1, ఏప్రిల్ 2013, సోమవారం

సమస్యాపూరణం – 1011 (కరి సింహము నెక్కి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కరి సింహము నెక్కి దైత్యగణములఁ దునిమెన్.
(శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి "అవధాన వాణి" గ్రంథం నుండి)

31 కామెంట్‌లు:

 1. వరగర్వములన్ దైత్యులు
  సురలను బాధించుచుండ సురపతి వేడన్
  అరివీర భయంకరి శం
  కరి సింహము నెక్కి దైత్య గణముల దునిమెన్

  రిప్లయితొలగించండి
 2. ఉరు దివ్యాయుధ ధారిణి
  పరమేశ్వరి విక్రమాఢ్య భవభయ నాశం
  కరి శత్రుల కమిత భయం
  కరి సింహమునెక్కి దైత్య గణముల దునిమెన్

  రిప్లయితొలగించండి
 3. సుర నర గణములు వేడుచు
  పరమేశ్వరి దరికి జేరి పాహీ యనగా
  కరుణను నభయమ్మిడి శాం
  కరి సింహమునెక్కి దైత్య గణముల దునిమెన్.

  రిప్లయితొలగించండి
 4. నర సురుల పాలి కీడై
  వర బల గర్వమ్ము మీరి వరలెడు మహిషా-
  సురు నణ చిన దుర్గ! శుభం-
  కరి! సింహము నెక్కి దైత్య గణముల దునిమెన్

  రిప్లయితొలగించండి
 5. వరబలగర్వితులసురుల
  పరిమార్చుముతల్లియంచు ప్రార్ధింపంగా
  వరమిచ్చి సురలకు శుభం
  కరి సింహమునెక్కి దైత్యగణముల దునిమెన్.

  రిప్లయితొలగించండి
 6. విశేషముగా మమ్ములనభినందించిన మురళీధరరావుగారికి, మూర్తిగారికి, మిస్సన్నగారికి , ఇతరమిత్రులకు
  ధన్యవాదాలను తెల్పుకొనుచున్నాను.


  పరమేశ్వరి శంకరి శుభ
  కరి, హరి హరాదులఁ గన్న కళ్యాణియె దా
  కరుణను వీడె, దుష్ట భయం
  కరి సింహము నెక్కి దైత్యగణములఁ దునిమెన్.

  రిప్లయితొలగించండి
 7. అరిగణము లసురు లయ్యిరి
  సురగణములు నరులతోడ స్రుక్కిరి జగతిన్
  హరి తురగమయ్యె : శుభశం
  కరి సింహము నెక్కి దైత్య గణముల దునిమెన్ !

  రిప్లయితొలగించండి

 8. సురముని వ్రాతము నిరతము
  భరియించక దనుజ హింస భయకంపితులై
  మొరపెట్టగ వచ్చెను శాం
  కరి సింహము నెక్కి దైత్యగణములఁ దునిమెన్.

  రిప్లయితొలగించండి
 9. విరివిగ చెరకును దిను నట
  కరి, సింహము నెక్కి దైత్యుల దునిమెన్
  అరి వీర భయంకరి , యా
  వరము లనే నీ యు తల్లి బాణము తోడన్ .

  రిప్లయితొలగించండి
 10. అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
  శుభాశీస్సులు.

  మీ పద్యము బాగుగ నున్నది. 5వ గణము (2వ పాదములో 2వ గణము) జగణము అగుటతో లక్షణమునకు విరుద్ధముగా నున్నది. కాస్త సరిచెయ్యండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. సురవరులకు సచ్ఛుభకరి
  నిరతంబును శాంతమూని నిర్మలమతులై
  తిరిగెడు భక్తుల కభయం
  కరి సింహమునెక్కి దైత్యగణముల దునిమెన్.

  రిప్లయితొలగించండి
 12. సురవరులకు సచ్ఛుభకరి
  నిరతంబును శాంతమూని నిర్మలమతులై
  తిరిగెడు భక్తుల కభయం
  కరి సింహమునెక్కి దైత్యగణముల దునిమెన్.

  రిప్లయితొలగించండి
 13. సవరించిన పద్యము

  పరమేశ్వరి శంకరి శుభ
  కరి, హరిహరులను సృజించు కళ్యాణియె దా
  కరుణను వీడె, దుష్ట భయం
  కరి సింహము నెక్కి దైత్యగణములఁ దునిమెన్.

  రిప్లయితొలగించండి
 14. లక్ష్మీ దేవి గారూ!
  శుభాశీస్సులు.
  మీరు చేసిన సవరణ బాగుగ నున్నది. 3వ పాదములో కూడ గణభంగము ఉన్నది. దానిని కూడా సవరించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి


 15. దురితాత్ములు,మహిషాదులు,
  వరగర్వముచే సురలను బాధింపగ ,శాం
  కరి దుర్గాదేవి,భయం
  కరి,సింహమునెక్కి దైత్యగణముల దునిమెన్.

  రిప్లయితొలగించండి
 16. సోదరి శ్రీమతి లక్ష్మీ దేవిగారికి
  నేను సరిగా కొంపలో లేనందున బ్లాగును సరిగా వీక్షించ లేక పోయాను . మాన్యు లైన గురువుల ప్రశంస లందు కొన్న మీకు నా శుభాభి నందనలు [ఆలస్యం గా ]

  రిప్లయితొలగించండి
 17. అయ్యా,
  మన్నించండి. ఈరోజు ఏమో ఇట్లా వ్రాస్తున్నాను.

  పరమేశ్వరి శంకరి శుభ
  కరి, హరిహరులను సృజించు కళ్యాణియె దా
  కరుణను విడె, దుష్ట భయం
  కరి సింహము నెక్కి దైత్యగణములఁ దునిమెన్.

  దరిఁజేరినవారి యెడల
  కరుణను కురిపించు జనని, కామేశ్వరి , రౌ
  ద్రరసముఁ గురియగ రణ భీ
  కరి సింహము నెక్కి దైత్యగణములఁ దునిమెన్.

  అక్కయ్యా,
  ధన్యవాదాలు. మీ వంటి సహృదయుల ఆశీస్సులు తమంత తామే మమ్ముఁ జేరవా ఏమి?

  రిప్లయితొలగించండి
 18. నర మాంస బక్షకు లగు య
  సురులమద మణచి సురల శోభను గూర్చన్ !
  పరమేశు నిసతి యగుశం
  కరి సిం హము నెక్కి దైత్య గణములఁ దునిమెన్ !

  రిప్లయితొలగించండి
 19. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  గిరినందిని! భవభంజని!
  పరమదయాకరి! మృడాని! పరమేశ్వరి! శం
  కరతోషిణి! సుర కరుణా
  కరి! సింహము నెక్కి దైత్యగణములఁ దునిమెన్.

  రిప్లయితొలగించండి
 20. వరగర్వితుడై మహిషుడు
  సురలందరినెంతగానొ శొక్కింపంగా
  సురరక్షణచేయగ శాం
  కరి సింహమునెక్కి దైత్య గణములదునిమెన్.

  రిప్లయితొలగించండి
 21. కవిమిత్రులకు నమస్కృతులు.
  అత్యవసరమైన పనుల వలన వ్యస్తుడనై మిత్రుల పూరణలను, పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. వీలైతే ఈ సాయంత్రం వరకు ప్రయత్నిస్తాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 22. అమ్మా! రామలక్ష్మి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. "శొక్కింపంగా" అని వాడేరు కదా. "శ" వర్ణము తత్సమ శబ్దములలోనే వాడదగును. శలవు, శనగలు మొదలగు ప్రయోగములు సాధువులు కావు. సెలవు, సెనగలు అని వాడవలెను. స్రుక్కింపంగా అని వాడవచ్చును లేదా తత్సమమైన "శుష్కింపంగా" అని వాడనగును. పరిశీలించండి. స్వస్తి

  రిప్లయితొలగించండి
 23. లచక్కని పూరణలు చెప్పినవి కవిమిత్రులు .....
  నాగరాజు రవీందర్ గారికి,
  పండిత న్నాను వారికి,
  గోల్ హనుమచ్ఛాస్త్రి గారికి,
  మిస్సన్న గారికి,
  పింగళి శశిధర్ గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  గన్నవరపు నరసింహమూర్తి గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  సుబ్బారావు గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  కమనీయం గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం శర్మ గారికి,
  డా. ప్రభల రామలక్ష్మి గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 24. గోలా వారూ,
  పండిత నేమాని వారూ,
  టైపాటుకు మన్నించాలి.

  రిప్లయితొలగించండి
 25. శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారి వలె పద్యపూరణలు చేయగలగడమే నా గోల్ గురువుగారూ ! అన్యదేశ్యములు వాడినందులకు వారు క్షమిస్తారనే నమ్మకముతో;

  రిప్లయితొలగించండి
 26. పండిత నేమాని గురువులకు నమస్కారములు, మీసూచనప్రకారం సవరించుచూ.....

  వరగర్వితుడై మహిషుడు
  సురలందరినెంతగానొ శుష్కింపంగా
  సురరక్షణచేయగ శాం
  కరి సింహమునెక్కి దైత్య గణములదునిమెన్.

  రిప్లయితొలగించండి
 27. అరి సంహారము జేయగ
  మురిపెముతో నమితుషాను
  మోడియె నెక్కన్
  హరిహరులు జూసి నుడివిరి:
  "కరి సింహము నెక్కి దైత్యగణములఁ దునిమెన్"

  రిప్లయితొలగించండి