూలు వడికేను గాంధీ
'కెమిస్ట్రీ'లు కోరేను మోదీ
ఆతనిది నవ్య సత్యాగ్రహం
ఈతనిది భవ్య అభ్యుదయాగ్రహం !!
శుభోదయం
జిలేబి
కాంచుచు పనిలో దేవుని గాంధి తాత
రిప్లయితొలగించండిసతముజీవితమ్ము గడిపె సంతసముగ
తానహింస సిద్ధాంతమున్ తనివి తోడ
నాచరించి జగతిన నారాధ్యు డయ్యె
అయ్యా, గడచిన దినములలో నెట్ సమస్య వల్ల వ్రాయలేకపోయిన పద్యములివ్వి.
రిప్లయితొలగించండిదయతో తప్పుయొప్పులనుఁ దెలుప మనవి.
పద్యరచన 797
అన్నదమ్ములతోడ వచ్చెనె యాలకింపగ కీర్తనల్
మన్నియించెను త్యాగరాయని, మక్కువైనవటంచనెన్
కన్నులందున కొల్వుదీరిన కల్పవృక్షమునార్తిగా
కన్న భాగ్యము కన్న వేరగు కల్ములేవని తోచగా.
సమస్యా పూరణం - 1584 (దుర్మార్గుని
కర్మకు ఫలితము రూపున
మర్మపు పాపములు పున్నెమంటుచునుండున్
ధర్మమె యిట్టుల పలుకుట?-
దుర్మార్గుని పొత్తువలనఁ దొలఁగు నఘమ్ముల్.
పద్యరచన - 798
జయముల్ కల్గునటంచు బల్కి కవితాసౌందర్యముప్పొంగగా
నయమున్ మెప్పునుఁ బొందు వారగుచు విన్నాణమున్ చూపుచున్
లయపూర్ణంబుగ పాడిరో యెటుల నాలాపమ్ములన్ చేసిరో
దయతో తెల్పరదెవ్వరున్, వినుచు నే తాదాత్మ్యమున్ చెందగా.
న్యస్తాక్షరి - 23
భారతమ్మున గొప్పదై పారుచుండు
నదిని గీర్వాణ జగతిని నడచునంద్రు.
నాడు నా భగీరథుడిల నడువజేసె
నంద్రు నట్టి యత్నమునకు నచ్చెరువగు.
సమస్యా పూరణం - 1585 (గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్త...
ఇలలోనెల్ల ప్రకృతినిన్
పలువిధములుగా కొలిచెడు భారతవాసుల్
చలిమిడుల తో సలుపు నా
గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్.
దత్తపది - 65 (కక-గగ-తత-నన)
సురపుత్రుండొక కర్ణుఁడు
తరియించగ గడిపె దాన తత్పరతఁ; సదా
నెరనంటియున్న కవచము
వెరువక నొసగి కననరిగె వీరపు చదలున్.
పద్యరచన - 801
నగలును దేహాంగములను
నొగలునుఁ జూడ్కులను భక్తి నొప్పారంగా
గగనముఁ దాకగఁ జెక్కిరి
సొగసుగ నందిని! భళిభళి !సుందరమయ్యా!
సమస్యా పూరణం - 1586 (చావు వార్త తెచ్చె సంబరమ్ము)
జనుల బాధవెట్టి చంపుచునుండెడు
రక్కసుండు జచ్చె రణమునందు
ప్రజలకెల్ల నాఁడె పర్వమయ్యెను, వాని
చావువార్త తెచ్చె సంబరమ్ము.
పద్యరచన - 802
మగవారలతోపాటుగ
మగువలు సైనికులలో తమదు పాటవమున్
తగురీతిగఁ జూపించిరి,
నగరములో తమదు ప్రతిభ నలుగురు మెచ్చన్.
నిషిద్ధాక్షరి - 30
అశ్వములఁ గూర్చి నడుపగ నరుణుడిట్లు
కాల చక్రముఁ నడిపెనా గగనవిభుఁడు,
చిక్కుడాకుల పల్లకి చేర్చి భువిని
రవికి పూజలు జరుగును లక్షణముగ.
పద్యరచన - 803
రేకులు విచ్చు నందముల రేయి మరింతగ నందగించగా,
చీఁకటి మాటుఁజేరె, శశి చిక్కటి వెల్గులఁ గ్రుమ్మరించగా
ప్రాకెనహో, నిలాతలముఁ బర్వె నెవో మధుభావవీచికల్
నా కనుపాపలందు నది నర్మిలిఁ గొల్పెడు చిత్రమే యగున్.
సమస్యా పూరణం - 1587 (కన్నులు గ్రుడ్డివే యయినఁ గానఁ
మిన్నగ నీశునిన్ మదిని మేల్మిఁ దలంచుచునున్నవారికిన్,
దన్నుగ మోక్షమిచ్చునని తథ్యముఁ దెల్సిన భక్తవర్యుకున్,
పన్నగభూషణున్ గొలుచు పట్టున మానస పూజలందునన్
కన్నులు గ్రుడ్డివే యయినఁ గానఁగవచ్చు సమస్తవస్తువుల్.
