9, జనవరి 2015, శుక్రవారం

పద్యరచన - 785

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

 1. వైకుంఠంబందున తా
  నేకాంతంబందు విష్ణువిష్టాగోష్టిన్
  లోకేశ్వరి తోనుండగ
  నా కమనీయమగు దృశ్యమానందమగున్

  రిప్లయితొలగించండి
 2. శ్రీ మహావిష్ణు వచ్చట సిరియు తోడ
  లోక ప్రజలకు నాశీ సు లునిడు తకును
  తిష్ఠ వేసుకు నుండెను తిన్నె మీద
  రండి యచటకు బోదము ,దండిగాను
  నందు కొనుటకు నాశీ సు లందరమును

  రిప్లయితొలగించండి
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 4. ఊసు లాదు కొనుచు ఊయలూగు వేళ
  స్వామి నీకు శంఖ చక్రమెల?
  సరసిజములబదులు మరు మల్లియలు దాల్చి
  హాయి పoచు కొనవె ఆది లక్ష్మి

  రిప్లయితొలగించండి
 5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. ఆదిదంపతులట నానందముగ జేరి
  యూసులాడు చుండి రూయలందు
  నాలుమగల యొక్క యనురాగమవనికి
  చాటు చుండ్రి వారు చక్క గాను

  రిప్లయితొలగించండి
 7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. హరి సిరితోడ మా గృహమునందు వసింపగ వచ్చు భాగ్యమే
  దొరికెనొ! తూగుటూయలను తూగుచునాడెడు లీల జూపుటే?
  సరిసరి స్వప్నమై కరిగి జారునొకో!కొనకంట జాలినిన్
  కురియుచు స్వామి నాకిటుల క్రొత్తగ దర్శనమిచ్చెనో కదా!

  రిప్లయితొలగించండి
 9. క్షేమమె నీదు భక్తులకు శ్రీహరి? యేమది దీనరక్షకా
  మోమున నేదొ విభ్రమపు పొంగులు దోచెడి! రాక్షసాళి నీ
  నామము జేయు భక్తులను నీల్గగ జూతురొ తన్ను గావగా
  నెమ్మి గజమ్మొ ద్రౌపదియొ నీ దయకై యెలుగెత్తి పిల్చెనో?

  ఏమను వాడ శ్రీసఖియ! యెంతటి ఘోరమొ భారతావనిన్
  మోములు జూడ సాధువులు ముష్కరు లంతరమందు పెక్కురై
  రాముడు కృష్ణు డంచు తమ రాబడి కోసము గుళ్ళు గోపురాల్
  ప్రేమగ కట్టి వర్తకము పెల్లుగ జేయుచు నున్నవారు నా
  నామము చాటునన్ కలగె నా మది యుర్వికి నేను బోవలెన్
  తామరసాక్షి చంపుటకు దైత్యగణమ్ముల జక్రధారలన్.


  రిప్లయితొలగించండి
 10. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  మిస్సన్న గారూ,
  మీ లక్ష్మీనారాయణుల సంవాద పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. సృష్టి పోషణాది కష్టమ్ముల మరువ
  సరస జేరె హరియె సిరిని గూడ!
  శంఖ చక్ర ధారి శమనమ్ము బొందగన్
  పతికి సతియె మధుర భావనమ్ము!

  రిప్లయితొలగించండి
 12. లక్ష్మినారాయణులసంభాషణ
  సీ"వరకట్నమందుండి-వనితలసౌఖ్యము
  పంచగవెళ్ళవాభాగ్యలక్ష్మి?
  మగవాడిననుగర్వపొగరునుమాన్పించు
  చింతనుబెంచావాశ్రీనివాస?
  ఆశదోషములెన్నొనలవోకగాదీర్చు
  విజయమునింపవావిజయలక్ష్మి
  ధనమదాన్దులయందుదౌర్జన్యములుజేయ
  హరియింపబోవేల?హరియటంచు
  లక్ష్మిబలుకగవిష్ణువులౌక్యమందు
  మానవాళికిసాయంబుమానబోకు
  ఇలనునాధారకార్డులోదాగియుండి
  రైతఋణమాఫిగామారురాజ్యలక్ష్మీ|  రిప్లయితొలగించండి
 13. హరి యేకాంతమునం దుయాల మిగు లాత్మానందమున్ జెందుచున్
  స్థిరుడ య్యూగుచునుండ వచ్చి యటకున్ శ్రీ లక్ష్మియడ్గెన్ ప్రభూ!
  ''సురవైర్యాదుల గూల్చినట్లు ధరలో సూక్ష్మంపు దుర్నేతలన్
  కరుణన్ జూడక లంచ గొండుల మరీ కామాంధులన్ గూల్చవా?''

  రిప్లయితొలగించండి
 14. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  చమత్కారభరితమైన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘గర్వపొగరు’ అన్నదాన్ని ‘టెక్కు పొగరు’ అనండి.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మరీ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

  రిప్లయితొలగించండి
 15. శ్రీవత్సాంకుఁడు చిద్విలాసుఁడు శుభశ్రీదాయకుండంత ల
  క్ష్మీవాత్సల్యసమేతుఁడై బరగి సంక్లిష్టబులైయుండునా
  త్రైవేదార్థవిశేషభావముల సంధానించుచున్ సాగగా
  నావైకుంఠము వైభవప్రకట విద్యారణ్యమై వెల్గెనే

  రిప్లయితొలగించండి
 16. హరి యేకాంతమునం దుయాల మిగు లాత్మానందమున్ జెందుచున్
  స్థిరుడ య్యూగుచునుండ వచ్చి యటకున్ శ్రీ లక్ష్మియడ్గెన్ ప్రభూ!
  ''సురవైర్యాదుల గూల్చినట్లు ధరలో సూక్ష్మంపు దుర్నేతలన్
  కరుణన్ జూడక లంచ గొండ్ల నటులే కామాంధులన్ గూల్చవా?''

  రిప్లయితొలగించండి
 17. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మన్నించండి... మీ పద్యాన్ని అన్నపరెడ్డి వారిదిగా పొరబడ్డాను.
  సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘మీ కైతల్ రసవైభవప్రకటసామీప్యంబుతో శోభిలున్’

  రిప్లయితొలగించండి