13, జనవరి 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1580 (రామపాదమ్ము రమణిని రాయిఁ జేసె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రామపాదమ్ము రమణిని రాయిఁ జేసె.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

 1. స్త్రీగ మార్చెను నలనాడు శీ ఘ్రముగను
  రామ పాదమ్ము రమణిని , రా యి జేసె
  శీత లంబగు బెట్టె లో జేర్చ బడిన
  పాల సంచుల నన్నిటి జాల వరకు

  రిప్లయితొలగించండి

 2. నాగలి పాదమ్ము రాయిని మణి ని జేసె
  వింటి పాదమ్ము మణి ని రమణి ని జేసె
  పరుల పదమ్మున రమణి ఎడబార జేసె
  రామపాదమ్ముర, మణిని రాయి జేసె !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. జిలేబి గారి అద్భుతమైన విరుపు తో నా పూరణ ..జిలేబిగారికి ధన్యవాదములు.


  రామ నామము మరియును రామ భక్తి
  తనకు నున్నట్టి సిరిసంపదన్న తలపు
  తృణము జేసెను ధనమును, తెలియ మణియె
  రామపాదమ్ముర, మణిని రాయి జేసె

  రిప్లయితొలగించండి
 4. నాస్తికులు గూడి యాడగ నాటకమ్ము
  రామ కథలను వక్రించి రచ్చ జేసి
  రామపాదమ్ము రమణిని రాయిఁ జేసె.
  ననుచు హాస్యమ్ము జేసిరి నటన కొరకు

  రిప్లయితొలగించండి
 5. పడుకు పడతియయ్యెనెవరి పదము సోకి?
  చెలికి మరియొక పేరేమి చెపుమ వేగ ?
  మగని శాపము సతినెట్లు మార్చి వేసె?
  రామపాదమ్ము, రమణి,ని రాయిజేసె !!!


  కఠిన ఫాషాణమునుగూడ కలికి జేసె
  రామపాదమ్ము, రమణిని రాయిజేసె
  గౌతముని శాపము తగిలి గండ శిలగ
  మారి పోయెన హల్యయె భీరుకమున !!!
  రిప్లయితొలగించండి
 6. రాయిగామారిన యహళ్య రమణిఁ జేసె
  రామ పాదమ్ము, రమణిని రాయిఁజేసె
  గౌతముండు కనలి తన కాంతపైన
  శక్రు తోడ సంగమమును సలుపు టెరిగి

  రిప్లయితొలగించండి
 7. తా నహల్యకై తపియించి ధరకు దిగగ
  నిందురుని జూచి తడబడె నిందు వదన
  బతికి నవమాన మనిపించు గతిన బడిన
  రామపాదమ్ము రమణిని రాయిఁ జేసె!
  రాము=అతివ అహల్య

  రిప్లయితొలగించండి
 8. శాప ముక్తిప్రసాదించి శరణు లిడెను
  రామ పాదమ్ము , రమణిని రాయ జేసె
  శాప మంత్రాన గౌతము సంశయించి
  ఆడు వారి కథ లివియె ఆది నుండి

  రిప్లయితొలగించండి

 9. శిలగ శాపము పొందు దుశ్శీలవతికి
  తీర యఘము నహల్యగ మారె,సోక
  రామ పాదమ్ము,రమణిని రాయిఁజేసె
  కామవర్తులకీ శిక్ష కలుగ వలయు

  రిప్లయితొలగించండి
 10. కెఎస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ

  "పతికి ద్రోహము జేసిన పతితవీవు
  నాదు సాహచర్యము విడనాడు" మనుచు
  యిచ్చెను;యతి శాపమ్ము-స్పృశి౦చు దాక
  రామ పాదమ్ము,రమణిని రాయిఁజేసె

  రిప్లయితొలగించండి
 11. నాడహల్యకుశాపంబునాథుదొసగ?
  తప్పులేదనిగౌతముడొప్పునట్లు|
  కాళ్ళఫైబడ్డ-భార్యనుకసరికొన?"వి
  రామపాదమ్మురమణినిరాయిజేసె|"

  రిప్లయితొలగించండి
 12. మల్లెలవారి పూరణలు
  అడవి తిరుగుచు నుండంగ నచట తాకె
  రామ పాదమ్ము,రమణిని రాయిఁజేసె
  పతియె,నది మారె సతి గను -పడతి భక్తి
  నతని ఘనతను పొగడెను నఘము తొలగి
  2.తాకె దేనిని?రాయైన తరుణి నడవి
  రామపాదము. రమణిని రాయి జేసె
  నెవడు?గౌతముడ హల్యనె౦చి దుష్ట
  వర్తన గలుగు భార్యను బండ జేసె


  రిప్లయితొలగించండి
 13. sripada variki sankrani shu bhakankshalato meeru lekhini.com
  open cheyandi. prakkana lipiki aadharamu undunu

  రిప్లయితొలగించండి
 14. కౌశికుం డనె యీ ముని కాంత కొరకు
  నెట్టి వేళను గౌతము నింటి లోన
  సురవిభుడు కాలునూనెనో చూడవయ్య
  రామ! పాదమ్ము రమణిని రాయిఁ జేసె.

  రిప్లయితొలగించండి
 15. మిస్సన్న గారి విరుపు బాగుంది.
  మూడవ పాదాన్ని
  'సురవిభుండు కాలూనెనో చూడవయ్య'
  అంటే బాగుంటుందేమొ పరిశీలించ గలరు.

