గురువర్యులకు,కవిమిత్రులకు, వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.శ్రీరామశ్శరణం మమ. రామా! లయమును జేయుము రా! మాయను యిహమునందు రాగము ననుచున్ రామాలయమును జేరుచు రామా!యను వారి రక్ష రాముడె చూచున్ .
మంగళ సూ త్రం బదిగోమంగళమును గలుగ జేయు మానవుల కిలన్మంగళముగ నా రాముడుఅం గన యౌ సీ త మెడన హారము సేయున్ .
స్రగ్విణీ:రామ కళ్యాణమే రామ కళ్యాణమేరాముతో జానకీ రామ కళ్యాణమేఏమి సౌభాగ్యమో యీ మహాపర్వమేశ్రీ మహాపర్వమై శ్రేయముల్ కూర్చుతన్రాముడే సద్గుణారాముడే శ్యాముడేరామతో జానకీరామతో నొప్పగాఏమి సౌభాగ్యమో యీ మహాపర్వమేశ్రీ మహాపర్వమై శ్రేయముల్ కూర్చుతన్శ్రీమహావిష్ణువున్ శ్రీమహాలక్ష్మియున్ప్రేమతో వేదిపై వెల్గులన్ నింపగా ఏమి సౌభాగ్యమో యీ మహాపర్వమేశ్రీ మహాపర్వమై శ్రేయముల్ కూర్చుతన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సీతా రాముల మనువదిభూతల భద్రాద్రి పైని ముచ్చట గూర్చన్చేతల ద్విజులటఁ జేయగరాతల మార్చియు శుభంబు రఘువరుడొసగున్!
దేవతలు మునులు నరులును భావంబున జేయుచుండ ప్రణుతులు మిథిలా భూవిభుడు ప్రేమ పొంగెడు భావంబున జేసె నిట్లు భాషణ మనఘా!ఈమె నా సుత! జానకి! యింతి నీకు! పాణి గ్రహియింపు మోరామ! భద్రమలర! ఛాయ వోలెను నీవెంట చనును సతమునో మహా భాగ! సతిఁజూడు ప్రేమతోడ!భద్ర గిరిపైన వెలసిన భద్రమూర్తి రామ కల్యాణ వైభవ రమ్య పర్వ శోభ లందున మంగళ సూత్ర ఘట్ట మిద్ది కన రారె! జనులార! యింపు గొలుపు!
శ్రీ రామనామ జపమును నోరారగ పలికి నంత నోము ఫలించున్ శ్రీ రాముని మన సెన్నడు కారుణ్యము గలిగి జనుల కాపాడు ననన్
రామనవమి శుభాకాంక్షలు తెలిపిన మిత్రులకు ధన్యవాదాలు.*శ్రీరామ కళ్యాణోత్సవ చిత్రంపై మధురమైన పద్యాలు రచించిన కవిమిత్రులు...గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సుబ్బారావు గారికి, పండిత నేమాని వారికి, సహదేవుడు గారికి, మిస్సన్న గారికి, రాజేశ్వరి అక్కయ్యకుఅభినందనలు, ధన్యవాదాలు.
గురువర్యులకు,కవిమిత్రులకు, వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిశ్రీరామశ్శరణం మమ.
రామా! లయమును జేయుము
రా! మాయను యిహమునందు రాగము ననుచున్
రామాలయమును జేరుచు
రామా!యను వారి రక్ష రాముడె చూచున్ .
మంగళ సూ త్రం బదిగో
రిప్లయితొలగించండిమంగళమును గలుగ జేయు మానవుల కిలన్
మంగళముగ నా రాముడు
అం గన యౌ సీ త మెడన హారము సేయున్ .
స్రగ్విణీ:
రిప్లయితొలగించండిరామ కళ్యాణమే రామ కళ్యాణమే
రాముతో జానకీ రామ కళ్యాణమే
ఏమి సౌభాగ్యమో యీ మహాపర్వమే
శ్రీ మహాపర్వమై శ్రేయముల్ కూర్చుతన్
రాముడే సద్గుణారాముడే శ్యాముడే
రామతో జానకీరామతో నొప్పగా
ఏమి సౌభాగ్యమో యీ మహాపర్వమే
శ్రీ మహాపర్వమై శ్రేయముల్ కూర్చుతన్
శ్రీమహావిష్ణువున్ శ్రీమహాలక్ష్మియున్
ప్రేమతో వేదిపై వెల్గులన్ నింపగా
ఏమి సౌభాగ్యమో యీ మహాపర్వమే
శ్రీ మహాపర్వమై శ్రేయముల్ కూర్చుతన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసీతా రాముల మనువది
భూతల భద్రాద్రి పైని ముచ్చట గూర్చన్
చేతల ద్విజులటఁ జేయగ
రాతల మార్చియు శుభంబు రఘువరుడొసగున్!
దేవతలు మునులు నరులును
రిప్లయితొలగించండిభావంబున జేయుచుండ ప్రణుతులు మిథిలా
భూవిభుడు ప్రేమ పొంగెడు
భావంబున జేసె నిట్లు భాషణ మనఘా!
ఈమె నా సుత! జానకి! యింతి నీకు!
పాణి గ్రహియింపు మోరామ! భద్రమలర!
ఛాయ వోలెను నీవెంట చనును సతము
నో మహా భాగ! సతిఁజూడు ప్రేమతోడ!
భద్ర గిరిపైన వెలసిన భద్రమూర్తి
రామ కల్యాణ వైభవ రమ్య పర్వ
శోభ లందున మంగళ సూత్ర ఘట్ట
మిద్ది కన రారె! జనులార! యింపు గొలుపు!
శ్రీ రామనామ జపమును
రిప్లయితొలగించండినోరారగ పలికి నంత నోము ఫలించున్
శ్రీ రాముని మన సెన్నడు
కారుణ్యము గలిగి జనుల కాపాడు ననన్
రామనవమి శుభాకాంక్షలు తెలిపిన మిత్రులకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి*
శ్రీరామ కళ్యాణోత్సవ చిత్రంపై మధురమైన పద్యాలు రచించిన కవిమిత్రులు...
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
పండిత నేమాని వారికి,
సహదేవుడు గారికి,
మిస్సన్న గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు
అభినందనలు, ధన్యవాదాలు.