పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** చందమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘అంధకరిపు’ను ‘అందకరిపు’ అన్నారు. ‘ఆనందముతో| నిందుధరుని...’ అనండి. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కాళ హస్తిన గలయట్టి గరళ కం ఠు
రిప్లయితొలగించండినెదురు గానంది వాహన మిచట రమ్య
మలరె ,చూడగ జాలవు హర్ష ! వేయి
కళ్ళు , చూడుమా నీవును కనక మణిని
అందమగు నాకసమునకు
రిప్లయితొలగించండిక్రిందన కొలువై నిలచిన గిబ్బలఱేడా
యిందరు జనుల వెతల నీ
విందుధరునకు వివరించవేడెద స్వామీ
నంది శయనించె నచ్చట
రిప్లయితొలగించండినందక రిపు మందిరమున నానందముతో
చంద్ర ధరుని సన్నిథిలో
విందొనరించెను కనులకు ప్రియదృశ్యంబే
అంద చందములన్గూడి నంది ప్రతిమ
రిప్లయితొలగించండిచూడ ముచ్చట గొల్పెడి సోయగమ్ము
వీక్షకుల మది పొంగెడి విగ్రహమ్ము
ప్రతిభ జూపినా శిల్పికి ప్రణతి లిడుము
లేపాక్షి బసవని గొలిచి
రిప్లయితొలగించండిదీపంబులుబెట్టిజనులు దీవెనలడుగున్
లోపము లెంచక దయతో
బాపుము కష్టమ్ములనుచు ప్రార్ధింతురుగా!!!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
చందమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అంధకరిపు’ను ‘అందకరిపు’ అన్నారు. ‘ఆనందముతో| నిందుధరుని...’ అనండి.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పూచినపూలుగోయమని-పూర్తిగనాకనిబిడ్డగోరగా?
రిప్లయితొలగించండి"వేచియుచూచుచుండెబసవేశునిపూజకు,చంద్రకాంతితో
నోచినవైనపూలిట"వినోదముకోసముకాదునాన్న|నీ
తోచినదంతతప్పనగ "?తొంగియుజూచినరీతినందిటన్
లేచి వచ్చు వేళ లేపాక్షి బసవన్న
రిప్లయితొలగించండికాల మంత మందు కాలి గిట్ట
నొక్కి రంకె వేయు నొక్కటి లోకము
లెల్ల నీట మున్గి లయము గాంచు
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిచక్కని భావసంపద గల పద్యాన్ని రచించారు. అభినందనలు.
****
సి. రామమోహన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
లేపాక్షిబసవ డంతటి
రిప్లయితొలగించండిరూపమ్మును బెంచి నిల్చె! లోకేశుండా
మూపురమునఁ జేయుంచుకు
కాపును గాసేటి తీరుఁ గనపడె లీలన్!
రిప్లయితొలగించండిపాపము లాచరి౦చెదరు పైదలిమానము దొచుకొ౦చు నీ
వేపనిబూని తెల్పవలె ఈశునకున్ తనకంటి జ్వాలలన్
రూపును మాపి దుష్టులను లోకము నందున శాంతినిల్పగా
నోపరమేశు వాహనమ! హుమ్మని రంకెలు వైచి లేవయా
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణలకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిగుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.