శశికళలైన సూర్యునికి స్వాగతమిచ్చి చనున్ నిశీధినిన్,నిశియును నేగు నిశ్చయము నిర్మలమైన వెలుంగు రాకకై,దశలివి మారుచుండు తమ ధర్మముఁ దప్పక నమ్ము మిత్రమా!శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే?
మశకము వోలె కష్టములు మాటికి మాటికి కుట్టుచుండెనా దశలవి మారుచుండు గద దాటును కష్టములట్లెయుండునా శశి కళలెన్న పెర్గుచును సంతసమందగ పున్నమందుగా శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే?
వాల్మీకి ఆశ్రమంలో సీతకు హనుమ ఓదార్పు :కుశ లవులన్ని విద్యలను గొప్పగ నేర్వగ సంతసింపుమానిశితము నిక్కమన్నది! పునీతవటంచు నయోధ్య వాసులున్విశదముగా నెఱుంగ రఘువీరుడు వచ్చును జానకీ సతీ!శిశిరము గాంచి యెందులకు చింత వసంతము రాక పోవునే?
పశువుల భంగి రేగి ఘన పాండవ పత్నికి నెగ్గుఁ జేయ, దుష్ట శకుని మాయ పాచికల చాడ్పున ద్యూతమునందు గెల్చినన్ కుశలముఁ దప్పునే యశము కూడిన వారల ధర్మ నిష్ఠకున్శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే?
అరణ్యవాసమునకఱిగిన పాండవులతో వారితోపాటు వచ్చిన కొందరు ఋషులు ధర్మరాజుతో అంటునట్లుగా ఒక ఊహ. దశలవి మారుచుండెడు విధంబులెఱుంగుట శక్యమౌనె! మీయశమునకేమి లోటు హృదయంబున శ్రీహరి నామ దీపికా దశనముఁ గల్గియున్న పరతత్వ విచారణ చేయుటేలకో!శిశిరముఁ గాంచి ఎందులకు చింత వసంతము రాకపోవునే. దశనము = కవచము
నిశి, దివసమ్ము రీతిగను నిక్కము విశ్వములోన మానవా!దశల విధాన మారుదువు ధాత్రిని జీవన యాత్రలోన నీ శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే?విశద మిదాది నుండి కని విన్నది పెద్దలు జెప్పు సూక్తియే.
శశకము వోలె కాలమిల సాజము నొందుచు సాగి పోవగా నిశి నటు పారద్రోలి మరి నేవిధి నైనను వేకువన్ గనన్ వశమగు కాలనేమి కన వాసవు డైనను లొంగి పోవుచో శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవు నే ?
నిశిత శరాళి రావణుడు నీల్గగ శ్రీ రఘురామమూర్తి స-ద్యశము గడించి నిన్గలసి హర్షము గూర్చును బాపు దైన్యమున్ కుశలము నీకగున్ త్రిజట కూరిమి పల్కుల నమ్ము జానకీ!శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవు నే?
షెల్లీ కవి రాసిన 'If winter comes ,can spring be far behind?"అనే ప్రసిద్ధపద్య పాదం నుంచి ఈ సమస్యను తీసుకున్నట్లు ఉంది. శశికళ యస్తమించిన విచారమదేలొకొ తెల్లవారెడిన్, కృశమగు దేహపుష్టియు జికిత్సను గాంచును తొల్లి దార్డ్యమున్, వశమగు గెల్పు; నోటమి యవారణమౌనె కృషీపరత్వతన్ ?(పరిశ్రమమ్మునన్) శిశిరము గాంచి యెందులకు చింత ,వసంతము రాకపోవునే?
చక్కని పూరణలను చేసిన కవిమిత్రులు...లక్ష్మీదేవి గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సహదేవుడు గారికి, జిగురు సత్యనారాయణ గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, రాజేశ్వరి అక్కయ్యకు,మిస్సన్న గారికి, కమనీయం గారికి,అభినందనలు, ధన్యవాదాలు.
పశువులు జేరు కొట్టమున పచ్చని గడ్డిని కాంచినంతనేశిశువులు జేరు తల్లియొడి సిగ్గును వీడుచు పాలకోసమైదశలవి మాఱు రాహులుడ! దాగుము సోనియ కొంగునందునన్ శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే?
