26, ఏప్రిల్ 2013, శుక్రవారం

పద్య రచన - 323 (రామప్ప దేవాలయము)

కవిమిత్రులారా,
రామప్ప దేవాలయము
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. చిత్ర మయ్యది జూడుము చిత్ర మందు
    అద్భుతంబుగ నుండెను నందమునన
    కాక తీ యుల కాలపు కట్ట డమది
    అరయ రామప్ప నిర్మిత యాల యమ్ము .

    రిప్లయితొలగించండి
  2. గొప్ప దేవళములు జీర్ణ వ్యవస్థన ముక్కు చున్నవి
    తప్ప తాగి తూలిపోవు నేటి జనులకు నేదియు
    తప్పు కాదు, హత్యాచారముల నుండి కాపాడి కను
    విప్పు చేయగ మరల రావోయి ఓ రామప్ప దేవా !

    రిప్లయితొలగించండి
  3. శిల్పమ్ముల సంపదనొక
    శిల్పి సృజింపగ వెలసెను; సిద్ధముగా నా
    కల్పాంతము తలచుకొనుచు
    నిల్పిరి నాతనిదె పేరు; నిక్కమ్మిదియే.

    రిప్లయితొలగించండి
  4. ఎనిమిది వందేళ్ళ చరిత!
    కనువిందౌ శిల్ప ఘనత! కాంచిన చాలున్!
    కనుమరు గౌనని దీనత!
    వినుతించెదఁగదిలి యువత పెన్నధి నిలుపన్!

    రిప్లయితొలగించండి
  5. క్రాలన్ రాముడు నీశ్వరుండు నొకటై రామప్పగా "తార" రూ
    పాలంకారపుధామ "మేకశిల"లో ప్రాచీన నిర్మాణమై!!
    "పాలంపేట" పురాతన స్థలిని సొంపారంగ దేవాలయం
    బై లోకోత్తరమైన ఖ్యాతిఁ గొనెనే యాంధ్రావనిన్ గాంచగా!!

    రిప్లయితొలగించండి
  6. కళలకు కాణాచి కాకతీయులభూమి
    .....యోరుగల్పురసీమ యున్నతంబు,
    తత్సమీపస్థమై దర్శనార్థులకెప్పు
    .....డానందమును బంచి యఘము ద్రుంచు
    రామప్ప దేవళం బేమని వర్ణింతు
    .....సౌందర్యరాశి యామందిరంబు
    పాలంపుపేటలో భవ్యశిల్పాలతో
    .....వెలుగొందు హరిహర నిలయమందు
    రామలింగేశ్వరుండందు రమ్యముగను
    భక్తజనముల కెల్లెడ భాగ్య మొసగి
    సంతతానందమును గూర్చి యంతులేని
    సౌఖ్య మొసగంగ వసియించు సంతసాన.

    శిల్పి రామప్ప యచ్చట చెక్కియుండె
    కనులపండుగ యొనరించి మనము దోచు
    శిల్పరాజంబు లెన్నియో చిత్రగతుల
    నతని ననవచ్చు నిజముగా నమరశిల్పి.

    అచ్చటి నిర్మాణంబున
    కెచ్చటివోగాని మంచి యిటుకలు నాడున్
    తెచ్చిరట, నీటిలోనవి
    అచ్చెరువుగ తేలుచుండు నద్భుతరీతిన్.

    దేవళంబు బయట జీవ మున్నట్లుగా
    శివుని యాజ్ఞ కొరకు చెవులు నిలిపి
    చూచు దాని వోలె గోచరమగుచుండు
    నంది యెంతయేని సుందరంబు.

    ఆసమీపమందు నతివిస్తృతంబైన
    సరము నొక్కదాని నరయవచ్చు
    ఔర! యా తటాక మచ్ఛోద యుతమౌచు
    హర్షదాయి సతము కర్షకులకు.

    ఓరుగల్లులోన చేరి శిక్షణ నందు
    నాడు దీని జూచినాడ, నేడు
    శంకరార్య! మీరు స్మరియించు భాగ్యంబు
    నందజేసినారు వందనంబు.

    రిప్లయితొలగించండి
  7. రామప్ప దేవాలయ మ్మున
    రామ లింగేశ్వరుడు వెలసె రాజస మొప్పన్ !
    ధీమంతుడు విశ్వ బ్రాహ్మణు
    క్షేమంబుగ నతనిపేర కీర్తి గడించెన్ !
    -----------------------------------------
    కాక తీయుల విభవమ్ము కనుల విందు.
    శిల్ప సౌందర మెన్నగ నల్ప మగును
    శిల్పి రామప్ప పేరిట శివుని గుడిగ
    శిల్పి తనచేత వెలుగొంద మలిచె శిలలు

    రిప్లయితొలగించండి


  8. కాకతీయుల కళా కాంక్షాభిరుచులకు
    ప్రత్యక్షసాక్షిగా పరిఢవిల్లె
    అష్టకోణాకృతి నమరిన వేదిక
    నిర్మాణచాతురీ మార్మికతను
    నవరస భావనా నాట్యభంగిమలతో
    రాగిణీరంజిత నాగినులను
    అప్సరోభామినీ హసితవదనముల
    యద్భుతాలయము రామప్ప సృష్టి
    సుమల తాదేహ సుకుమార సుందరులను
    జీవకళలొల్కు విగ్రహ చిత్రరచన
    అశ్వగజ మయూరాది శిల్పాభిరామ
    మంజులమ్ము మనోహర మందిరమ్ము.




    రిప్లయితొలగించండి
  9. క్షమించాలి . రెండవ పాదంలో పొరబాటు

    కాక తీయుల విభవమ్ము కనుల విందు.
    శిల్ప సౌందర్య మెన్నగ నల్ప మగును
    శిల్పి రామప్ప పేరిట శివుని గుడిగ
    శిల్పి తనచేత వెలుగొంద మలిచె శిలలు

    రిప్లయితొలగించండి
  10. అనుపమ శిల్ప సంపదలు నద్భుత రూప విలాస వైభవం
    బును శుభలక్షణంబులును పొల్పెసలారెడు దేవళంబునై
    తనరును విష్ణు శంకరుల ధామము రామప మందిరమ్ము స
    జ్జన హృదయాభిరామముగ శాంతిసుఖప్రద పావన స్థలిన్

    రిప్లయితొలగించండి