భోగ భాగ్యములు గలుగు భోగి నాడు సిరియు సంపద లువిరియు శివుని గృపను పెద్ద పండుగ రోజున , నిధ్ధరణి ని పాడి పంటల వృద్ధియు బాగు గాను కనుము దినమున మొదలిడు ననుట నిజము .
సంక్రాంతి శుభా కాంక్షలు సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్ సంక్రాంతి మూడు రోజులు శంకరు నే వేడు కొనుడు సహ చరు లారా !
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు. ‘బుడుబుక్కల’ అన్నచోట గణదోషం. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
భోగ భాగ్యములు గలుగు భోగి నాడు
రిప్లయితొలగించండిసిరియు సంపద లువిరియు శివుని గృపను
పెద్ద పండుగ రోజున , నిధ్ధరణి ని
పాడి పంటల వృద్ధియు బాగు గాను
కనుము దినమున మొదలిడు ననుట నిజము .
సంక్రాంతి శుభా కాంక్షలు
సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్
సంక్రాంతి మూడు రోజులు
శంకరు నే వేడు కొనుడు సహ చరు లారా !
క్రొత్త రకముల ముగ్గులు కోరి కోరి
రిప్లయితొలగించండిబాల బాలిక లందఱు బ్రమద మలర
వేయు చుండిరి లోగిళ్ళ వేకువనన
నేర్చు కొనినట్టి ముగ్గులు నెలతులునట
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి, కవి మిత్రులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిపూజ్య గురుదేవులకు, కవిమిత్రులందరికీ... సంక్రాంతి ... శుభాకాంక్షలు..
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరంగైన వస్త్రాలు హంగుగా ధరియించి
రిప్లయితొలగించండి...... బసవన్నలాడునీ పర్వదినము
రంగుల గొబ్బిళ్ళ రంగవల్లులతోడ
...... ముంగిళ్ళు జూడంగ ముచ్చటగును
మావిపత్రములన్ని మాలలై శోభిల్లు
........ద్వారబంధములపై తీరుగాను
పట్టు చీరలుగట్టి పార్ధివిని గొలిచి
.......పసుపుకుంకుమబంచు పడతులంత!!!
మకర సంక్రాంతి శుభవేళ మరల వచ్చి
మకర రాశిన చేరును మర్కుడిపుడు
భోగి సంక్రాంతి కనుమలు భోగములిడ
మూడు రోజుల పండగ వేడుకగును !!!
సంక్రాంతి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిసంక్రాంతియెసిరులనొసగి సౌఖ్యము లిచ్చున్
సంక్రాంతి యశము నీయగ
సంక్రాంతియె కాంతినొసగు సర్వుల కిలలో!!!
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిరంగుల మ్రుగ్గులు నేల, ప
తంగులు చూడంగ నింగి,ధన ధాన్యములే
హంగుగ గృహముల నిండగ
బంగారపు పౌష్య లక్ష్మి పల్లెల నడచెన్.
ముంగిటముగ్గులున్నిడుచు|ము చ్చటగొల్పెడికన్య,కాంతలున్
రిప్లయితొలగించండిసంగమమేగ?సంక్రమణసాకెడిసంపదభక్తిశ్రద్దలే
ప్రాంగణమంతటన్,పరమపావనమవ్వగ?గొబ్బిపూజలున్
అంగనలందుహాయిగన?నాశివుడైననుమెచ్చుపండుగన్|
వేయి కరాల వేల్పు వినువీధిని ఠీవిగ సాగు నల్లదే
రిప్లయితొలగించండిశ్రేయము గూర్చ లోకులకు శీఘ్రముగా మకరాఖ్య రాశి వేం-
చేయుటకై వసుంధరయు శ్రీకరమౌ నవ కాంతు లీనెడిన్
హాయి నొసంగు భాస్కరున కౌదల వంచి నమస్కరించెదన్.
మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిశుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవపద్యం చివరిపాదంలో ప్రాస తప్పింది. ‘సంక్రందననుతుఁడు శివుఁడు సత్కృపతోడన్’ అందామా?
****
శైలజ గారూ,
చక్కని సీసపద్యాన్ని, కందాన్ని అందించి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం హృద్యంగా ఉంది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
****
మిస్సన్న గారూ,
‘హాయి నొసంగు పద్య మిది యందఁగదే యభినందనమ్ములన్’
కవి మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు,గురువర్యులకు ప్రణామములు
రిప్లయితొలగించండిఆ.వె. పౌష్య లక్ష్మి శోభ పరికించుడీ యింటి
ముందు గొబ్బియ వలె ముగ్గుపైన,
బండి పైనవడ్ల బస్తాలలో యెడ్ల
బండి దౌడు నందు భజన యందు,
బంతిపూలనందు యింతిసౌరు నందు
గాలిపటము లాట లీలలందు
మకర రాశి జేరు మార్తాండు కౌగిలి
ఉత్తరాయణ౦పు టుత్సుకమున
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘బంతిపూలయందు’ అనండి.
సీ.
రిప్లయితొలగించండిపాడి పంటలొసగి ప్రార్ధింప భక్తితో
సిరిసంపదలుపొంద సేద్య కాడు
శుభముతో సంక్రాంతి శోభనే గూర్చగ
విరివితో గొబ్బిళ్ళు వీధి వీధి
అందము చిందించు హరిదాసుపలుకులు
పందెము సరదాలు పల్లె లందు
గాలి పటమ్ములు గగనమ్ము లకెగరు
గ్రామాన తిరుగాడు గంగిరెడ్లు
తే. గీ.
