అంశం- పుస్తకము
ఛందస్సు- ఉత్పలమాల
మొదటిపాదం మొదటి అక్షరం ‘పు’
రెండవపాదం ఏడవ అక్షరం ‘స్త’
మూడవపాదం పదమూడవ అక్షరం ‘క’
నాల్గవపాదం పదునేడవ అక్షరం ‘ము’
ఛందస్సు- ఉత్పలమాల
మొదటిపాదం మొదటి అక్షరం ‘పు’
రెండవపాదం ఏడవ అక్షరం ‘స్త’
మూడవపాదం పదమూడవ అక్షరం ‘క’
నాల్గవపాదం పదునేడవ అక్షరం ‘ము’
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపుస్తక మాయెగా భువిని పూర్వపు గాధలు నెన్నియో మఱిన్
రిప్లయితొలగించండినేస్తమ యౌను హ స్తమున నేర్వగ నీ యది గాదె చె ప్పుమా
వాస్తవ మేగ దా ర్య మఱి పైసల కన్నను గొప్పదే సుమా
వస్తువు లేవియం గనవు వాసిగ దీనికి సాముగా నిలన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గవపాదంలో న్యస్తాక్షరము ‘ము’ రాలేదు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుట్టితి రైతు బిడ్డగను పుణ్య ఫలంబున, కోర్కెతోడ చే
రిప్లయితొలగించండిబట్టితిగాదె వాస్తవపు పారణ భారత పద్య పాఠినై
పెట్టితి మానసమ్ము కడు వేడుక కల్గగ కైత కన్నెపై
చట్టన నన్నుచేరె గద శారద మిక్కిలి ప్రేముడిన్ సుమా
పుస్తక మెన్న భూషణము మొన్నటి దాకను మానవాళికిన్
రిప్లయితొలగించండివాస్తవ మెంచ హస్తమున, పండితులున్ బుదులున్ హితైషులై
వాస్తవ మందు రిట్లు మన వారికి కమ్మని మైత్రి గ్రంథముల్
మస్తక మందు పేరుకొను మన్ను పఠింపక తాము పొత్తమున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపుస్తక మెప్పుడున్ జదువ బొందురు బోధన నిశ్చయమ్ముగా
రిప్లయితొలగించండిహస్తము నందునేస్తముగ నాసర తానగు నన్నివేళలన్
మస్తము నందుకాంతినిడి మంచిని పంచును మానవాళికిన్
శస్తము లీయువిద్దియకు సాటిక లేవుగ గోముగానిలన్!!!
పుత్తడికంటెరత్నములె|పూర్వమునుండియెమూల్యమైన?యే
రిప్లయితొలగించండిచిత్తమునైనపుస్తకమె|జెప్పగముఖ్యమటంచుదెల్పుటో
క్రోత్తదనాలకూర్పులచె-కొమ్మకుకమ్మనిపండు రీతిగా|
పొత్తముగానుపించుగద?బుద్దివికాశపుమోముకెప్పుడున్
మల్లెలవారిపద్యము
రిప్లయితొలగించండిపుణ్య చరిత్ర వైభవమొ, భూపులకీర్తి, పురాణగాధలో
గణ్యము గాగ పుస్తకము గాంతుమున్యాయముధర్మమింపుగా
గుణ్యత వాని యందుననె కూడును కమ్రపు కీర్తి నంది యా
పణ్యపు భావ జాలముల పర్వెను అయ్యవి ముక్తిదాతలై
పద్యము
రిప్లయితొలగించండిపుట్టువు గానమై తొలుత భూర్జపు పత్రములన్ లిఖి౦చుచున్
కట్టగ జేయ పుస్తకముగా మునివర్యుని రామగాధలో
పట్టుచు చేత గంటము ప్రబంధపు కమ్మని వర్ణనల్ కవుల్
బిట్టుగ నాడువ్రాయ, ప్రభవించితి నేడిటు, గోము ముద్రణన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపుస్తకమన్ననేస్తమిడ?పూర్తిగబంచుచరిత్రలన్నియున్
రిప్లయితొలగించండిమస్తకమందు|విస్తరణమంత్రముచేతనునిల్వలుంచు|"చా
దస్తముమాన్పునౌషదపుదాతగకన్పడు|"విద్యబుద్దియున్
విస్తరియందునొడ్డణగ-విజ్ఞతబంచునుగోముచేతనే|
పున్నమి చంద మామవలె పుస్తక మిచ్చట వెల్గులీనుచున్,
రిప్లయితొలగించండిచెన్నగు చెల్మి పుస్తకము చేతన రూపము చిత్త మందునన్,
కన్నుల కంటి పాపవలె కాంతిని కన్గొను పుస్తకంబనన్,
మున్నటు దృశ్య కావ్య మది పుస్తక మయ్యెను నోమునోచగన్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
పుస్తక మెల్ల వేళలను పూజితమై వెలుగొందు ధాత్రిపై
రిప్లయితొలగించండిపుస్తక మౌను నేస్తము సమున్నత జ్ఞానమొ సంగుచున్ సదా
పుస్తక మందజేయు మనపూర్వుల కర్మ చరిత్ర ,గాథలున్
పుస్తక మున్నగీము ప్రతిభోధ సముజ్వల కాంతి సౌధమౌ.
సవరించిన పద్యము :
రిప్లయితొలగించండిపుస్తకమున్న చాలునిక బొందగ వచ్చును జ్ఞానవిత్తమున్
హస్తమునందు నేస్తముగ నక్కర వచ్చును దీని దాల్చినన్
మస్తకమందు బుద్ధినిడు మానసిక వ్యధలెల్ల మాన్పు నీ
యాస్తిని వృద్ధి సేయ సమయంబు వ్యయంబయినన్ ముదంబగున్
న్యస్తాక్షరిని సమర్థంగా పూరించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
మిస్సన్న గారికి,
శైలజ గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
పుత్తడినమ్మియైననొక బొత్తము పొందుట నాకునింపగున్
రిప్లయితొలగించండివిత్తమునాకుపుస్తకమె, విఘ్నములేక పఠించుటే యిడున్
సత్తువ నాకు సంతతము, స్వచ్ఛత కల్గును మానసమ్ముకున్
బొత్తము చేతనున్న, కడుమోదము గల్గును మోమునందునన్