28, ఏప్రిల్ 2013, ఆదివారం

పద్య రచన - 325 (పాదయాత్ర)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“పాదయాత్ర”

9 కామెంట్‌లు:

  1. దండు కదలగ పండెగా దండి వరకు
    పాద యాత్రయె ' స్వేచ్చ ' సంపాదయాత్ర
    దండు గగునో మరి రేపు పండు గగునొ
    పాదయాత్రయె ' యిచ్చ ' సంపాదయాత్ర

    రిప్లయితొలగించండి
  2. పాద యాత్రలు సేయుట ప్రబల మయ్యి
    శుష్క వాగ్దానముల జేయు చుందు రపుడు
    గద్దె నెక్కిన పిమ్మట గాన రారు
    కార్య కర్తలు సహితము నాయకులకు .

    రిప్లయితొలగించండి
  3. పాదయాత్రల యెల్ల గమ్యమొక్కటె
    పదవి పొందుటె అందు మర్మము
    పెదవి విరుతురు పదవినందిననంతనె
    యిదియె కంటిమి పెక్కుమారులు

    రిప్లయితొలగించండి


  4. కాశి యాత్ర యనుచు గల్లలా డల్లుండు
    కామితార్ధి గాక సామి యగునె ?
    కాలు నేల మోపి గామందు సేయంగ
    పాద యాత్ర ఫలము పదవి గాదె ?

    రిప్లయితొలగించండి
  5. ధర్మమార్గనిరతి ధరియిత్రి నిలుపగా
    నాదిశంకరుండె యవతరించె
    పాదయాత్ర సలుపె పారమార్థికబోధ
    దేశమెల్ల జేసె దేవసముడు.

    రిప్లయితొలగించండి
  6. ఊది నిచ్చెడు వారల కున్న దదియె
    వాదు లాడెడు వారల వరుస నిదియె
    నిహపరంబుల నీడేర నిదియె దారి
    బయలు దేరర చేయగ పాద యాత్ర

    రిప్లయితొలగించండి
  7. క్రొత్త బిచ్చ గాని వలెను కోరి తిరిగి
    ఎన్టి వోడు గెలిచె గొప్ప ఎన్నికలను
    పాత దైననుబొ యదియె బాటఁ బట్టి
    రాజశేఖర రెడ్డియు రక్తి గట్టె

    చంద్రబాబు నాయుడు బట్టె ఇంద్ర జాల
    మహిమ జూపుచు దానినె మరల మరల,
    వెరసి పాత మంత్రములను వేయ క్రొత్త
    చింత కాయలు రాలునా చెప్పు బాబు !

    రిప్లయితొలగించండి
  8. వేద మంత్రము లెరిగిన నాది గురువు
    పాద చారిగ తిరిగిరి పాప హరము
    యతులు పూజ్యులు చేయగ హితము కోరి
    నేటి నేతల యాత్రలు నీతి మాలి !

    రిప్లయితొలగించండి
  9. పదవి లేని కాలమున ప్రజల కడగండ్లు జూడ
    పాదయాత్రలు చేయుదురు, పదవినొందినంతనె
    మదమాత్సర్యములు తిరిగి తలలోనకెక్కును
    రాదు రామరాజ్యము నేటి రాబందు నేతలతో

    రిప్లయితొలగించండి