చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘నాకు| కూడ నుండు...’ అనండి. **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. **** లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** మిస్సన్న గారూ, మీ సీసపద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు. అందరికీ పంచదారచిలుకలు కన్పిస్తే మీకేమో పంచదారకోళ్లు కనిపించాయి. బాగుంది.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. సహదేవుడు గారి పద్యంలోని ప్రాస ‘స్వవర్గజప్రాస’. దాని ప్రకారం థధలకు, దధలకు ప్రాస చెల్లుతుంది. చెల్లుతుంది కదా అని దానిని విరివిగా ప్రయోగించవద్దని సలహా. ఏదో తప్పని పరిస్థితుల్లో వాడవచ్చు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
పంచదారచిలుక బహుపసందుగనుండు
రిప్లయితొలగించండిచూచినంత మొగమువాచు మనకు
మధురమైన రుచికి మధుమేహ రోగియున్
తినక యాగ లేడు దీని జూడ
పంచదార చిలుక లంచితముగ నట
రిప్లయితొలగించండిబెట్ట బడెను వరుస ,చిట్టి చూడు
తీ సికొనుమ యొకటి ,తీసికొ నుమనాకు
కూడ ,యుండు చీకు కొలది తీపి
పంచవన్నెల రాచిల్క నెంచి చూడ
రిప్లయితొలగించండిచిలుక పలుకులు మధురము లొలుకు వినగ
పంచదారల కీరము త్రుంచి చూడ
చిలుక పలుకులు మధురము లొలుకు తినగ
చక్కెరతో నచ్చులనిట
రిప్లయితొలగించండిచక్కగ పక్షులుగ గొప్ప సామర్థ్యముతో
చెక్కిరిగద! చూచుటకును,
నిక్కముగా తినుటకిట్లు నిల్పిరటోయీ?
పంచ దార చిలుక బల్ పసందుగ నుండు
రిప్లయితొలగించండినీరసమును బాపు నిశ్చయముగ
పుణ్య కార్యములను ముఖ్యముగను చేయు
తీపివంటక మది తెలుగు నాట
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘నాకు| కూడ నుండు...’ అనండి.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పందార చిలుక లచ్చట
రిప్లయితొలగించండినందముగా బేర్చినారు నాస్వాదించన్
డెందము దోచెను జూడగ
విందులకవి వండు గాదె ప్రీతిగ నెపుడున్!!!
ఎగురగలేమటంచు|తమరెంచిననోటికి,చేతిసాయమే
రిప్లయితొలగించండితగులగ?వెళ్లినాల్కపయితైతకలాడగమాకుయిష్టమే|
మగువలకిష్టమైనపరిమాణమునందునరూపురేఖలే
నగుపడుచున్నవేచిలుకలందముశంకరులుంచ?వన్నెచే
జాముజాముకు కూసి జనులను మేల్కొల్పు
రిప్లయితొలగించండి.......చక్కగా రేయెల్ల జాము కోడి
పౌరుషమ్మును జూపి పదునైన కత్తికి
.......తెగుచుండి పోరు పందెంపు కోడి
పదుగుర పోషించు బలవర్ధ కంబైన
.......నాణ్యమౌ గ్రుడ్లతో నాటు కోడి
పల్లె పల్లెకు నేగు పట్టణమ్ముల మించు
.......రంజైన రుచుల ఫారంపు కోడి
కాని యీ చిత్ర మందున కనుల కింపు
జేయు చున్నట్టి యెర్రనౌ చిన్ని కోళ్ళు
చప్ప రించగ తీయనౌ చవుల నిచ్చి
నోరు పండించు నీ పంచదార కోళ్ళు.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
మిస్సన్న గారూ,
మీ సీసపద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
అందరికీ పంచదారచిలుకలు కన్పిస్తే మీకేమో పంచదారకోళ్లు కనిపించాయి. బాగుంది.
గురువుగారూ ధన్యవాదాలు
రిప్లయితొలగించండిచక్కెర చులుకలఁ జేసిరి
రిప్లయితొలగించండిచక్కని శుభకార్యమునకు సరవిన్ మగువల్
చక్కని పనితనమున గనఁ
మక్కువగాకుండునే క్రమంబుగ జగతిన్
సందియము లేక హంసలు
రిప్లయితొలగించండినంధము వీడుచుఁ గుడువవె యవదోహమునే?
పందార హంసలన్ దిన
క్రందనముల బాలలు విడి రంజిల్లుదురే!
(అంధము=నీరు, యవదోహము=పాలు)
శ్రీ సహదేవుడుగారికి నమస్సులు.
రిప్లయితొలగించండిద కు ధ కు ప్రాస కుదరదనుకుంటాను
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
సహదేవుడు గారి పద్యంలోని ప్రాస ‘స్వవర్గజప్రాస’. దాని ప్రకారం థధలకు, దధలకు ప్రాస చెల్లుతుంది. చెల్లుతుంది కదా అని దానిని విరివిగా ప్రయోగించవద్దని సలహా. ఏదో తప్పని పరిస్థితుల్లో వాడవచ్చు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఎత్తు గీతి :
రిప్లయితొలగించండిఊరించె చిలుక చూడ
నూరించె రూపు తేరి
పారించు మోము,నన్ను
యూరించు రంగురుచియు
తేటగీతి
రిప్లయితొలగించండిచూచుటను తోడనోరును రుచిని కోరు
వేచి యుండుట సాధ్యమా! వీలెవరికిది
చేయి చాచగ నెండలో చింత దీరు
పెద్ద లౌదురు నేరుగా పిన్న మనసు..!!