23, జనవరి 2015, శుక్రవారం

పద్యరచన - 799

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. చిత్ర మందున నచ్చట శివుని లింగ
  మునెదు రుగ నంది మఱియు పా ముగన బడుట
  పూర్వ జన్మలో జేసిన పుణ్య ఫలము
  గాదె ? చెప్పుడు నిజమని కవి వ రేణ్య !

  రిప్లయితొలగించండి
 2. ట్విట్టర్లో తామేదో
  పెట్టుటకొరకు సృజియించు వింతలనిటులన్
  తట్టునెటులనో వారికి
  యిట్టి తలపులీ ప్రదేశ మిలలో కలదా?
  (ట్విటర్లో ఈ చిత్రం కల్పితమనే చర్చ ఉంది)

  రిప్లయితొలగించండి
 3. పోచిరాజు సుబ్బారావు గారు,
  పద్యం బాగుంది. అభినందనలు.
  మీరేమో ‘నిజం’ అని చెప్పమంటున్నారు. సూర్యనారాయణ గారేమో అది ‘కల్పిత’ మంటున్నారు.
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మీరు చెప్పినట్లు ఇదేదో ఫోటోషాప్ కల్పనయే అన్నట్టున్నది. ప్రవాహనికి అడ్డుగా ఏ చిన్న వస్తువున్నా అలల వక్రీకరణ జరుగుతుంది. అక్కడ అటువంటిదేమీ లేదు. అలలు సాఫీగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నది.

  రిప్లయితొలగించండి
 4. బంటుగనుండగాబసవబాధ్యత,భక్తికిమూలమన్న?యే
  మంటివి?గంగనుండకనెమాశివుడుండునయన్నరీతిగా
  అంటగసర్పరాజువిడనాడకజేరినచిత్రముంచగా
  కంటినిసంగమేశ్వరముకామితసిద్ధికిమూలమీశుడే


  రిప్లయితొలగించండి
 5. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. అంతర్జాల చిత్రములివి
  సుంతయు నిజమిందు లేదు శుంఠల పనియే
  వింతగ జూపు పటమ్ముల
  పొంతకు పోవలుదుమీరు పుణ్యము కొరకై

  రిప్లయితొలగించండి
 7. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం. ‘అంతర్జాలాద్భుత మిది’ అనండి.

  రిప్లయితొలగించండి
 8. గంగను రంగుగ దాల్చెడి
  లింగా మున్నీట నీవు లీలంగా ము-
  న్గంగా నేనుందునె దూ-
  రంగా జేరంగ రానె రయముగ నీకై.

  రిప్లయితొలగించండి
 9. మిస్సన్న గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. త్రవ్వకముల బయల్వడ త్ర్యంబకు గుడి
  గాలివానలు చెలరేగగా నచటను
  నిండి పోయెప్రదేశము నీటి తోడ
  పుట్టవీడి సర్పమ్మటు పోవుచుండ
  చిత్రకారుడు చిత్రించె చిత్రముగను

  రిప్లయితొలగించండి
 11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. పద్యరచన
  అ౦గకమున సగమగు ను
  మ౦గని దుఃఖి౦చ గంగ, మదనా౦తకుడున్
  గంగను మెప్పించగ తా
  లింగముయై జలములందు లెస్సగ వెలసెన్

  జనవరి 23, 2015 4:47 [PM]

  రిప్లయితొలగించండి
 14. నెలదారిని దరిసించగ
  చలనము గోల్పోయిగంగ సాగక నాగెన్
  తిలకించితివా నందీ !
  హలహలమటు బోవుచుండె హారము కాగా!!!

  రిప్లయితొలగించండి
 15. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘లింగము + ఐ’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘లింగమ్మై’ అనండి.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి


 16. గుర్రుదేవులు శంకరయ్య గారికి మీ సూచనకు ధన్యవాదములు సవరించిన పద్యము
  అ౦గకమున సగమగు ను
  మ౦గని దుఃఖి౦చ గంగ, మదనా౦తకుడున్
  గంగను మెప్పించగ తా
  లింగమ్మై జలములందు లెస్సగ వెలసెన్

  రిప్లయితొలగించండి
 17. వరదలఁ జిక్కిన గూడన్
  సరీసృపము కట్టుబాటు సరి పాటించెన్!
  పరమేశు, నంది మధ్యన
  పొరబాటున నైన నెవరు పోరాదనుచున్!
  (ఈశ్వరునకు నందికీ మధ్య అడ్డుగా ఎప్పుడూ వెళ్లరాదన్నది కట్టుబాటు)

  రిప్లయితొలగించండి