  రిప్లయితొలగించండి
 16. శాపము తొలగిపోవగ చక్కనైన
  తరుణిగా మారె రాయిని తాకినంత
  రామ పాదమ్ము - రమణిని రాయిఁ జేసె
  గౌతముని కోపము తనదు కాంత పైన

  రిప్లయితొలగించండి
 17. కవిమిత్రులకు నమస్సులు.
  నిన్నటినుండి ప్రయాణంలో ఉండి మీ పూరణలపై, పద్యాలపై వెంటవెంటనే స్పదించలేకపోయాను. మన్నించండి.
  ఈనెల 29న పొద్దుటూరులో సహదేవుడు గారి కుమార్తె వివాహానికి వెళ్తున్నాను. ఎలాగూ అంతదూరం వెళ్తున్నాను కదా అని తిరుపతి కార్యక్రమం కూడా పెట్టుకున్నాను.
  చంద్రమౌళి సూర్యనారాయణ గారు దయతో రాను పోను రైల్వే బెర్తులు రిజర్వ్ చేయించి నా ప్రయాణం సఖంగా జరగడానికి తోడ్పడ్డారు. వారికి నా ధన్యవాదాలు.
  అప్పటి నా కార్యక్రమం ఇది... 28-1-15 రాత్రి కాచిగూడలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కడం. 29-1-15 ఉదయం ప్రొద్దుటూరు చేరడం. ఆరోజు సాయంత్రం వరకు అక్కడి గుళ్ళూగోపురాలు దర్శించడం. సాయంత్రం సహదేవుడు గారి విందులో పాల్గొనడం. 30-1-15 ఉదయం పెళ్ళి. వివాహానంతరం తిరుపతి ప్రయాణం. 31-1-15 నాడు శ్రీవారి దర్శనం. 1-2-15 శ్రీకాళహస్తీశ్వర దర్శనం. అదేరోజు పద్మావతి ఎక్స్‌ప్రెస్‍లో తిరుగుప్రయాణం. ఈ నాలుగురోజుల ప్రయాణంలో ఎక్కడైనా ఎప్పుడైనా బ్లాగుమిత్రు లెవరైనా కలుస్తారో చూడాలి.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మార్చిన దలనాడు’ అనండి.
  ****
  జిలేబీ గారూ,
  మీ భావాన్ని గోలి వారు ఛందోబద్ధం చేశారు. సంతోషం.
  ****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  జిలేబీ గారి భావానికి చక్కని పద్యం రూపాన్ని ఇచ్చారు. అభినందనలు, ధన్యవాదాలు.
  ****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘గౌతము’ అని డుప్రత్యయం లేకుండా ప్రయోగించారు. ‘శాప మొసఁగి గౌతము డదె సంశయించి’ అనండి.
  ****
  శైలజ గారూ,
  క్రమాలంకార పద్ధతిలో మీ మొదటి పూరణ, విరుపుతో రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘రామ =’ అనబోయి టైపాటువల్ల ‘రాము =’ అన్నారు...
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘విరామపాదము’...?
  ****
  మెల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘గౌతము డహల్య’ అన్నచోట గణదోషం. ‘గౌతముడె యహల్య...’ అనండి.
  ****
  ‘శ్రీపాద’ గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ ప్రశ్నకు సుబ్బారావు గారు సమధానం ఇచ్చారు కదా! నేను కొంత వివరంగా ఇస్తున్నాను.
  ముందుగా lekhini.org తెరవండి. పైన ఒక బాక్సు, క్రింద మరొక బాక్సు కనిపిస్తాయి. మీరు తెలుగు పదాలను ఇంగ్లీషు స్పెల్లింగులతో పై బాక్సులో టైప్ చెయ్యండి. ఏ తెలుగు అక్షరానికి ఏ ఇంగ్లీషు అక్షరాలను టైప్ చెయ్యాలో కుడిప్రక్క బాక్సులో కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు పై బాక్సులో ‘SamkarABaraNam blAgu mIku svAgatam palukutunnadi' అని టైప్ చేశారనుకోండి. క్రింది బాక్సులో తెలుగు అక్షరాలతో ‘శంకరాభరణం బ్లాగు మీకు స్వాతతం పలుకుతున్నది’ అని వస్తుంది. అలా మీరు టైప్ చేయగా క్రింది బాక్సులో కనిపించే పద్యాన్ని కాని, వ్యాఖ్యను కాని కాపీ చేసి, బ్లాగులో ‘వ్యాఖ్యను పోస్ట్ చేయండి’ అన్న బాక్సులో పేస్ట్ చేసి పోస్టు చెయ్యండి.
  ****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  సహదేవుడు గారూ,
  మీ సవరణ బాగుంది. ధన్యవాదాలు.
  ****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  అందరికంటే ముందుగా సమస్య తెలిసింది మీకు.. కాని అందరికంటే ఆలస్యంగా వ్రాశారు.

  రిప్లయితొలగించండి
 18. గురుదేవులకు ధన్యవాదాలు.
  మీ రాకకై ఎదురుచూసే...
  మీ సహదేవుడు.

  రిప్లయితొలగించండి
 19. తే.గీ. బ్రహ్మ కడిగిన పాదము భక్తులార
  భరతుతలపైన పాదుకౌ పరమ పదము
  భక్తులకరుణ కాచికాపగను యటుల
  రామపాదమ్ము రమణిని రాయి జేసె

  రిప్లయితొలగించండి
 20. పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది.అభినందనలు.
  ‘కాపగను నటులె’ అనండి.

  రిప్లయితొలగించండి