శశికళలైన సూర్యునికి స్వాగతమిచ్చి చనున్ నిశీధినిన్,
రిప్లయితొలగించండినిశియును నేగు నిశ్చయము నిర్మలమైన వెలుంగు రాకకై,
దశలివి మారుచుండు తమ ధర్మముఁ దప్పక నమ్ము మిత్రమా!
శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే?
మశకము వోలె కష్టములు మాటికి మాటికి కుట్టుచుండెనా
రిప్లయితొలగించండిదశలవి మారుచుండు గద దాటును కష్టములట్లెయుండునా
శశి కళలెన్న పెర్గుచును సంతసమందగ పున్నమందుగా
శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే?
వాల్మీకి ఆశ్రమంలో సీతకు హనుమ ఓదార్పు :
రిప్లయితొలగించండికుశ లవులన్ని విద్యలను గొప్పగ నేర్వగ సంతసింపుమా
నిశితము నిక్కమన్నది! పునీతవటంచు నయోధ్య వాసులున్
విశదముగా నెఱుంగ రఘువీరుడు వచ్చును జానకీ సతీ!
శిశిరము గాంచి యెందులకు చింత వసంతము రాక పోవునే?
పశువుల భంగి రేగి ఘన పాండవ పత్నికి నెగ్గుఁ జేయ, దు
రిప్లయితొలగించండిష్ట శకుని మాయ పాచికల చాడ్పున ద్యూతమునందు గెల్చినన్
కుశలముఁ దప్పునే యశము కూడిన వారల ధర్మ నిష్ఠకున్
శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే?
అరణ్యవాసమునకఱిగిన పాండవులతో వారితోపాటు వచ్చిన కొందరు ఋషులు ధర్మరాజుతో అంటునట్లుగా ఒక ఊహ.
రిప్లయితొలగించండిదశలవి మారుచుండెడు విధంబులెఱుంగుట శక్యమౌనె! మీ
యశమునకేమి లోటు హృదయంబున శ్రీహరి నామ దీపికా
దశనముఁ గల్గియున్న పరతత్వ విచారణ చేయుటేలకో!
శిశిరముఁ గాంచి ఎందులకు చింత వసంతము రాకపోవునే.
దశనము = కవచము
నిశి, దివసమ్ము రీతిగను నిక్కము విశ్వములోన మానవా!
రిప్లయితొలగించండిదశల విధాన మారుదువు ధాత్రిని జీవన యాత్రలోన నీ
శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే?
విశద మిదాది నుండి కని విన్నది పెద్దలు జెప్పు సూక్తియే.
శశకము వోలె కాలమిల సాజము నొందుచు సాగి పోవగా
రిప్లయితొలగించండినిశి నటు పారద్రోలి మరి నేవిధి నైనను వేకువన్ గనన్
వశమగు కాలనేమి కన వాసవు డైనను లొంగి పోవుచో
శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవు నే ?
నిశిత శరాళి రావణుడు నీల్గగ శ్రీ రఘురామమూర్తి స-
రిప్లయితొలగించండిద్యశము గడించి నిన్గలసి హర్షము గూర్చును బాపు దైన్యమున్
కుశలము నీకగున్ త్రిజట కూరిమి పల్కుల నమ్ము జానకీ!
శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవు నే?
రిప్లయితొలగించండిషెల్లీ కవి రాసిన 'If winter comes ,can spring be far behind?"అనే ప్రసిద్ధపద్య పాదం నుంచి ఈ సమస్యను తీసుకున్నట్లు ఉంది.
శశికళ యస్తమించిన విచారమదేలొకొ తెల్లవారెడిన్,
కృశమగు దేహపుష్టియు జికిత్సను గాంచును తొల్లి దార్డ్యమున్,
వశమగు గెల్పు; నోటమి యవారణమౌనె కృషీపరత్వతన్ ?(పరిశ్రమమ్మునన్)
శిశిరము గాంచి యెందులకు చింత ,వసంతము రాకపోవునే?
చక్కని పూరణలను చేసిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సహదేవుడు గారికి,
జిగురు సత్యనారాయణ గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
మిస్సన్న గారికి,
కమనీయం గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
పశువులు జేరు కొట్టమున పచ్చని గడ్డిని కాంచినంతనే
రిప్లయితొలగించండిశిశువులు జేరు తల్లియొడి సిగ్గును వీడుచు పాలకోసమై
దశలవి మాఱు రాహులుడ! దాగుము సోనియ కొంగునందునన్
శిశిరముఁ గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే?