12, జనవరి 2015, సోమవారం

పద్యరచన - 788

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

 1. తొండంబును పైకెత్తుచు
  దండంబును పెట్టు జనుల తలపైనిడి యే
  గండంబులు వారికి రా
  కుండగ నాశీర్వదించు కుంజర దేవా

  రిప్లయితొలగించండి
 2. అరటి పండును దానుగా నందు కొనిన
  యేను గచ్చట తొండము నింతి శిరము
  నందు నెట్టుల బెట్టుచు నాశిసులను
  నిచ్చు చున్నదో జూడగ ముచ్చటయ్యె

  రిప్లయితొలగించండి
 3. తొండమును పూరించగ మది
  దండిగ దీవించె నంట తరుణిని ముదమున్
  మెండగు సౌఖ్యము లందున
  నుండుము సౌభాగ్య వతిగ నూరేళ్ళ నుచున్

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  మొదటి రెండు పాదాలలో గణదోషం.. మొదటిపాదాన్ని ‘తొండముఁ బూరించగ మది’, రెండవ పాదం చివర ‘తరుణుని ప్రీతిన్’ అనండి.

  రిప్లయితొలగించండి
 5. గురువులకు ధన్య వాదములు
  ఇక్కడా అంతే ఎందుకో ఆ రెండు పాదాలు సరిగా లేవనిపించింది కానీ ఎలావ్రాయాలో తోచ లేదు ఇంకా లేటైతే ఈ ఐడియాను ఎవరైనా రాసేస్తారేమొ అని తొందర ప్చ్ ! ఒకోసారి అంతే

  రిప్లయితొలగించండి

 6. డెందమున గణేశు నెంచి
  వందన మాచరింప అందముగ
  తొండము తో అనుగ్రహించె మత్త
  వేదండము ఆయురారోగ్య ఐశ్వర్యములన్ !!


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. ఏనుగుతొండముతలఫై
  మానినిదానంబుజేయ?మరువనిదయ్యున్
  జ్ఞానిగ|నాశీస్సోసగెను|
  మానవులకుచేతగానిమర్యాదదియే|

  రిప్లయితొలగించండి
 8. జిలేబీ గారూ,
  మీ భావానికి నా పద్యరూపం.....

  హృదయమున గణేశు నెంచి సభక్తిని
  వందనమ్ము సేయ నందముగను
  గజ మనుగ్రహించెఁ గరమెత్తి యాయురా
  రోగ్యవిభవలబ్ధభాగ్య మొదవ.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘మర్యాద + అదియే’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘మర్యాద యదే’ అనండి.

  రిప్లయితొలగించండి
 9. పండునొసంగుచు భక్తిగ
  తొండపుదేవరను దలచి తోషము తోడన్
  దండమును బెట్టువారికి
  శుండముతో దీవెనలిడె శుండాలమ్మే

  రిప్లయితొలగించండి
 10. జంతు ప్రేమను జూపించి సంత సిల్ల
  వాహనములుగా భక్తిగ వాని నెంచి
  హిందు మతధర్మమందున పొందు పరచి
  విశ్వ మెల్లను జాటిరి విజ్ఞతెరిగి

  రిప్లయితొలగించండి
 11. జిలేబీగారి భావాన్ని చక్కని పద్యంగా మలచారు గురువుగారు

  రిప్లయితొలగించండి
 12. కరము భక్తితో కరిపూజ జరుపు చుండ్రి
  గజము దీవించ కడతేరు కలతలంచు
  నమ్మకమిడును విజయమునిమ్ముగాను
  మూఢ నమ్మకమైనను మూడు శాంతి

  రిప్లయితొలగించండి
 13. కరమును తానెత్తియు శుభ
  కరముగ దీవించునంచు గజరాజు కడన్
  దరిశనమునకని రాగా
  కరి యాశీర్వాదమిచ్చె కన వేడుకగా.

  రిప్లయితొలగించండి


 14. చల్లగ కలకాలము నీ
  పిల్లలు,భర్తయుమెలగుచు వృద్ధిని జెందన్
  కొల్లలు నాశీస్సుల నిడె
  యిల్లాలి శిరమ్ము పైన నేన్గు కరమునన్

  రిప్లయితొలగించండి
 15. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పద్యము
  నాదు ముత్తాతయె సమర్చనమ్ము జేసె
  నిచట వెలయు శ్రీకాళహస్తీశ్వరునకు
  నని పలుకు దంతికిని వందనమ్మొనర్చె
  అదియు దీవి౦చె కా౦తను హస్తమెత్తి

  రిప్లయితొలగించండి
 16. కవిమిత్రులకు నమస్కృతులు.
  మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నాను. నా సెల్ ఫోన్‌లో మీ పూరణలను, పద్యాలను చూస్తున్నాను కాని ఫోన్ ద్వారా వ్యాఖ్యానించడనికి అవకాశం లేదు. కొద్దిగా సమయం దొరికితే ఒక నెట్ సెంటర్ నుండి ఈ వ్యాఖ్య పెడుతున్నాను. రేపు కూడా హైదరాబాదులోనే ఉంటాను.
  రేపటి సమస్య, పద్యరచన శీర్షిక షెడ్యూల్ చేసి ఉంచాను.
  దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
  పునర్దర్శనం ఎల్లుండి.
  అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాక్షలు.

  రిప్లయితొలగించండి