24, ఏప్రిల్ 2013, బుధవారం

పద్య రచన - 321 (పిసినిగొట్టు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“పిసినిగొట్టు”

11 కామెంట్‌లు:

 1. కడుపుకింత తినక కబళ మొరుల కీక
  మూట గట్టి దాచి మూల బెట్ట
  ' మూల ' ధనము బోవు ముద్దుగా నొరులకు
  ముద్ద దొరక కితడు మూల బడును.

  రిప్లయితొలగించండి
 2. దానఫలమె మనల దయతోడ కాపాడు
  దాచి యుంచి నట్టి ధనము పరుల
  పాలగునట కడకు, పంచి పెట్టుటె మేలు
  పిసినిగొట్టు తనముఁ గసిరి గొట్టు!

  రిప్లయితొలగించండి
 3. పిసిని గొట్టులు దినరు దా బెట్ట రితరు
  లకును గూడ బెట్టుచు దొరల కిల యప్ప
  గిం తు రం తి యె మఱి యిసుమంత లాభ
  ముండ దార్య ! వా నిధనము దిండు నకును .

  రిప్లయితొలగించండి
 4. తాను తినక సొమ్ము తనవారికీకుండ
  దానమీయకుండ దాచువాడు
  గడ్డి వాము చెంత కాపుండు శునకము
  నిజమె పలుకు చుంటి నీరజాక్ష

  రిప్లయితొలగించండి
 5. లోభి యొకడు చాల లాభములు గణించి
  కోట్ల కోట్ల ధనము కూడ బెట్టి
  తుదకు దొంగ లొచ్చి తుడిచి పెట్టుకు పోగ
  నెత్తి బాదు కేడ్చె నీతి మాలి

  రిప్లయితొలగించండి

 6. చీమలు పెట్టిన పుట్టలు
  పాములకిరవైన యట్లు,ఫలమేమియు లే
  దామనుజునకును లుబ్ధత,
  కామన నొందెదలితరులు కడకా సిరితో.

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. పట్టుకొనుచుండు పైసను పట్టుతోడ
  బందువొచ్చిన చెప్పును బాధలెన్నొ
  విసరడేమియు కాకికి వీసమంత
  ఖర్చుపెట్టక తనకైన కాటికేను.

  రిప్లయితొలగించండి
 9. పిసినిగొట్టును గురించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  చంద్రశేఖర్ గారికి,
  సుబ్బారావు గారికి,
  పంతుల గోపాలకృష్ణారావు గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  కమనీయం గారికి,
  ప్రభల రామలక్ష్మి గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. రాజేశ్వరి అక్కయ్యా,
  ‘దొంగలు + ఒచ్చి’ అన్నారు. అది వచ్చి కదా... అక్కడ ‘దొంగ వచ్చి’ అనండి.

  రిప్లయితొలగించండి
 11. కలదని సుఖముగ బ్రతుకక
  విలువలుఁ దెలియక, జనములు పిసినారియనన్
  కలిమి తనతో మిగులునని
  కలలో ఖర్చైన గాని కలవర పడడే?

  రిప్లయితొలగించండి