25, ఏప్రిల్ 2013, గురువారం

పద్య రచన - 322 (చంద్ర గ్రహణము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“చంద్ర గ్రహణము”
ఈ అంశాన్ని పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

10 కామెంట్‌లు:

 1. రాజుకైనను కాలమ్ము రాక కలసి
  మాటునుండగ వలెనను మాట నిజము
  గ్రహణ కాలము వీడంగ కాంతి విరిసి
  నూత్న తేజంపు వెన్నెల నోలలాడు

  రిప్లయితొలగించండి


 2. రాహు వనువాడు తమ వైపు రాక వలన
  చూచి చెప్పెను చంద్రుడు చూడ్కు లనన
  అంత విష్ణువు ఖండిం చ నతని శిరసు
  రాహు కేతువు లయ్యిరి రమ్యముగను .

  కోపము జెందిన రాహువు
  పాపిగ నిక చంద్రు దలచి పట్టుచు నుండెన్
  కోపన ప్రతి వత్సరమును
  ప్రాపుగ మఱి యయ్యె చంద్ర గ్రహణము గాగన్ .
  ----------------------------------

  భూమి తనచుట్టు దిరుగుచు భువన మందు
  ఉండు చంద్రున కిల యడ్డ ముండు గతన
  చంద్ర గమనపు మార్గము సరిగ లేక
  గ్రహణ మేర్పడి చీ కటి కాని పించు .

  రిప్లయితొలగించండి
 3. భూమి నీడ పడగ పున్నమి చంద్రుడు
  కాంతి లేక మిగులు గగన మందు
  గ్రహణ మన్న దటుల గ్రహముల కేనుండ
  మట్టి విగ్రహ మైన మనిషి యెంత?

  రిప్లయితొలగించండి

 4. 1. రాజువైనగాని రగడు తప్పదు నీకు
  నిన్ను మ్రింగవచ్చు నేటి రాత్రి
  కాని,కడకు విడచు ,కక్ష తీరిన వెంట
  చంద్ర,కొనుమ నాదు సానుభూతి.

  2.ధరణి ఛాయ కొంత తడవు పైబడినంత
  గ్రహణమట్లు మనకు గానిపించు
  శాస్త్రసమ్మతమ్ము,సర్వులకు విదితమ్ము
  గ్రహణ గాథ యెల్ల కట్టుకథయె.

  రిప్లయితొలగించండి
 5. నెలరాజును కబళింపగ
  నల గగనమునందు రాహువనువాడొకడా
  కలితో వచ్చునట; విడి మ
  రలి పోవుననెడు కథలవి రమ్యము లౌనే?

  రిప్లయితొలగించండి
 6. వ్యోమ మందు గలుగు సోమోపరాగంబు
  భూమివారి కగును పుణ్యదంబు
  మంత్రసిద్ధినొసగు మహిమను చేకూర్చు
  ధ్యానమగ్నులైన మానవులకు

  రిప్లయితొలగించండి
 7. రాహు కేతువు లనబడు రక్క సులకు
  సూర్య చంద్రుల కబళించ చోద్య మనగ
  వసుధ యడ్డుగ నిలబడి వాదు లాడ
  గగన మందున నెలవంక సగము మిగిలె

  రిప్లయితొలగించండి
 8. ఒక పక్షము చంద్రుని గ్రహణం తొలగ కోరె
  యిక వేరొక పక్షము రాహువు రాక కోరె,తా
  నొక్కడే భారతమ్ముకు నరేంద్రునని ఒకరు నుడివె
  తికమకలో జనుల మతులు మునిగిపోయే

  రిప్లయితొలగించండి
 9. చంద్రగ్రహణం గురించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  సహదేవుడు గారికి,
  కమనీయం గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  టి.యం. రవీంద్ర గారూ,
  మీరు వెలిబుచ్చిన భావం బాగుంది. వీలైతే ఈ సాయంత్రంలోగా దానికి పద్యరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

  రిప్లయితొలగించండి