30, జనవరి 2015, శుక్రవారం

దత్తపది - 66 (కల్లు-నీరా-సారా-సుర)

కవిమిత్రులారా!
కల్లు - నీరా - సారా - సుర
పైపదాలను ఉపయోగిస్తూ
మద్యపాన నిషేధం గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

16 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 2. మద్య పానము మానుము మాన వుండ !
  దాని వలనన గలుగును హాని మనకు
  కల్లు సారాయి నీ రాల గలుగు మత్తు
  సురను గూడను ద్రాగుట మరచి పొమ్ము
  బాగు పడునిక నిజమునీ భాగ్య రేఖ

  మనసారా నేగోరుదు
  ననయము నీ సురను మఱియు హానౌ కల్లున్
  వినుమవి దరి రానీయకు
  తనువిది నీరా కకొఱకు తహతహ లాడెన్

  రిప్లయితొలగించండి

 3. నీరాస్యం లో మునుగ మాకుమా
  మనసారా ఆ పైవాని ని కొలువుమా
  తాటికల్లు నీవు ఇక మానుమా
  సవితాసురాపానీయం గైకొనుమా !!

  జిలేబి

  రిప్లయితొలగించండి

 4. పద్యము:మన సారా మన నీరా
  మన సుర మన కల్లు మధుర మౌ గాని విష
  మ్ముర,స్వాస్థ్యము కొరకై, మా
  నర, త్రాగుడు పిల్ల పాప నందించ౦గన్

  రిప్లయితొలగించండి

 5. మల్లెలవారి పూరణలు
  1.సురను సేవింప చేటనె శుక్రుడెపుడొ
  కల్లుమానంగ ఘోషి౦చె గాంధి ప్రజను
  కాపు నీరాను త్రాగిన కలుగు మిత్తి
  ప్రభుత సారాను పోషించు ప్రాలుమాలి
  2.మనసారా త్రాగితి నని
  మనవారనుట యొకవింత మననీరా- వే
  జనములు కల్లును సుర నే
  ఘనులై విడగను తెలుపుచు కరుణాయుతులై

  రిప్లయితొలగించండి
 6. సారాయిని సేవించిన
  నీరాతయె మారిపోవు నిజమును గనుమా!
  కూరిమి చెడి మనసు రగులు
  దారుణమగు కల్లు నెపుడు ద్రాగకు సుమ్మా!!!

  రిప్లయితొలగించండి
 7. గాంధీమహత్మునిసందేశం
  -----------------
  మనసారానేదేల్పెద
  అనవరతంబసురులట్లునాసురనెంచన్
  ధనముకు,నీరాతకు,వే
  దనమునుమీకల్లుననుచుదలచెనుగాంధీ|

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. అనఘా!కల్లునుమానుమింక నినుభార్యాబిడ్డలే మెచ్చగా
  మన సారా సుపథమ్మునెన్నుచు సదామాన్యుల్ ప్రశంసింపగా
  ఘననీరాజనమందుకొమ్ముచెరుపౌగామద్యపానమ్ము దా
  నినివర్జించుముభాసురమ్మగమదిన్నిత్యమ్మువర్థిల్లుమీ !
  మద్దూరి రామమూర్తి
  కర్నూలు.

  రిప్లయితొలగించండి
 10. కల్లు త్రాగకు మోయి కళ్ళు తెఱచి చూడు
  ........కల్ల కాదిది గుల్ల యిల్లు నొళ్ళు
  నీరా యెదురు చూచు నీరాక కోసమై
  ........ఆరాట పడితివో అంతు జూచు
  సారా విషము మనసారాట పడనీకు
  ........త్రాగుబోతుల వెంట రాదు సిరియు
  సుర త్రాగుచుంటిని సురలు త్రాగిన రీతి
  ........ననబోకు దక్కు నీ కసుర కీర్తి

  మద్య పానమ్ము కూడదు మాను మనిన
  బాపు మాటను మన్నించి భావి కొఱకు
  మంచి బాటను నడచిన మన గలాడ
  వాదరమ్మున సంఘము నందు నిజము.

  రిప్లయితొలగించండి
 11. నీరానుసేవించు-నియమంబుగామార
  కల్లునునాశించు-కాంక్షబెరుగు
  సారానుగోరెడి-ధారాళతేజేర?అసురలక్షణములునావరించు
  బ్రాందివిస్కీలతో-పలుకుబడులనిన?
  ఇంటిసంసారంబుకంటకంబె
  సంతుసంస్కారంబుసన్నగిల్లుటయగు
  బార్యమానసమంత-బంగపాటె
  రోగబాధలువెంటాడిరోతగూర్చు
  విద్యనెంతున్నసహనంపువిలువలన్ని
  వలువలట్లుగదొలగును-తెలివిలేక
  మద్యపాననిషేధమే?మంచిదెపుడు

  రిప్లయితొలగించండి
 12. కల్లు మానరా సత్యాన్ని కాంచ గలవు
  మత్తు వదలనీ రాజులా మసలవగలవు
  దివ్య బోధల సారాన్ని తెలియగలవు
  సురలు పొందని సుఖములు చూడగలవు

  రిప్లయితొలగించండి
 13. ఎన్ని మారులు చెప్పిన నేమి ఫలము
  మత్తు నిచ్చెడి సారాయి మరియు కల్లు
  నమ్మకుండ నీ రాష్ట్రమ్ము నందు మార్పు
  రాక పోయెనని మనుసు రహి నసించె

  రిప్లయితొలగించండి
 14. నీరానైనను కల్లునైనను ప్రజానీకంబు సేవించినన్
  తారాస్థాయికి చేరి రాష్ట్రమున కాదాయంబు కొండంత లౌ
  నీరీతిన్ ప్రభుతల్ తలంచ వలదే యింటన్ సురాపానమే
  ఘోరంబుల్ కలిగించునో తరమి పోగొట్టుండు సారానికన్

  రిప్లయితొలగించండి
 15. నా పూరణకు చంద్రమౌళి రామారావుగారి సవరణ :
  నీరానైనను కల్లునైనను ప్రజానీకంబు వాంఛించుటల్
  తారాస్థాయికి చేరి రాష్ట్రమున కాదాయంబు కొండంత లౌ
  నీరీతిన్ ప్రభుతల్ తలంచ వలదే యింటన్ సురంద్రావని
  స్సారంబౌ జన జీవనం-బగును సంసారాల్ తిరుక్షౌరముల్

  రిప్లయితొలగించండి
 16. కల్లు ద్రాగుచు నొకడిల్లు గుల్లజేయు
  నిత్యమొకడు నీరాగొని నీల్గుచుండు
  సతముసారాను గ్రోలుచు సమయు నొకడు
  సురను త్రాగుట వలవదు సుజనులార!

  రిప్లయితొలగించండి