8, ఏప్రిల్ 2013, సోమవారం

సమస్యాపూరణం – 1017 (ఒంగోలున నుండు జనుల యోగ్యులు స్తుతికిన్.)


22 కామెంట్‌లు:

  1. రంగానంద స్వామియె
    ఒంగోలున నుండు, జను లయోగ్యులు స్తుతికిన్
    రంగగు స్తుతికే యర్హుడు
    బంగారము వంటి యొక్క భగవంతుడనెన్.

    రిప్లయితొలగించండి
  2. సింగార గిత్తలిదివర
    కొంగోలున నుండు; జను లయోగ్యులు స్తుతికిన్
    బంగారపు యా సిరిని
    బ్భంగి నిరాదరణఁ జేయు ఫలమిది కాదే?

    రిప్లయితొలగించండి
  3. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    శుభోదయప్రణామములు!

    ఒంగోలు మా ఏల్చూరికి సమీపంలోనే ఉన్నది!

    సంగాతిపరులు, వాఙ్మయ
    సంగీతనిధులు, సుమతులు, సత్పురుషుల తో
    డంగనలుఁ గష్టజీవిక;
    నొంగోలున నుండు జనుల యోగ్యులు స్తుతికిన్.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సమస్యను విరిచి మంచి ప్రయత్నమే చేసారు. కాని సమస్య ఉత్తరార్ధమైన ‘జను లయోగ్యులు స్తుతికిన్’ అన్నదానికి అన్వయం కుదరడం లేదని అనుమానం. ఒకసారి పరిశీలించండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘బంగారపు + ఆ సిరి’ అన్నప్పుడు టుగాగమం వచ్చి ‘బంగారపు టా సరి’ అవుతుంది.

    రిప్లయితొలగించండి
  5. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. కవిమిత్రులకు మనవి...
    నేనీరోజు మా అత్తగారి ఊరికి అక్కడి ఒక ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్తున్నాను. రెండు రోజులు అక్కడే ఉంటాను. అది పూర్తిగా పల్లెటూరు కనుక ఇంటర్నెట్ సౌకర్యం దొరకదు. కావున రేపు బ్లాగులో సమస్య, పద్యరచన శీర్షికలుండవు. అక్కడికి దగ్గర్లో ఉన్న వర్ధన్నపేటలో ఉంటే అవకాశం దొరికితే పోస్ట్ చేస్తాను. అసౌకర్యానికి మన్నించండి.
    మిత్రులెవరైనా సమస్యను, పద్యరచన శీర్షికను పోస్ట్ చేసే ఉత్సాహం ఉన్నవారు తమ మెయిల్ ఐడి తెలియజేస్తే వారికి నా బ్లాగు యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఇస్తాను.

    రిప్లయితొలగించండి
  7. సింగము! భళిర !ప్రకాశము
    కొంగర జగ్గయ్య యనెడి కొండొక నటుడో !
    ఠంగని పలికిరి కదరా !
    ఒంగోలున నుండు జనుల! యోగ్యులు స్తుతికిన్.

    రిప్లయితొలగించండి
  8. గన్నవరపు నరసింహమూర్తి గారూ,
    ‘జనులే’ అన్న అర్థంతో విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. బంగారు విలువ గిత్తలు
    ఒంగోలున నుండు, జనుల యోగ్యులు స్తుతికిన్
    చెంగావి రంగు ధోవతి
    నంగాంగము గప్పు గొనుచు నార్భా టించన్ .

    రిప్లయితొలగించండి
  10. శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు రేపు సమస్యను, పద్యరచనాంశాన్ని పోస్ట్ చేయడానికి సంసిద్ధతను తెలియజేసారు. వారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ,
    ఆర్భాటాన్ని ప్రదర్శించేవారు అయోగ్యులన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. ఊరికి బయల్దేరుతున్నాము. పునర్దర్శనం ఎల్లుండి... సెలవు!

    రిప్లయితొలగించండి
  13. సంగీతజ్ఞులు, సజ్జను
    లొంగోలున నుండు జను, లయోగ్యులు స్తుతికిన్
    సంగతి గ్రహియించక బహు
    భంగుల నవ్వారి దూరు వారలు భువిలో

    రిప్లయితొలగించండి
  14. భృంగీశు జపతపంబుల
    నంగీకృత బుద్ధితోడ ననయము మదిలో
    సాంగము జేయుదు రధికత
    నొంగోలున నుండు జనుల! యోగ్యులు స్తుతికిన్.

    రిప్లయితొలగించండి
  15. పుంగవములు ఘనమైనవి
    యొంగోలున నుండు గాదె! యూరక లేరే
    వెంగలు లచ్చట ! ? కారే
    యొంగోలు జను లయోగ్యులు స్తుతికిన్ ! ?