మకర సంక్రాంతి పాడగ మధుర గీతి
పంట పండగ చూడాలి పల్లె పల్లె
భోగ భాగ్యమ్ముపొందాలి పుడమి తల్లి
సహన శీలులు కావాలి సకల జనులు
కవి మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు,గురువర్యులకు ప్రణామములు
రిప్లయితొలగించండిసవరించిన పద్యము
ఆ.వె. పౌష్య లక్ష్మి శోభ పరికించుడీ యింటి
ముందు గొబ్బియ వలె ముగ్గుపైన,
బండి పైనవడ్ల బస్తాలలో యెడ్ల
బండి దౌడు నందు భజన యందు,
బంతిపూలయందు యింతిసౌరు నందు
గాలిపటము లాట లీలలందు
మకర రాశి జేరు మార్తాండు కౌగిలి
ఉత్తరాయణ౦పు టుత్సుకమున
జనవరి 15, 2015 11:47 [AM]
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చూడాలి, పొందాలి, కావాలి’ అని వ్యావహారికాలను ప్రయోగించారు.
ధాన్యంపు రాశులొసగక
రిప్లయితొలగించండిశూన్యము లయ్యెను పొలములఁ జూడగలేరో,
యన్యుల సంస్కృతినెల్లరు
ధన్యత జీతములలోనె దర్శించుటచే!
మరల యొకనాడు జనులందు మరలి రాదె
స్వీయ వృత్తిని మన్నించు స్వేచ్ఛ నిచ్ఛ?
పనిని గారవించు మనోవృత్తి పరగనుండ
నేల రాకుండుననితోచు నెప్పుడైన.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవపద్యం మూడవపాదంలో గణదోషం. ‘పనిని గారవించెడి బుద్ధి పరగనుండ’ అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపంటలన్నియు గూడ యింటిలోనికిఁ జేరి
రిప్లయితొలగించండికాపుకనుల వెల్గు కాంచు రోజు
ధన ధాన్యములను సంతసముగ పంచుచు
పనివారి సంతృప్తి పరచు రోజు
యతివలందరు జేరి యానందముగ గృహి
ముగ్గులేయుచు కడు మురియు రోజు
క్రొత్త యల్లుళ్ళకు క్రొత్తబట్టలఁబెట్టి
యత్తలు సంతస మందురోజు
గారెలునుపులిహోరలు కమ్మనైన
యరిసెలను పాయసమ్ముల నారగించి
గాలిపటములతోనాడి కరము తుష్టి
తెలుగు వారలు సంక్రాంతి సలుపు చుంద్రు
గురువర్యులకు ధన్యవాదములు , వ్యవహార భాషను మార్చినాను. మన్నించాలి
రిప్లయితొలగించండిమకర సంక్రాంతి పాడగ మధుర గీతి
పంట పండగ జేయగ పల్లె పల్లె
భోగ భాగ్యమ్ముబొందగ పుడమి తల్లి
సకల జనులను గాపాడు సాధు బుద్ధి
గురువుగారూ ధన్యవాదములు
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ సవరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారు....
రిప్లయితొలగించండిపూర్వపు బాధలన్ భోగి మంటల గాల్చి
రిప్లయితొలగించండియుత్సాహ మొందుచు నురక లేయ!
ధాన్యరాశులుఁ బండ ధరణిమాతను గొల్వ
గొబ్బిల్లఁ జేర్చగఁ గూర్మి తోడ!
రంగవల్లుల హోళి రంజిల్ల జేయగ
గాలి పటమ్ములు గాంచ నెగుర!
సంక్రాంతి లక్ష్మిని సత్కీర్తనల తోడ
హరిదాసు మురియుచు నాల పించ!
గంగి రెద్దుల గెంతులూ హంగు గూర్చ!
నల్లుడింటికి కూతుతో నరుగు దెంచ
పిండి వంటలు జిహ్వలన్ ప్రేమ నలర!
మోదమందని దేదయా పుడమి పైన!
సక్రాంతి రెండవరోజు మరోసారి శుభాకాంక్షలతో ++++++++++
రిప్లయితొలగించండిసక్రాంతి లక్ష్మికి స్వాగతంబును జెప్పు
ముంగిట్ల ముత్యాల మ్రుగ్గు జూడ
గతకాల బాధను గడతేర్చ నడివీధి
భోగిమంటల భక్తి పూజ జూడ
ఉత్సాహమున రైతులూరి వెల్పల బెట్టు
బండెడ్ల పరుగుల పణము జూడ
జంగమ దేవర్లు చనుదెంచి శంఖము
నూది యాచన జేయు యుక్తి జూడ
సోదె కత్తెల, బుడుబుక్కల సోది వినుచు
భామలెల్ల సంతోషమ్ము పడుట జూడ
తెలుగు వారల సంస్కృతి తెలిసి వచ్చు
తెలుగు బిడ్డడు సంస్కార వెలుగు బిడ్డ.
కెఎస్ గురుమూర్తి ఆచారి గారి పద్యము
రిప్లయితొలగించండిరంగు రంగుల రంగ వల్లరుల నెల్ల
రంగరి౦పగ నంగనల్ ప్రాంగణమున
మకర సంక్రాంతి మన కిడె నికరముగను
సకల శుభముల సుఖముల సంతసములు
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
‘బుడుబుక్కల’ అన్నచోట గణదోషం.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
చక్కని సవరణకు ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండి