పిల్లల ప రీ క్ష రోజులుఉల్లములం బదిల పఱచి యురు విషయములన్చల్లగ గూర్చుని హాలునమెల్లగ నిక వ్రాయు చుండ్రు మెదలక యుండన్ .
శారద కరుణాదృష్టినికోరిన వారికి సుకరము, కోటి పరీక్షల్భారమ్ముగఁ దోచక, నేమారక విజయము లభించు మంగళమబ్బున్.
పిల్లల పరీక్షలు........... ( ముఖ్యంగా ప్రయివేటు పాఠశాల పరీక్షల గురించి ) జోలపాటలయందు తేలియాడెడు కూనపుస్తకాంబుధి యందు మునిఁగిపోయెముద్దు మాటలఁబల్కు మురిపాల చిన్నారివ్యాకరణంబులఁ వల్లెవేసె నాటపాటలయందు తోటిబాలురతోడికలయాడు పసిపాప కలముఁ బట్టెఁచిరునవ్వులొలికించు చిన్నారి పసికందురాగమోహంబుల సాగిపోయె రివ్వుమనిసాగె పోటీ పరీక్షలందుక్షణము తీరిక లేని దుస్సాహసమిది పెద్దలింకైన గాంచుడీ! భీతిఁ జెంది డస్సినారిక చాలు పాఠాలు నేడు.
పరీక్ష వ్రాయగ పిల్లలు నిరీక్షణ ముగిసె గాన నెమ్మిక మీరన్ ! బరువుల చదువులు ముగియగ సరదాలకు పరుగు లిడుచు సంతస మొందన్ !
పిల్లకు పరీక్ష నిజముగతల్లికి సంకటము నేడు! తండ్రికి జూడన్ తల్లడ మట్టి దినంబుల! నిల్లొక నిర్బంధ వసతి యేమను వాడన్?
లక్ష్యసాధనె నాయొక్క లక్ష్యమనుచుసద్దు చేయక చదువును శ్రద్ధగానుపిల్లులౌదురు ఎంతటి పిల్లలైనపిల్లల పరీక్ష పెద్దలకెల్ల రక్ష.
పిల్లల పరీక్షలు అన్న అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....సుబ్బారావు గారికి, లక్ష్మీదేవి గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, మిస్సన్న గారికి, ప్రభల రామలక్ష్మి గారికి, అభినందనలు, ధన్యవాదాలు.
పిల్లల ప రీ క్ష రోజులు
రిప్లయితొలగించండిఉల్లములం బదిల పఱచి యురు విషయములన్
చల్లగ గూర్చుని హాలున
మెల్లగ నిక వ్రాయు చుండ్రు మెదలక యుండన్ .
శారద కరుణాదృష్టిని
రిప్లయితొలగించండికోరిన వారికి సుకరము, కోటి పరీక్షల్
భారమ్ముగఁ దోచక, నే
మారక విజయము లభించు మంగళమబ్బున్.
పిల్లల పరీక్షలు........... ( ముఖ్యంగా ప్రయివేటు పాఠశాల పరీక్షల గురించి )
రిప్లయితొలగించండిజోలపాటలయందు తేలియాడెడు కూన
పుస్తకాంబుధి యందు మునిఁగిపోయె
ముద్దు మాటలఁబల్కు మురిపాల చిన్నారి
వ్యాకరణంబులఁ వల్లెవేసె
నాటపాటలయందు తోటిబాలురతోడి
కలయాడు పసిపాప కలముఁ బట్టెఁ
చిరునవ్వులొలికించు చిన్నారి పసికందు
రాగమోహంబుల సాగిపోయె
రివ్వుమనిసాగె పోటీ పరీక్షలందు
క్షణము తీరిక లేని దుస్సాహసమిది
పెద్దలింకైన గాంచుడీ! భీతిఁ జెంది
డస్సినారిక చాలు పాఠాలు నేడు.
పరీక్ష వ్రాయగ పిల్లలు
రిప్లయితొలగించండినిరీక్షణ ముగిసె గాన నెమ్మిక మీరన్ !
బరువుల చదువులు ముగియగ
సరదాలకు పరుగు లిడుచు సంతస మొందన్ !
పిల్లకు పరీక్ష నిజముగ
రిప్లయితొలగించండితల్లికి సంకటము నేడు! తండ్రికి జూడన్
తల్లడ మట్టి దినంబుల!
నిల్లొక నిర్బంధ వసతి యేమను వాడన్?
లక్ష్యసాధనె నాయొక్క లక్ష్యమనుచు
రిప్లయితొలగించండిసద్దు చేయక చదువును శ్రద్ధగాను
పిల్లులౌదురు ఎంతటి పిల్లలైన
పిల్లల పరీక్ష పెద్దలకెల్ల రక్ష.
పిల్లల పరీక్షలు అన్న అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిసుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
మిస్సన్న గారికి,
ప్రభల రామలక్ష్మి గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.