పద్యరచన - 804
తాండవమాడుచున్న తఱి తాళము తప్పనితీరుగాంచ బ్ర
హ్మాండమునందునున్న నిఖిలంబున దేవతలెల్లవారులున్
పండుగగా గనంగ నిట వచ్చిరొ ! విశ్వపు రూపుఁ జూచి నే
దండముఁ జేతునయ్య ,నిను దాల్తు మనమ్మున నిశ్చలమ్ముగా.
న్యస్తాక్షరి - 24
పుక్కిటఁ బట్టినట్టివల పూర్వులు జెప్పిన గాథలన్నియున్
చక్కగ నేర్చి మస్తకము శక్తియుతమ్ముగ వాడుచుండ్రి, నేఁ
డొక్కరు నైనఁ జేయరిటులుండరు, కబ్బములెల్ల వ్రాసినన్
సొక్కునటంచు వ్రాయుదురు, సుందర గ్రంథములన్ ముదమ్ముతో.
పద్యరచన - 805
చకచక త్రాటిపై నడచు చక్కని శిక్షణ పొంది బాలలే
తికమక లేక చేయుదురు; దేశయశస్సునుఁ బెంచు వీరినిం
చుక గమనించువారెవరు? శుద్ధమనస్కులు శ్రద్ధ వెట్టుచో
నిక మన దేశమున్ ప్రతిభకించుక నైన కొఱంత లేదహో!
సమస్యా పూరణం - 1588 (దీపము పెట్టెనింట యువతీమణి భళ్...
పాపలచక్కగా నిదుర పట్టున నుండగ జూసి యెప్పుడో
యోపికతోడ వేకువనె యొప్పుగ ముగ్గుల వెట్టి, భక్ష్యముల్
మోపుగఁ జేసి యెల్లరకు, మ్రొక్కులఁ దీర్చెడు దైవసన్నిధిన్,
దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్!
ఖద్దరునూలుబట్టలన?గాంధిమహాత్మునికెంతయిష్టమో
రిప్లయితొలగించండిప్రొద్దుటరాట్నమున్నొడికిపోగుకుదారముపోగుజేసి|యే
బద్దకమెంచకన్తగినబాధ్యతచేత-స్వదేశదుస్తులే
ముద్దనిబోధజేసితనమోజునుదెల్పెనుభారతాళికిన్|
చరఖా చక్రమునే సుదర్శనముగా సంధించి యాంగ్లేయ ము
రిప్లయితొలగించండిష్కర సంఘాత విభుత్వ గర్వమును వ్రక్కల్ చేసి స్వాతంత్ర్య సు
స్థిర దీక్షామతియై చెలంగిన గుణశ్రీ మూర్తి బాపూజి సం
స్మరియింతున్ సతతంబు భక్తి మెయి వాచా కర్మణా చేతసా !
భారతదేశ బడ్గులకు వల్వలు నిండుగ లేవు గాన నే
రిప్లయితొలగించండిధారణచేయ 'పంచొకటి తప్ప' శరీరముపైన దుస్తులన్
దారుణమైన 'పూనికను' దాల్చిన గొప్ప దయాళు , త్యాగి మా
భారత మాత గన్న జనవంద్యుడు రాట్నము ద్రిప్పు గాంధియే.
పద్యరచన:చరఖా త్రిప్పెడి గాంధిని
రిప్లయితొలగించండిబురఖాలో దాచి నేడు వోట్లను కొనగా
సురపంచుచు ప్రజలకిపుడు
ఎరపెట్టిరి నేతలు సభ కెన్నిక యవగన్
అమరుడయె గా౦ధి నాడుహత్య యొనర్చ
జాతి పిత యని కొనియాడి చాటు కొనిరి
చంపి వేసిరి యతని యాశయము లన్ని
మద్యపాననిషేధమ్ము మతకలహము
ఖద్దరునే ధరియించెను
రిప్లయితొలగించండివద్దనె హింసయు నసత్య వాదము మనకున్
రద్దనె పరాయి పాలన
యిద్దినముననే గతించె నీ మన బాపూ.
చరఖా వడుకుచు గాంధియె
రిప్లయితొలగించండిచెరవిడిపించుచు జగతికి చేతన నిచ్చెన్
భరతము యున్నంతవరకు
మరువదుగా జాతి నిన్ను మాన్య మహాత్మా!!!
రాట్న మాయుధముగ రణము నడిపినాడు
రిప్లయితొలగించండిదండి లోన ఉప్పు వండినాడు
కత్తి పట్ట కుండ కదముగెలిచినాడు
గాంధి తాత చాల గడుసువాడు