13, జనవరి 2015, మంగళవారం

పద్యరచన - 789

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

 1. ముద్దు లొలికించు బిల్లలు ముందు గలుగ
  తిష్ట వేసి కొ నియునట తీరుబడిగ
  జెప్పు చుండెను వారికి చిన్ని కధలు
  బామ్మ యచ్చట చూ డుడో యమ్మ లార !

  రిప్లయితొలగించండి
 2. బామ్మనబాధ్యతాయుతపుభావనగల్గినభాగ్యమేగ?లో
  కమ్మునమంచిచెడ్డలను,కష్టపు,నష్టపు " జీవితాలనే
  నమ్మకమందుమార్చు కథ"నవ్యపురీతిగపిల్లవాల్లకున్
  సమ్మతిగూర్చునీతిమనసందునజేర్చునుమాటతీరునన్

  రిప్లయితొలగించండి
 3. బాల్య మందు కథలు బామ్మ నోట వినగ
  మంచి స్పూర్తి నిచ్చి మతిని బెంచు
  పెద్ద వారు యున్న పెన్నిధే యున్నట్లు
  నిజము నెరుగ వలయు నేటి తరము

  రిప్లయితొలగించండి
 4. కాశి మజిలీల కథలును కనగ పంచ
  తంత్ర కథలును బామ్మయే తనివి దీర
  చెప్పుచుండగను చలన చిత్రమువలె
  పిల్లలందరి కనుభూతి వెల్లి విరియు.

  రిప్లయితొలగించండి
 5. కమ్మని మాటల తోడుత
  నమ్మమ్మ నుడివెడు కథల నానందముతో
  నిమ్ముగ వినుచున్ స్థిరముగ
  బొమ్మలవలెనుండిరింటి ముంగిట కనుడీ

  రిప్లయితొలగించండి
 6. పౌరాణిక,చారిత్రక
  సారమ్మగు నీతి కథల సంొధ్యా వేళన్
  దీరిచి పెద ముత్తైదువ
  కూరిమితో జెప్పె వారుఁ గూడగ ప్రగతిన్!

  రిప్లయితొలగించండి
 7. పంచతంత్రఁపు కథల్ పసిపిల్లలకు జెప్పి
  ......... లౌక్యంబు నేర్పు లలామ తాను
  రామాయణార్థముల్ రసరమ్యుగజెప్పి
  ......... ధర్మంబులెఱిఁగుంచు తరుణి తాను
  పంచమవేదమౌ భారతమ్మును దెల్పి
  ......... రాజనీతిని నేర్పు రమణి తాను
  నీతి శతకములన్ ప్రీతిగ జెప్పించి
  .......... నిజధైర్యముల బెంచు నేర్పు తాను

  విక్రమాదిత్యు కథలెల్ల వివరమిచ్చి
  తెలుగు సామెతలెల్లను తేటఁ బరచి
  నెఱపె నిల "చందమామ" గా నిత్యముగను
  నుతులనర్పింతు "బామ్మల" కతుల

  రిప్లయితొలగించండి
 8. అనగనగా నొక యూళ్లో
  ననుచు మొదలుపెట్టి కధలనల్లుచు వినిపిం
  చును బామ్మలుతాతలునవి
  విని హాయిగ నిద్రపోవు పిల్లలు నిశలన్

  రిప్లయితొలగించండి
 9. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పిల్లలు’ టైపాటు వల్ల ‘బిల్లలు’ అయింది.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పిల్లవారికిన్’ అనండి.
  ****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పెద్దవారు + ఉన్న’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. అక్కడ ‘పెద్దవార లున్న’ అనండి.
  ****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ సీసపద్యం వివరంగా మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
  పద్యం చివర ‘భక్తి’ టైప్ చేయడం మరిచినట్టున్నారు. అక్కడ ‘విమలభక్తి’ అని కదా ఉండవలసింది?
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. గురువుగారూ,

  ప్రణామములు. భక్తిఁ అని వ్రాశాను కానీ copy చేయడములో miss అయింది.

  మీ అభినందనకు ధన్యవాదములు గురువు గారూ

  రిప్లయితొలగించండి