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములు జేయుచూ
    ====*=======
    బంగారు వర్ణ గిత్తలు
    లొంగోలున నుండు,జనుల యోగ్యులు స్తుతికిన్
    శృంగారమున మునుగ స
    స్సాంగత్యము జేరుగ చెరసాలకు మహిలో।

    రిప్లయితొలగించండి
  17. ఆర్యా ! ధన్యవాదములు.
    సామాన్య జనులు స్తుతికి అనర్హులు.. భగవంతుడొక్కడే స్తుతికి అర్హుడు ..అని ఒంగోలున నుండు రంగానంద స్వామి చెప్పాడని నాభావం.

    చిన్న సవరణ తో..

    రంగానంద స్వామియె
    ఒంగోలున నుండు, జను లయోగ్యులు స్తుతికిన్
    హంగుగ స్తుతికే యర్హుడు
    బంగారము వంటి యొక్క భగవంతుడనెన్.

    రిప్లయితొలగించండి
  18. రంగైన జాతి గిత్తలు!
    సింగముగా పేరు పొంది చెలరేగిన యా
    బంగారు పంతులొకరై
    యొంగోలున నుండు జనుల! యోగ్యులు స్తుతికిన్!

    రిప్లయితొలగించండి
  19. శ్రీనేమాని పండితులకు, శ్రీ ఏల్చూరి మహోదయులకు శ్రీశంకారార్యులకు మిత్రులకు ప్రణామములతో శంకరాభరణ బ్లాగు పాఠశాలకు ఒక దినమైనా సెలవు ప్రకటింప రాదనెడి సంకల్పముతో, పంచాయితీ ఎన్నికల ప్రారంభసన్నాహ ముమ్మర కార్యక్రమున ఉన్ననూ శ్రీశంకరార్య గురువుల పరోక్షమున ఈ సాహసము చేయుచున్నాను. గుణములన్నియూ పెద్దల ఆశీస్సులు. దోషములన్నియూ నావిగా భావించి మన్నింప ప్రార్థన.
    బుధజనవిధేయుడు,
    మీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.
    హరి మూర్తి గారూ! సత్పురుషులను విమర్శించు వారలయోగ్యులన్న మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.

    సంపత్ కుమార్ శాస్త్రిగారూ! చాల ప్రశస్తముగా చెప్పారు. అంగీకృత బుద్ధి అని లోతైన భావంతో ప్రయోగించారు. తన బుద్ధి అంగీకరించిన మనిషి ఆ పనిని చాల నిబద్ధతతో చేస్తాడు గదా! అభినందనలు.

    నాగరాజు రవీందర్ గారూ! ప్రపంచఖ్యాతి తెచ్చిన ఒంగోలు “గిత్త “లున్నచోటే ఒంగోలు వెర్రివెంగ”ళప్ప”లున్నారన్నారు౤ బాగుంది. అభినందనలు

    వరప్రసాద్ గారూ!బాగున్నది. అభినందనలు. సస్సాంగత్యమా? దుస్సాంగత్యమా? సాంగత్యమున అనవలెనని నాభావన. పరిశీలింప మనవి.

    అన్నా! మిస్సన్న మహోదయా! నమస్సులు. మీ అందరి దయతో ముందుకు వచ్చాను. పళ్ళమీద చెయ్యివెయ్యకు పళ్ళూడతాయి అన్న చందాన ఉన్నది నా పరిస్థితి. ధన్యవాదములు.

    హనుమచ్ఛాస్త్రిగారూ! సవరించిన మీ పద్యం లో మీభావం ప్రతిబింబిస్తోంది. హంగుగ కన్న హంగగు (జనులయోగ్యులు స్తుతికిన్) అనే అన్వయం ఇంకా శోభించునేమో పరిశీలింపమనవి. అక్షరాల గారడీ మీరు బాగాచేస్తారు. అభినందనలు.

    సహదేవుడుగారూ! మీ పద్యం బాగున్నది. అభినందనలు. బంగారు పంతులు అన్నచోట మేలిమికి బహువచనరూపంగా ప్రయోగించినారా! ( పంతు బంగారం = మేలిమి బంగారం)

    రిప్లయితొలగించండి
  20. శ్రీ శర్మ గారికి ధన్యవాదములు. అక్కడ ఆంధ్రకేసరి శ్రీ ప్రకాశం పంతులు గారిని గురించే వ్రాశాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. చెంగున గుండెలు జూపెడి
    బంగారౌ టంగుటూరు పంతుల వారల్
    లొంగరు స్తుతులకు నుతులకు...
    ఒంగోలున నుండు జనుల యోగ్యులు స్తుతికిన్!

    రిప్లయితొలగించండి