10, ఏప్రిల్ 2013, బుధవారం

సమస్యాపూరణం – 1019 (అనుజుఁ డగ్రజుఁ డాయె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.

24 కామెంట్‌లు:

 1. గురుదేవులు, సహజకవి, సహృదయులు పండిత నేమాని వారి పూరణలు, పద్యాలు, వ్యాఖ్యలు నిన్న, మొన్న లేకపోవడం గొప్పలోపంగా గోచరిస్తున్నది. కారణం తెలియదు.

  రిప్లయితొలగించండి
 2. రాము ననుజుడు గా నున్న లక్ష్మణుండు
  రాము డను పేర నన్నగా రాయె హరికి
  విష్ణు రచనను శేషుండు వేడ్కగాను
  అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.

  రిప్లయితొలగించండి
 3. గోలి హనుమచ్ఛాస్త్ర గారూ,
  అచ్చంగా నేననుకున్న భావంతోనే పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. అనుజుడగ్రజు తోడుగా నరిగె నడవి,
  యనుజుడనగానితడుగాదె యనగ జగతి;
  యగ్రజుని తో మరల దానె యవతరించి
  యనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.

  రిప్లయితొలగించండి
 5. మాస్టరు గారూ ! ధన్యవాదములు.

  ' గురు '(తర) బాధ్యతను చక్కగా నిర్వర్తించి నిన్నటి కవి మిత్రుల పూరణలపై చక్కని విశ్లేషణలు చేసిన శ్రీ తోపెల్ల వారికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. అటవి జానకీ రాముల ననుసరించి
  యపహరణ బడు సీతకై యాలపించు
  రామచంద్రుని నోదార్చి లక్ష్మణుండు
  ననుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.

  రిప్లయితొలగించండి
 7. అన్నదమ్ములు నాటకమ్మందు జేర
  పాత్ర లెంపిక జేయగా పాండవులకు
  ఒడ్డు పొడుగుల నెంచుచు నుండ కడకు
  అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున.

  రిప్లయితొలగించండి


 8. కౌరవులకు సింహస్వప్నమై రహించు
  దండి పోటరి భీముఁడు ధర్మజునకు
  ననుజుఁ; డగ్రజుఁ డాయెఁ దా నాదరమున
  నర్జున నకుల సహదేవు లభినుతింప

  అర్జునుండు పాండవమధ్యమాభిధేయుఁ
  డౌను ధర్మజ భీముల కతఁడు ప్రీతి
  ననుజుఁ; డగ్రజుఁ డాయెఁ దా నాదరమున
  నకుల సహదేవులకు భండనమునఁ దోడు.  రిప్లయితొలగించండి
 9. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహమూర్తి గారూ,
  మీ పూరణ కరుణరసాత్మకంగా చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. గోలి వారూ,
  అన్న తమ్ముడి వేషం, తమ్ముడు అన్న వేషం వేసినట్లు చెప్పిన మీ రెండవ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. హనుమచ్ఛాస్త్రి గారి లక్ష్మ్మీదేవి గారి పూరణలు చాలా బాగున్నాయి. గురువు గారూ ! మీ మీ పూరణ లద్భుతము. అందఱికీ అభివందనములు.

  రిప్లయితొలగించండి
 12. టైపాటుల వలన ఒప్పులు తప్పులవుతాయి కాని తప్పు లొప్పులవ వెందుకో !

  రిప్లయితొలగించండి
 13. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి, పెద్దలకు
  శుభోదయప్రణామములు!

  విశ్వసృష్టిస్థితివిలయంబు లెల్ల రూపించినా వందు దీపించినావు
  దేవారిగణముల దేవగణముల రాపాడినావు దయఁ గాపాడినావు
  ధర్మరక్షార్థమై ధరణీతలమున జీవించినావు మము దీవించినావు
  శిశుపాలు ముక్తికై పశుపాలుఁ డంచుఁ బల్కించినావు గృప నొల్కించినావు

  రాజసూయంబు సేయింపు రక్ష గాఁగ
  యజ్ఞరూపుఁడ వీవు గా కగ్రపూజ
  కర్హు లెవ? రంచు ధర్మజుం డడుగ; సీరి
  యనుజుఁ డగ్రజుఁ డాయె దా నాదరమున.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 14. కవ ల పిల్లలు వారలు ,లవ కుశలు ల లోన
  అనుజు డగ్రజు డాయె, దానాదరమున
  నేర్పె వాల్మీకి వారికి నియతి తోడ
  రామ కధ యను బేరున రామ గాధ

  రిప్లయితొలగించండి
 15. ఔర! యొకచోట కార్యాలయంబునందు
  తమ్ముడధికారియయ్యెను దానిలోన
  నన్న బంట్రోతు మొదటనె, యెన్న నచట
  ననుజు డగ్రజుడాయె తానాదరమున.

  రిప్లయితొలగించండి


 16. శేషుడాయె సౌమిత్రిగా సేవజేయ,
  రామచంద్రుని తమ్ముడై రాత్రి పవలు,
  రాముడై పొందె శౌరి గౌరవము,సేవ,
  అనుజుడగ్రజుడాయె దా నాదరమున.

  రిప్లయితొలగించండి
 17. అస్త్ర శస్త్ర ప్రవీణు డా యర్జనుండు
  సంగర విజేత పాండవ సవ్యసాచి
  యనుజు, డగ్రజు డాయె దా నాదరమున
  ధర్మ నిరతుడు భీమున్కి ధర్మరాజు

  రిప్లయితొలగించండి
 18. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి, పెద్దలకు
  ప్రణామములు!

  చమత్కారార్థమై, మఱొక విఱుపు:

  రంగభూమిపై నటనంబు రాక; వేష
  ధారణ మొనర్చి నటకులు తాఱుమాఱుఁ
  గనిరి పాత్రల; నగ్రజుం డనుజుఁ డయ్యె,
  ననుజుఁ డగ్రజుఁ డయ్యెఁ దా నా దరమున.

  దరము = భయము.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 19. డా. ఏల్చూరి వారి హరి స్తుతి పరమానందదము.

  ఆదిజుండైన బ్రహ్మకు నతడు తండ్రి
  వేద సన్నుతుడును హరి వెన్నుడు విను-
  డనగ భీష్ముండు రాజసూయమున హలికి
  ననుజుడగ్రజుడాయె దా నాదరమున.
  *****************
  బ్రహ్మ తండ్రియు నామ్నాయ వందితుడును
  మూడు లోకాల దిక్కు దామోదరుండె
  యనగ భీష్ముండు యాగాన హలధరునకు
  ననుజుడగ్రజుడాయె దా నాదరమున.

  రిప్లయితొలగించండి
 20. నిన్నటి శర్మ గారి సమీక్ష మనోహరం. వారికి ప్రత్యేక అభినందనలు.

  అన్న కర్మకు వ్యాపార మచ్చి రాక
  నసలు పోయెను లక్షల యప్పు మిగిలె
  సహృదయంబున తమ్ముడు సాయ మీయ
  ననుజు డగ్రజుడాయెఁ దా నాదరమున

  రిప్లయితొలగించండి
 21. మాయ లేడంచు వారించె మంచి మాట
  హితము జెప్పెను సౌమిత్రి మితము గాను
  ఆర్త నాదము విన్నంత యార్తి జెంది
  అనుజుఁ డగ్రజుఁ డాయెఁ దా నాదరమున

  రిప్లయితొలగించండి
 22. అనుజుని అగ్రజునిగా చేస్తూ మంచి మంచి పూరణలు చెప్పిన కవిమిత్రులు....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  ఏల్చూరి మురళీధర రావు గారికి,
  సుబ్బారావు గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  కమనీయం గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  మిస్సన్న గారికి,
  సహదేవుడు గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి